- Home
- Entertainment
- 18,000 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ మళ్లీ థియేటర్లలోకి.. రీ రిలీజ్ లో ట్విస్ట్ ఏమిటంటే?
18,000 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ మళ్లీ థియేటర్లలోకి.. రీ రిలీజ్ లో ట్విస్ట్ ఏమిటంటే?
Avatar 2 Re Release: ప్రపంచ వ్యాప్తంగా రూ 18000 కోట్లకు పై కలెక్షన్స్ వసూలు చేసి ‘అవతార్ 2’ (Avatar: The Way of Water)మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాకుండా ఈ మూవీ రీ-రిలీజ్ లో ట్విస్ట్ ఏమిటంటే?

రూ. 18,000 కోట్లు కలెక్ట్ మూవీ రీ రిలీజ్
ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు, ప్రేక్షకులను అదరణ పొందిన బ్లాక్ బస్టర్ మూవీను మరో సారి థియేటర్లలో మరోసారి విడుదల చేస్తున్నారు. ఇలా తమ అభిమానులను పలికరించడమే కాకుండా భారీ మొత్తంలో వసూళ్లు అందుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా రూ 18000 కోట్లకు పై కలెక్షన్స్ వసూలు చేసి, బాక్స్ ఆఫీస్ హిట్‌గా నిలిచిన సినిమా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాకుండా, ఈ చిత్రం రీ-రిలీజ్ సమయంలో ప్రేక్షకులను 3D థియేట్రికల్ అనుభూతిని ఇవ్వబోతుంది. మళ్ళీ తన మాయ ప్రపంచంలోకి తీసుకెళ్లబోతుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటీ? ఆ సినిమా ఎప్పుడు రీ రిలీజ్ కాబోతుందంటే?
అవతార్ 2 రీ రిలీజ్
ఆ మూవీ ఏంటో కాదు. ప్రపంచవ్యాప్తంగా రూ. 18000 కోట్లు వసూలు చేసిన ‘అవతార్ 2’ (Avatar: The Way of Water)ను రీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ (James Cameron) మ్యాజిల్ వండర్ ఈ మూవీ. హాలీవుడ్ సినీ ప్రపంచానికి టైటానిక్, అవతార్, అవతార్ 2 లాంటి చరిత్రాత్మక బ్లాక్‌బ్లాస్టర్లను అందించారు. సినిమా చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. వాస్తవానికి అవతార్ సిరీస్ తో ప్రపంచ సినీ చరిత్రనే తిరగరాశారు.
రీ రిలీజ్ ఎప్పుడంటే?
విజువల్ ఎఫెక్ట్స్, మాడ్రన్ టెక్నాలజీ, థ్రిల్లింగ్ స్టోరీ లైన్ తో ప్రేక్షకులను మాయ చేసిన మూవీ అవతార్ 2 (Avatar: The Way of Water). ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడమే కాకుండా ఎన్నో గ్లోబల్ అవార్డులు, రివార్డులను కూడా కైవసం చేసుకుంది. అవతార్: ది వే ఆఫ్ వాటర్ (Avatar: The Way of Water)సినిమా అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతోంది.
అయితే.. కేవలం 3డీలో రావడం. వారం రోజులు మాత్రం థియేటర్లలో ప్రదర్శించడం ఇక్కడ అసలైన ట్వీస్ట్. అలాగే.. అవతార్ 3 విడుదలకు ముందు రీ రిలీజ్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ చిత్రం JioHotstarలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.
‘అవతార్ 2’ స్టోరీ
హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘అవతార్ 2’. ఇందులో సామ్ వర్తింగ్‌టన్, జో సాల్డానా, స్టీఫెన్ లాంగ్, సిగర్నీ వీవర్ ముఖ్య పాత్రల్లో నటించగా, సీక్వెల్‌లో ‘టైటానిక్’ హీరోయిన్ కేట్ విన్‌స్లెట్ కూడా నటించారు. ఈ మూవీ 2022 డిసెంబరు 16న థియేటర్లలో విడుదలైంది.
మొదటి భాగంలో జేమ్స్ కామెరూన్ ‘పండోరా’ అనే అద్భుత ప్రపంచాన్ని సృష్టించి, అక్కడ జీవించే ‘నావీ’ తెగను, మానవుల ప్రవర్తనతో ఏర్పడే సంక్షోభాన్ని చూపించారు. ప్రధానంగా జేక్ సల్లీ (సామ్ వర్తింగ్‌టన్) ఆర్డర్‌లు అనుసరిస్తూ, అవతార్ ప్రోగ్రామ్‌లో భాగంగా నావీ శరీరంలో అడుగుపెడతాడు.
యాక్షన్, ప్రేమ, కుటుంబం, ప్రతీకారం ప్రధాన కథా అంశాలు. జేక్, నేత్రి మధ్య ప్రేమకథ ప్రేక్షకులను గట్టిగా ఆకట్టుకుంది. చివరికి, జేక్ అవతార్ రూపంలోనే శాశ్వతంగా ఉండాలని నిర్ణయించి, పండోరాను రక్షిస్తాడు.
ఇక అవతార్ 2లో జేక్, నేత్రి తల్లీదండ్రులుగా కనిపిస్తారు. కొత్త భాగంలో సముద్రంలోని అద్భుత ప్రపంచం, కొత్త పోరాటాలు, జేక్ కుటుంబ సాహసాలు ప్రధానంగా ఉంటాయి. ట్రైలర్ ప్రకారం, జేక్ సల్లీ కొడుకుకు కూడా ప్రేమకథ ఉంటుంది. ఈ సినిమాను ₹3,000కోట్ల బడ్జెట్ తో రూపొందించారు.
ప్రపంచ బాక్సాఫీస్‌లో ‘అవతార్ 2’రికార్డులు
అవతార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా $ 2.2433 బిలియన్ (సుమారుగా ₹18,000 కోట్లు) కలెక్ట్ చేసింది. ప్రపంచంలో అత్యధికంగా వసూలు చేసిన మూవీస్ లో ఒక్కటిగా నిలిచింది. ఈ సినిమా భారత్ లో హిందీ, ఇంగ్లీష్ తోపాటు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో కూడా విడుదలైంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా సునామీ క్రియేట్ చేసింది. ఈ మూవీ ఏకంగా రూ. 293 కోట్లుకు పైగా వసూలు చేసింది.
ఇలా ప్రపంచంలో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో అవతార్ 2 నిలిచింది. జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో రూపొందిన ‘అవతార్’, ‘అవతార్ 2’,‘టైటానిక్’ వంటి చిత్రాలు ప్రపంచంలో అత్యధిక వసూలు చేసిన సినిమాల జాబితాలో నిలిచాయి. ఇక అవతార్: ఫైర్ అండ్ యాష్ (Avatar: Fire and Ash) సినిమా డిసెంబర్ 19, 2025లో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. నేపథ్యంలో అవతార్ 2 రీ-రిలీజ్ ప్లాన్ చేయడం మరో ట్వీస్ట్.