- Home
- Entertainment
- Ayesha Zeenath Bigg Boss 9: తాను బిగ్ బాస్ హౌజ్‌లో ఉంటే వేరే అమ్మాయితో బాయ్ ఫ్రెండ్.. ఆయేషా బ్యాక్ గ్రౌండ్ ఇదే
Ayesha Zeenath Bigg Boss 9: తాను బిగ్ బాస్ హౌజ్‌లో ఉంటే వేరే అమ్మాయితో బాయ్ ఫ్రెండ్.. ఆయేషా బ్యాక్ గ్రౌండ్ ఇదే
బిగ్ బాస్ తెలుగు 9 వైల్డ్ కార్డ్ ద్వారా సీరియల్ నటి ఆయేషా జీనత్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె లవ్ స్టోరీ, ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

సీరియల్ నటి ఆయేషా బిగ్ బాస్ తెలుగు 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీ
బిగ్ బాస్ తెలుగు 9 ఐదో వారం వైల్డ్ కార్డ్స్ కేటగిరిలో సినిమా, టీవీ నటి ఆయేషా జీనత్ ఎంట్రీ ఇచ్చింది. వైల్డ్ కార్డ్స్ ద్వారా ఆరుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌజ్‌లోకి రాగా, అందులో స్పెషల్ గా నిలిచింది ఆయేషా జీనత్. ఎందుకంటే ఆమె ఇప్పటికే తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొంది. ఆరో సీజన్ బిగ్ బాస్ తమిళ షోలో సందడి చేసింది. తొమ్మిది వారాలు హౌజ్‌లో ఉంది. ఉన్నంత కాలం రచ్చ చేసింది. కాకపోతే ప్రియుడి కోసం తపించి ఆట మీద ఫోకస్ చేయలేదు. అది ఆమె ఎలిమినేషన్‌కి దారితీసింది. కానీ ఇప్పుడు ఆ తప్పు చేయను, బిగ్ బాస్ కప్ గెలవడమే లక్ష్యంగా తాను హౌజ్‌లోకి అడుగుపెడుతున్నట్టు తెలిపింది ఆయేషా.
ఆయేషా బ్రేకప్ లవ్ స్టోరీ
వైల్డ్ కార్డ్స్ ద్వారా బిగ్ బాస్ 9వ సీజన్ స్టేజ్‌పైకి అదిరిపోయే సాంగ్స్ పర్‌ఫెర్మెన్స్ చేస్తూ వచ్చిన ఆమె ఆసక్తికర విషయాలను పంచుకుంది. షోలో నాగార్జున ఓ ఫోటో చూపించగా, అందులో ఉన్నది తాను కాదు అని చెప్పి కామెడీ చేసింది. ఈ ఫ్లైట్ తనదే అనేలా పోజులివ్వడంపై నాగ్ కూడా పంచ్‌లు వేశారు. వీటిని పాజిటివ్‌గా తీసుకుని చాలా ఎనర్జిటిక్‌గా వ్యవహరించింది. తాను ఫైర్ బ్రాండ్ అని, రౌడీ బేబీ అని ప్రకటించుకుంది. హౌజ్‌లోకి వెళ్లాక రచ్చ వేరే లెవెల్‌లో ఉంటుందని పేర్కొంది. అంతేకాదు ఈ సందర్భంగా మరో క్రేజీ విషయాన్ని వెల్లడించింది. ఇంత అందంగా ఉన్నావ్ కదా, ఎన్ని సార్లు ప్రేమలో పడ్డావని నాగార్జున అడగ్గా, అది చాలా సార్లు అయిపోయిందని, పడి పడి అలసిపోయినట్టు తెలిపింది ఆయేషా. ప్రియుడి గురించి షాకింగ్ విషయం బయటపెట్టింది.
తాను బిగ్ బాస్ హౌజ్‌లో, బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో
ఆయేషా బిగ్ బాస్ తమిళం 6వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ప్రియుడిని వదిలేసి హౌజ్‌లోకి వెళ్లడంతో తాను చాలా బాధపడిందట. ఆయన్ని చాలా మిస్ చేసుకుందట. 63 రోజులుంటే ఆయ్యో అతను ఎలా ఉంటాడో అని రోజూ ఆలోచించేదట. దీని కారణంగా ఆట కూడా సరిగా ఆడలేదని, గేమ్స్ పై ఫోకస్ పెట్టలేకపోయినట్టు తెలిపింది ఆయేషా. తీరా ఎలిమినేట్ అయి బయటకు వెళితే ఈ 63 రోజుల్లో ప్రియుడు మరో అమ్మాయిని చూసుకున్నాడట. ఆమెతో రొమాన్స్ తో బిజీగా ఉన్నాడట. దెబ్బకి తన హార్ట్ బ్రేక్ అయ్యిందని, చాలా కుంగిపోయానని చెప్పింది. దీంతో అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు చేయోద్దని, ఈ సారి గేమ్ బాగా ఆడాలని, కప్‌తోనే బయటకు రావాలని భావిస్తున్నట్టు తెలిపింది ఆయేషా. అయితే ఆయేషాకి 2023 ఫిబ్రవరి 14న గోయేష్(యోగి)తో ఎంగేజ్‌మెంట్ అయ్యింది. కానీ అది బ్రేకప్ అయ్యింది. బహుశా ఆయేషా చెప్పిన లవ్ స్టోరీ ఇదే అని తెలుస్తోంది.
టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్
మరి ఆయేషా బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారనేది చూస్తే, ఆయేషా కేరళాకి చెందిన ఆర్టిస్ట్. పూర్తి పేరే ఆయేషా జీనత్ బీవి. ఆమె సీరియల్స్ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి వచ్చింది. ప్రారంభంలో తమిళంలో సీరియల్స్ చేసింది. అక్కడ `రెడీ స్టడీ పో` సీజన్ 1లో మెరిసింది. కంటెస్టెంట్‌గా రెండు ఎపిసోడ్లలో కనిపించింది. ఆ తర్వాత సన్ టీవీలో ప్రసారమైన `మాయ` సీరియల్‌లో రాణి లక్ష్మి ప్రభావతిగా, దర్శిణిగా కనిపించింది. అదరగొట్టింది. దీంతోపాటు పోన్మంగల్ వాంతల్`, రాజా మాగల్`, `సెంబరుథి`, `సత్య` షో, `ఊ సోల్రియా ఊ ఊమ్ సోల్రియా`, `ఇధయం`, `సమయల్ ఎక్స్ ప్రెస్` వంటి చాలా సీరియల్స్ చేసింది.
ఆయేషా తెలుగులో నటించిన సీరియల్స్ ఇవే
ఈ క్రమంలో తెలుగులో నటించే అవకాశాలు అందుకుంది. 2019లో ఆమె `సావిత్రమ్మ గారి అబ్బాయి` సీరియల్‌లో మెరిసింది. ఫీమేల్ లీడ్‌గా చేసింది. ఆ తర్వాత కొంత గ్యాప్‌తో గతేడాది `ఊర్వశివో రాక్షసివో` సీరియల్‌లో నటించింది. ఆ మధ్య `కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ ` షోలోనూ మెరిసింది ఆయేషా. వీటితోపాటు తమిళంలో `రాంబో` చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తమిళ చిత్రాలు, ఓ మలయాళ మూవీ ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం విశేషం. మరి ఆమె ఏ స్థాయిలో రచ్చ చేస్తుందో చూడాలి.