- Home
- Entertainment
- బాలకృష్ణ గెస్ట్ రోల్ చేసిన సినిమా ఏంటో తెలుసా? తెలుగు సినిమాల్లోనే అది చాలా స్పెషల్..
బాలకృష్ణ గెస్ట్ రోల్ చేసిన సినిమా ఏంటో తెలుసా? తెలుగు సినిమాల్లోనే అది చాలా స్పెషల్..
నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు రీమేక్‌లకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు గెస్ట్ రోల్స్ కి కూడా దూరంగా ఉంటారు. అయితే ఒకే ఒక్క సినిమాలో ఆయన మెరిశారు.

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్‌లో సీనియర్లలో సక్సెస్ జోరులో ఉన్న ఏకైక హీరో బాలకృష్ణ. `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి` చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్నారు. హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. అదే జోరులో ఇప్పుడు మరో భారీ సినిమాతో వస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో చాలా మంది హీరోలు ఏదో సినిమాల్లో గెస్ట్ లుగా మెరుస్తున్నారు. ఆయా చిత్రాలకు తమ వంతు పుష్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గెస్ట్ రోల్స్ కి మాత్రం బాలయ్య దూరం. ఆయన ఇప్పటి వరకు గెస్ట్ రోల్స్ లో నటించిన చిత్రం ఒకే ఒక్కటి మాత్రమే కావడం విశేషం. తండ్రి ఎన్టీఆర్‌తో చాలా సినిమాల్లో కాస్త్ ఎక్కువ ఉన్న పాత్రల్లో మెరిసినా, ఆయన సోలో హీరోగా మారిన తర్వాత మాత్రం గెస్ట్ రోల్స్ చేసింది లేదు.
మరి ఇంతకి ఆ ఒక్క మూవీ ఏంటనేది చూస్తే, అదే `త్రిమూర్తులు`. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో అర్జున్, రాజేంద్రప్రసాద్‌లు కూడా హీరోలు. మల్టీస్టారర్ మూవీ అని చెప్పొచ్చు. ఇందులో బాలయ్య గెస్ట్ రోల్లో కనిపించారు. కె మురళీ మోహన్‌రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1987లో విడుదలైంది.
అయితే ఈ మూవీ తెలుగు ఇండస్ట్రీలోనే చాలా ప్రత్యేకమైన సినిమా కావడం విశేషం. చిరంజీవి, నాగార్జున కూడా గెస్ట్ లుగా మెరిశారు. వీరితోపాటు ఇండస్ట్రీ మొత్తం దిగింది. కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చంద్రమోహన్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, విజయశాంతి, రాధ, భాను ప్రియ, రాధికతోపాటు శారద, జయమాలిని, అనురాధ, వై విజయ వంటి వారు గెస్ట్ లుగా మెరిశారు. ఇలా ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ అంతా ఇందులో గెస్ట్ లు మెరిశారు. అలా ఈ మూవీ చాలా ప్రత్యేకతని సంతరించుకుంది.
చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ వంటి నలుగురు టాప్ స్టార్స్ నటించిన ఒకే ఒక సినిమా `త్రిమూర్తులు` కావడం విశేషం. కానీ ఇది పెద్దగా ఆడలేదు. భారీ కాస్టింగ్ ఉన్నా సినిమాలో విషయం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆడలేదు. హిందీలో వచ్చిన `నసీబ్` చిత్రానికి ఇది రీమేక్. అక్కడ మంచి విజయం సాధించింది. తెలుగులో మాత్రం డిజప్పాయింట్ చేసింది.
బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి పవర్‌ఫుల్ నేమ్స్ వినిపిస్తున్నాయి. అందులో భాగంగా `వీరమాస్` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. ఇక ఈ చిత్రంలో `యానిమల్` ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపిస్తారని సమాచారం. దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో మెరుస్తారని టాక్.