MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి ఒకరితో, ఫస్ట్ నైట్ మరొకరితో, ఇదెక్కడి సినిమా రా బాబు, ఓటీటీని ఊపేస్తోంది.

పెళ్లి ఒకరితో, ఫస్ట్ నైట్ మరొకరితో, ఇదెక్కడి సినిమా రా బాబు, ఓటీటీని ఊపేస్తోంది.

పెళ్లి ఒకరితో.. ఫస్ట్ నైట్ మరొకరితో.. చివరకు ఈ కథ ఏమయ్యింది అనేది తెలుసుకోవాలి అంటే ఓటీటీలో రచ్చ చేస్తోన్న ఒక సినిమాను చూడాల్సిందే. ఇంతకీ ఏంటా సినిమా? ఎక్కడ చూడవచ్చు? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 30 2025, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

థియేటర్లకు పోటీ ఇస్తున్నాయి ఓటీటీలు. డిఫరెంట్ కంటెంట్ తో ఆకట్టుకుంటున్నాయి. ఆడియన్స్ ను స్క్రీన్ ముందు కట్టిపడేస్తున్నాయి. థియేటర్లు ఒకెత్తు, ఓటీటీలు ఇంకొకెత్తు అన్నట్లుగా ప్రతి వారం కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తాజాగా ఓ సినిమా బుల్లితెరను దడదడలాడిస్తోంది. రొమాంటిక్ డ్రామాగా స్ట్రీమింగ్ అయ్యి, ఆడియన్స్ ను అలరిస్తోంది. లవ్ స్టోరీని డిఫరెంట్ యాంగిల్ లో చూపించి ఈసినిమాపేరు బ్యాడ్ న్యూస్. బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా మూవీ తాజాగా స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

25
Image Credit : Asianet News

బ్యాడ్ న్యూస్ సినిమా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కావడంతో మళ్లీ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. విక్కీ కౌశల్, అమీ విర్క్, త్రిప్తి డిమ్రీ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా bold and emotional storylineతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా కథలో హీరోయిన్ పరిస్థితుల వల్ల ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అయితే ఆమె మదిలో వేరే వ్యక్తి ఉంటాడు. పెళ్లి జరిగిన అనంతరం ఆమె ప్రియుడితో హనీమూన్‌కు వెళ్తుంది. భర్తకు విషయం తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు తలెత్తుతాయి. ఫైనల్ గా విషయం విడాకులు తీసుకునే దశకు చేరుకుంటారు.

Related Articles

Related image1
పడిపోయిన బ్రహ్మముడి, పైకి లేస్తున్న కార్తీక దీపం 2, ఈ వారం తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే?
Related image2
బిగ్ బాస్ హౌస్ లోకి లక్స్ పాప, సీజన్ 9 లో సందడి చేయబోతున్న బాలయ్య బ్యూటీ
35
Image Credit : Social Media

ఆమె తన కెరీర్‌ కోసం వేరే ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ మరో వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. దాంతో మరోసారి ఆమె ప్రేమలో పడుతుంది. వారి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడుతుంది. కొంతకాలానికే ఆమె గర్భవతిగా మారుతుంది. అయితే ఆసుపత్రిలో టెస్టులు చేసినప్పుడు షాకింగ్ రిపోర్ట్ వస్తుంది – ఆమె గర్భంలో ఇద్దరు కవలలు ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే ఆ కవలలకు వేరు వేరు డీఎన్ఏ ఉంది. అంటే ఇద్దరు తండ్రులకు వారు జన్మించబోతున్నట్టు రిపోర్ట్ లో ఉంది.

45
Image Credit : Asianet News

ఈ విషయంతో కథ ఉత్కంఠ భరితంగా మారుతుంది. అసలు ఆ పిల్లలకు తండ్రి ఎవరు? చివరికి ఆమె ఎవరికి దక్కుతుంది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. సినిమా అంతా ట్విస్ట్ లతో, కామెడీ పంచ్ లతో నిండిపోయి ఉంటుంది. సిరియస్ విషయాన్ని కూడా ఇంత సిల్లీగా చెప్పవచ్చు అని ఈసినిమా చూస్తే తెలుస్తుంది. రొమాన్స్, కామెడీ, ఎమోషన్, సస్పెన్స్ అన్నీ కలగలిసిన ‘బ్యాడ్ న్యూస్’ ఓటీటీలో విభిన్న అనుభూతిని పంచుతోంది.

55
Image Credit : Asianet News

ఇక ఈసినిమాను ఎక్కడ చూడాలి అనే డౌట్ ఆడియన్స్ లో రావచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. bold scenes, engaging screenplay, కామెడీ డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలుస్తున్నాయి.ఓటీటీలో bold romantic dramas ను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పక చూడాల్సిందే. 'బ్యాడ్ న్యూస్' ఇప్పుడు టాప్ 10 మూవీస్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఓటీటీ
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక కంటే ముందు కలసి నటించి పెళ్లి చేసుకున్న 6 జంటలు వీళ్ళే.. క్రేజీ ఫోటోస్
Recommended image2
Beach Club: ముంబైలో శిల్పా శెట్టి ఫస్ట్ బీచ్ క్లబ్.. 6 అద్భుతమైన ఫోటోలు
Recommended image3
వెంకటేష్ తో చేతులు కలిపిన నందమూరి హీరో.. క్రేజీ మల్టీస్టారర్ ప్రకటించిన అనిల్ రావిపూడి, రిలీజ్ డేట్ ఫిక్స్
Related Stories
Recommended image1
పడిపోయిన బ్రహ్మముడి, పైకి లేస్తున్న కార్తీక దీపం 2, ఈ వారం తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే?
Recommended image2
బిగ్ బాస్ హౌస్ లోకి లక్స్ పాప, సీజన్ 9 లో సందడి చేయబోతున్న బాలయ్య బ్యూటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved