- Home
- Entertainment
- Ashu Reddy : పింక్ చుడీదార్ లో ‘అషు రెడ్డి’ కూల్ పిక్స్.. మెచ్చుకుంటున్న నెటిజన్లు..
Ashu Reddy : పింక్ చుడీదార్ లో ‘అషు రెడ్డి’ కూల్ పిక్స్.. మెచ్చుకుంటున్న నెటిజన్లు..
జూనియర్ సమంత(Junior Samantha) , బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డిని (Ashu Reddy) నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత ట్రెండీ వేర్స్, పొట్టి దుస్తులను వదిలి.. చుడీదార్ లో దర్శనమివ్వడంతో అషును పొగుడుతూ ఆకాశానికెత్తుతున్నారు.

జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి తన క్రేజ్ పెంచుకునేందుకు సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. బైక్ రైడ్స్, అదిరిపోయే అవుట్ ఫిట్ లో ఫొటో షూట్స్ చేసి నెటిజన్ల మతి పోగొడుతోంది. యాంకర్ రవి ( Anchor Ravi)తో కలిసి ఇటీవల మరింత రెచ్చిపోయింది.
అయితే తాగాజ తను పింక్ చుడీదార్ లో కనిపించి తన ఫాలోవర్స్ ను, నెటిజన్లను షాక్ కు గురిచేసింది. అప్పటి వరకు అషును గ్లామర్ బ్యూటీగానే చూసిన వాళ్లంతా చుడీదార్ లో చూసి కండ్లు వెళ్లబెడుతున్నారు.
ఓ చెట్టు కింద కూర్చున్న అషురెడ్డి, పింక్ చూడీదార్ లో చాలా అందంగా కనిపిస్తోంది. క్యూట్ లుక్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పటి వరకు ట్రెండీ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన ఈ డబ్ స్మాష్ బ్యూటీ.. ఉన్నట్టుండి చూడీదార్ వైపు యూటర్స్ ఇవ్వడంతో కొంత మంది మెచ్చుకుంటున్నారు.
నిండుగా ఉన్న ఈ దుస్తుల్లో అషురెడ్డి మరింత అందంగా కనిపిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరో నెటిజన్ ‘ఇప్పటి వరకు పోస్ట్ చేసిన వాటిల్లో ఇది బెస్ట్ పోస్ట్’ అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉన్నావంటూ మరికొందరు కామెంట్ల ద్వారా తెలిపారు.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవరనాగవంశీ నిర్మించిన చిత్రం `డీజే టిల్లు` (DJ Tillu). ఈ మూవీ శనివారం (ఫిబ్రవరి 12) న విడుదలైంది. హిలేరియస్ కామెడీగా సాగే ఈ చిత్రానికి థియేటర్లో ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లోనూ ‘అషు రెడ్డి’ భాగస్వామ్యం పంచుకుంది.
యాంకర్ రవితో కలిసి ‘డీజే టిల్లు’ మూవీలోని టైటిల్ సాంగ్ కు స్టెప్పులేసింది. నిన్న మూవీ రిలీజ్ అవుతున్నట్టుగా తన ఫాలోవర్స్ కు గుర్తు చేసింది. ప్రస్తుతం ఎక్కడా విన్న ‘డీజే టిల్లు’ సాంగే వినబడుతోంది.