ఇటీవల కొన్ని రోజులుగా ఓ మరాఠీ నటి ఇంటర్నెట్ ని ఊపేస్తోంది. ఆమె పేరు గిరిజా ఓక్. 37 ఏళ్ళ వయసులో సరికొత్త నేషనల్ క్రష్ గా అవతరించింది.
గిరిజా ఓక్ మరాఠీ, హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె లిప్ లాక్ సీన్ల గురించి, ఇంటిమేట్ సన్నివేశాల గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా వైరల్ అయ్యారు.
ఆమె లుక్స్ బాగా నచ్చడంతో నెటిజన్లు మరింతగా ఆమె ఫోటోలని వైరల్ చేస్తున్నారు. గిరిజా ఓక్ తాను నటించిన సినిమాలు, వెబ్ సిరీస్ లలో బోల్డ్ రొమాంటిక్ సీన్స్ లో నటించారు.
రొమాంటిక్ సీన్స్ లో తనకు గుల్షన్ దేవయ్యతో నటించడం చాలా కంఫర్టబుల్ అంటూ ఓపెన్ గా కామెంట్స్ చేశారు. థెరపీ షెరపీ సిరీస్ లో వీళ్ళిద్దరూ నటించిన సంగతి తెలిసిందే.
37 ఏళ్ళ వయసున్న గిరిజ బిజినెస్ మేనేజ్ మెంట్, బయో టెక్నాలజీ లలో డిగ్రీలు చేశారు. ఆమె ఆమిర్ ఖాన్ తారే జమీన్ పర్ చిత్రంలో ఓ పాత్రలో నటించారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించారు.
బుల్లితెరపై ఆమె సీఐడీ, లేడీస్ స్పెషల్, కార్టెల్, మోడ్రన్ ముంబై లవ్ లాంటి టీవీ సిరీస్ లలో నటించారు. క్రమంగా గిరిజ రొమాంటిక్ పాత్రలు చేస్తూ పాపులారిటీ పొందారు.
గిరిజా ఓక్ 2011లో దర్శకుడు సుహృద్ ని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. వీరికి ఓ కుమారుడు సంతానం. గిరిజ తండ్రి గిరీష్ ఓక్ కూడా చిత్ర పరిశ్రమకు చెందినవాడే. ఆయన మరాఠీ సినిమాల్లో నటుడు
గిరిజకి చేనేత చీరలు ధరించి సింపుల్ గా ఉండడం ఇష్టం. అదే విధంగా పాటలు పాడడం అంటే బాగా ఇష్టం అట. ఒత్తిడి తగ్గించుకునేందుకు పాటలు పాడతానని గిరిజ పేర్కొంది.
గిరిజా చివరగా షారుఖ్ జవాన్, ది వాక్సిన్ వార్, ఇన్స్పెక్టర్ జండే లాంటి సినిమాల్లో నటించింది. సౌత్ నటుడు సందీప్ కిషన్ తో కలిసి గతంలో ఆమె షోర్ ఇన్ ది సిటీ అనే సినిమాలో నటించింది.