- Home
- Entertainment
- పడిపోయిన బ్రహ్మముడి, పైకి లేస్తున్న కార్తీక దీపం 2, ఈ వారం తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే?
పడిపోయిన బ్రహ్మముడి, పైకి లేస్తున్న కార్తీక దీపం 2, ఈ వారం తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే?
తెలుగు టెలివిజన్ రంగాన్ని సీరియల్స్ శాసిస్తున్నాయి. ఏ కార్యక్రమాలకు రాని రేటింగ్ సీరియల్స్ కు వస్తున్నాయి. ఇక ఎక్కువ ప్రేక్షకాదరణ పొంది, అత్యధిక రేటింగ్ సాధించి తెలుగు సీరియల్ ఏది? వారం రేటింగ్స్ ఏవిధంగా ఉన్నాయంటే?

తెలుగు టెలివిజన్ రంగంలో టీఆర్పీ రేటింగ్స్ కీలకంగా మారాయి. ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్న సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ ద్వారా వారి విజయాన్ని నిరూపించుకుంటున్నాయి. 2025 ఆగస్టు నెల 33వ వారం టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం టాప్ 10 తెలుగు సీరియల్స్ జాబితా విడుదలైంది. ఇందులో కార్తీకదీపం సీక్వెల్ ‘కార్తీకదీపం 2’ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఒకప్పుడు వెలుగు వెలిగిన బ్రహ్మముడి సీరియల్ పాతాళానికి పడిపోయింది.
1. కార్తీకదీపం 2
ఈ సీరియల్ 15.25 టీఆర్పీ రేటింగ్‌తో 33వ వారం టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. మొదటి భాగం సూపర్ సక్సెస్ కావడంతో రెండో భాగం పట్ల కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
2. ఇల్లు ఇల్లాలు పిల్లలు
14.58 టీఆర్పీతో రెండో స్థానంలో నిలిచింది. కుటుంబ అనుబంధాలు, సానుభూతి భావాలను ప్రధానంగా ప్రదర్శించటం దీనికి ప్లస్ అయ్యింది.
3. ఇంటింటి రామాయణం
ఈ వారం ఈసీరియల్ 13.34 రేటింగ్‌ను సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఈ సీరియల్ జట్టుకు ఇది పెద్ద విజయంగా మారింది.
4. గుండె నిండా గుడిగంటలు
12.65 టీఆర్పీతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. నమ్మకం, ప్రేమ నేపథ్యంలో ఈ సీరియల్ రన్ అవుతోంది. ఈ సీరియల్స్ కు ఎక్కువగా యూత్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
5. చిన్ని
10.18 టీఆర్పీతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఎమోషనల్ టచ్‌తో ఈ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సెంటిమెట్ బలంగా చిన్ని సీరియల్ కొనసాగుతోంది.
6. నువ్వుంటే నా జతగా
9.92 టీఆర్పీతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఒకప్పుడు ఈ సీరియల్ కాస్త మెరుగైన ఫలితాలు ఇచ్చేది. కాని పోటీ పెరగడంతో ఆరోస్థానానికి పడిపోవలసి వచ్చింది.
7. చామంతి
8.32 రేటింగ్‌తో ఏడవ స్థానంలో నిలిచింది.
8. జగద్ధాత్రి
7.94 టీఆర్పీతో ఎనిమిదో స్థానాన్ని సొంతం చేసుకుంది.
9. మెగా సందేశం
7.56 రేటింగ్‌తో తొమ్మిదో స్థానంలో ఉంది.
10. జయం
7.32 టీఆర్పీతో పదవ స్థానాన్ని దక్కించుకుంది.
బ్రాహ్మముడి పరిస్థితి ఏంటి?
ఇక గతంలో మంచి పాపులారిటీ సాధించిన బ్రాహ్మముడి సీరియల్ టీఆర్పీ రేటింగ్‌లో ఈ వారం 6.88 మాత్రమే సాధించింది. గత వారాలతో పోలిస్తే ఇది తక్కువగా ఉండటం గమనార్హం. ఒక వెలుగు వెలిగిన ఈ సీరియల్ కు ఆదరణ తగ్గడం ఆటీమ్ కు షాక్ ఇస్తోంది. టీవీ ఛానళ్ల మధ్య ఈ టీఆర్పీ పోటీలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. రేటింగ్స్ ఆధారంగా ఛానల్స్ తమ ప్రోగ్రామింగ్ స్ట్రాటజీస్‌ను మార్చుకుంటున్నాయి. ఇప్పటి ట్రెండ్ చూస్తే, ఫ్యామిలీ ఎమోషన్స్ సోషల్ డ్రామాలే ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి.