- Home
- Entertainment
- Prema Entha Madhuram: అను చేసిన పనికి షాక్ లో ఉన్న కుటుంబం.. భార్య, బిడ్డల కోసం ఆర్య తపన?
Prema Entha Madhuram: అను చేసిన పనికి షాక్ లో ఉన్న కుటుంబం.. భార్య, బిడ్డల కోసం ఆర్య తపన?
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ నెంబర్ వన్ సీరియల్ గా దూసుకుపోతుంది. పుట్టిన బిడ్డలని చూడకుండానే దూరం చేసుకున్న ఒక దురదృష్టవంతుని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఈరోజు నా బిడ్డ ప్రాణం పోసుకుంటుంది కాబట్టి నీ ప్రాణాలు వదిలేస్తున్నాను అంటూ రాడ్ అక్కడ పడేసి వెళ్ళిపోతాడు ఆర్య. అయితే అదే రాడ్డుతో వెళ్ళిపోతున్న ఆర్యని వెనకనుంచి తల పగలగొడతాడు జలంధర్. అదే సమయంలో పైన అనుకి డెలివరీ అవుతుంది. దాంతో అను, ఆర్య ఇద్దరు ఒకేసారి అమ్మ అని అరుస్తారు.
అనుకి కవల పిల్లలు పుడతారు. ఆర్య ఎందుకు అరిచాడో అని షాక్ అవుతారు శారదమ్మ వాళ్ళు. ఏం జరిగిందో అనుకుంటూ ఆర్య ఉన్న వైపు పరిగెడతారు. అదే సమయంలో పుట్టిన బిడ్డలని అనుకి చూపిస్తారు డాక్టర్లు. పిల్లలిద్దరిని చూసుకొని ఎమోషనల్ అవుతుంది అను. ఆర్య సర్ ని పిలవండి అని డాక్టర్లకి చెప్తుంది. ఆర్య వాళ్ళని పిలవటం కోసం డాక్టర్లు బయటకు వస్తారు.
అక్కడ ఎవరూ లేకపోవడంతో అక్కడ ఉన్న అటెండర్ ని అడుగుతుంది డాక్టర్. ఆర్య సర్ తలకి దెబ్బ తగిలింది సెల్లార్ లో ఉన్నారు అని చెప్తాడు అటెండర్. అంతలో శారదమ్మ వాళ్ళు ఆర్య ఉన్న దగ్గరికి వస్తారు. అప్పటికే జలంధర్ ని చావచితక్కొడతాడు ఆర్య. గబగబా వచ్చి ఆర్య ని పట్టుకుంటారు శారదమ్మ వాళ్ళు.
జెండే జలంధర్ కి నాలుగు తగిలించి సెక్యూరిటీ కి అప్పగించి పోలీసులకి అప్పజెప్పమని చెప్తాడు. అంతలోనే డాక్టర్ వాళ్ళు కూడా అక్కడికి రావడంతో అను ఎలా ఉంది అని అడుగుతాడు ఆర్య. తనకి ఫ్రీ డెలివరీ అయింది మీకు ట్విన్స్ పుట్టారు తల్లి బిడ్డలు క్షేమమే అని చెప్తుంది డాక్టర్. నేను చూడొచ్చా అంటాడు ఆర్య. తప్పకుండా కానీ ముందు మీరు ఫస్ట్ ఎయిడ్ చేయించుకోండి అనటంతో ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని అను రూమ్ కి బయలుదేరుతారు ఆర్య వాళ్ళు.
పిల్లలకి స్నానం చేయించడం కోసం అను రూమ్ కి వస్తుంది సిస్టర్. అక్కడ ఎవరూ లేకపోవడంతో కంగారుగా ఆర్య కి చెప్తుంది. అనుని ఎవరో కిడ్నాప్ చేశారు అనుకోని కంగారుగా హాస్పిటల్ అంతా వెతుకుతారు ఆర్య వాళ్ళు. మాన్సీయే ఏదో చేసిందని అనుమానపడి నిజం చెప్పమంటూ ఆమె గొంతు పట్టుకుంటాడు నీరజ్. అందరూ నీరజ్ ని వారిస్తారు తలోవైపు వెళ్లి వెతుకుతారు.
దీని వెనక నీ హస్తం ఉందా అంటూ జలంధర్ ని నిలదీస్తాడు జెండే. తనకేం తెలీదు అంటూ స్పృహ కోల్పోతాడు జలంధర్. సిసి ఫుటేజీలో దొరుకుతుందేమో అని అక్కడ చూస్తారు ఆర్య వాళ్ళు. ఫుటేజ్ లో అను ఇద్దరు పిల్లల్ని తీసుకొని అది కష్టంగా నడుస్తూ బయటికి వెళ్లిపోవడం చూసి అందరూ షాక్ అవుతారు. కష్టాలన్నీ నిన్నే వెతుక్కుంటూ వస్తున్నాయి. నిన్ను వదిలి వెళ్ళిపోయే అంత కష్టం అనుకి ఏమొచ్చింది.
నీకు బిడ్డలు పుట్టారు అని సంతోషించేలోపు ఆ బిడ్డలు కళ్ళ ముందు లేకుండా పోయారు అంటూ కళ్ళు తిరిగి పడిపోబోతుంది శారదమ్మ. అను తనంతట తాను వెళ్ళిపోయే మనిషి కాదు ఏదో జరిగింది దీని వెనక ఆ అపరిచితురాలు ఉందేమో అంటాడు జెండే. శారదమ్మ దేవుడి దగ్గరికి వెళ్లి ఏడుస్తూ దండం పెట్టుకుంటుంది. ఎందుకు అన్ని కష్టాలు నా బిడ్డకే ఇస్తున్నావు సుఖ ప్రసవం అయ్యి కవల పిల్లలు పుట్టారు అని సంతోషించే లోపే ఆ పిల్లల్ని దూరం చేసి నాకు అన్యాయం చేశావు.
మేము ఏం పాపం చేశాము అంటూ ఏడుస్తుంది. అంజలి వచ్చి శారదమ్మని ఓదార్చి అక్కడ నుంచి తీసుకు వెళుతుంది. ఆలోచనలో ఉన్న ఆర్య కి ఏదో తట్టినట్లుగా జెండే ఏం జరిగిందో మనకి తెలియదు కానీ అను ఈ చుట్టుపక్కలే ఉంటుంది. ఇప్పుడే బయటికి వెళ్లింది కాబట్టి ఎంతో దూరం వెళ్లి ఉండదు పదండి వెతుకుదాం అంటూ నీరజ్, ఆర్య, జెండే, అంజలి నలుగురు తలోవైపు వెళ్లి వెతుకుతారు. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.