నడుము వొంపులతో కేకపెట్టిస్తున్న అరియానా గ్లోరీ.. బుల్లితెరపై ‘బిగ్ బాస్’ బ్యూటీ సందడి మాములుగా లేదుగా!
బుల్లితెరపై యాంకర్ అరియానా గ్లోరీ (Ariyana Glory) సందడి పెరుగుతోంది. బ్యాక్ టు బ్యాక్ షోలతో అలరిస్తోంది. మరోవైపు అందాల విందులోనూ అదరగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు గ్లామర్ ఫీస్ట్ అనిపిస్తోంది.
పాపులర్ రియాలిటీ గేమ్ షో ‘బిగ్ బాస్ తెలుగు’తో తనకంటూ ఇమేజ్ సొంతం చేసుకుంది యాంకర్ అరియానా గ్లోరీ. సీజన్ 4తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం చేసింది. షోలో తనదైన శైలిలో వ్యవహరించి బుల్లితెర ఆడియెన్స్ కు దగ్గరైంది.
‘బిగ్ బాస్’ నాలుగో సీజన్ తోనే కాకుండా నెక్ట్స్ ఓటీటీ వచ్చిన ఐదో సీజన్ లోనూ అరియానా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆరో సీజన్ పై అప్డేట్ అందించిన స్టార్ మా రూపొందించిన ‘బీబీ కెఫే’ టాక్ షోతోనూ అలరించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ Bigg Boss Telugu నుంచి ఆఫర్లు అందుకుంటోంది.
ప్రస్తుతం ‘బీబీ జోడీ’ BB Jodiతో ఆకట్టుకుంటోంది. ఈషోలో కేవలం బిగ్ బాస్ కంటెంట్స్ మాత్రమే జోడీగా పెర్ఫామ్ చేస్తారు. గతేడాది డిసెంబర్ 25న ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం మంచి రెస్పాన్స్ తోనే దూసుకుపోతోంది.
ఈ వేదికపై అరియానా గ్లోరీ, కమెడియన్ ముక్కు అవినాష్ తో కలిసి పెర్ఫామెన్స్ ఇచ్చింది. డిసెంబర్ 25నే షో కూడా ప్రసారం అయ్యింది. అయితే బుల్లితెరపై ఇప్పటికే కుర్ర భామలు అందాలు ఆరబోస్తున్న విషయం తెలిసిందే. అందులోనూ అరియానా మరింతగా గ్లామర్ విందు చేస్తోంది.
ఆ డాన్స్ పెర్ఫామెన్స్ కు సంబంధించిన క్యాస్టూమ్ లో ఫొటోషూట్ చేసిన పిక్స్ ను తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది. నాభీ అందాలు.. నడుము ఒంపుల్ని చూపెడుతూ కుర్రకారుకు మతులు పోగొట్టింది. అరియానా బ్యూటీ నెటిజన్లు సైతం పొగుడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు.
ఇలా బుల్లితెర ఆడియెన్స్ కు మరింతగా దగ్గరవుతూ వస్తోంది అరియానా గ్లోరీ. మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ షోతో రెచ్చిపోతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. ఇక విదేశాలకూ వెళ్తూ నానా రచ్చ చేస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వేకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.