- Home
- Entertainment
- చిరంజీవి ఖతర్నాక్ షో ముందు బాలయ్య, విజయశాంతి కష్టం వృధా.. కనిపించకుండా పోయిన ఫ్లాప్ మూవీ
చిరంజీవి ఖతర్నాక్ షో ముందు బాలయ్య, విజయశాంతి కష్టం వృధా.. కనిపించకుండా పోయిన ఫ్లాప్ మూవీ
మెగాస్టార్ చిరంజీవి నటించిన దొంగ మొగుడు మూవీ విశేషాలు ఈ కథనంలో తెలుసుకోండి. ఈ చిత్రానికి పోటీగా వచ్చిన బాలయ్య, విజయశాంతి మూవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.

చిరంజీవి దొంగ మొగుడు మూవీ
ఖైదీతో స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవికి ఆ తర్వాత 1987 నుంచి తన కెరీర్ ని పీక్ స్టేజికి తీసుకువెళ్లారు. 1987 నుంచి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడం చిరంజీవికి అలవాటుగా మారింది. 1987లో సంక్రాంతి నుంచే చిరంజీవి జైత్ర యాత్ర ప్రారంభించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన దొంగ మొగుడు చిత్రం విడుదలైంది
డ్యూయెల్ రోల్ లో నటించిన చిరంజీవి
ఈ మూవీలో చిరంజీవి సరసన రాధిక, మాధవి, భాను ప్రియా నటించారు. చిరంజీవి ఈ మూవీలో డ్యూయెల్ రోల్ లో నటించారు. చిరంజీవి దొంగగా, వేధింపులకు గురయ్యే భర్తగా అద్భుతంగా నటించారు. చిరంజీవి ఖతర్నాక్ షో ప్రభావంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది.
దొంగ మొగుడు ముందు నిలబడలేకపోయిన బాలయ్య మూవీ
దొంగ మొగుడు చిత్రానికి పోటీగా బాలకృష్ణ నటించిన భార్గవ రాముడు చిత్రం విడుదలైంది. విశేషం ఏంటంటే ఈ చిత్రానికి కూడా దర్శకుడు కోదండరామిరెడ్డే. ఈ మూవీలో బాలయ్యకి జోడీగా విజయశాంతి, మందాకిని నటించారు. భార్గవ రాముడు చిత్రం.. దొంగమొగుడు మూవీ సంచలనం ముందు నిలబడలేకపోయింది.
బాలయ్య, విజయశాంతి కష్టం వృధా
దీనితో భార్గవరాముడు చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో దొంగ మొగుడు చిత్రం టాప్ 2 గా నిలిచింది. టాప్ 1 కూడా చిరంజీవి చిత్రమే. పసివాడి ప్రాణం మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. భార్గవ రాముడు చిత్రంలో బాలయ్య, విజయశాంతి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ అందించారు. కానీ వర్కౌట్ కాలేదు. దీనితో చిరంజీవి డ్యూయెల్ రోల్ లో అందించిన వినోదం బాగా హైలైట్ అయింది.
చిరంజీవి మెమొరబుల్ పెర్ఫార్మెన్స్
దొంగ మొగుడు చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు. గొల్లపూడి మారుతీరావు, గిరిబాబు, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య కీలక పాత్రల్లో నటించారు. దొంగ పాత్రలో చిరంజీవి అందించిన వినోదం మెమొరబుల్ గా నిలిచిపోయింది.