Brahmamudi: కళ్యాణ్ చేసిన పనికి ఫైరైయిన అప్పు.. భార్యని బెదిరిస్తున్న సుభాష్!
Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. అక్క బ్రతుకు బాగోవాలని తపన పడుతున్న ఒక చెల్లెలు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నేను చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చాను.. నన్ను ఇంట్లో హౌస్ అరెస్టు చేశారు.. ఏదో ఒకటి చెప్పి ఇక్కడ వరకు వచ్చాను అంటుంది స్వప్న. వచ్చిన విషయం చెప్పు అంటాడు రాహుల్. నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.. త్వరగా మన సంగతి తేల్చు అంటుంది స్వప్న. ఇన్నాళ్లకు మంచి నిర్ణయం తీసుకున్నారు అని మనసులో అనుకుంటాడు రాహుల్. బయట మాత్రం ఇంట్లో పరిస్థితి బాలేదు టైం కావాలి అని అడుగుతాడు రాహుల్. ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చాను ఇంక ఆగేది లేదు.. మీ వాళ్ళని బ్రతిమాలుతావో.. ఏం చేస్తావో నాకు అనవసరం కానీ త్వరగా మన పెళ్లి అయిపోవాలి అంటుంది స్వప్న.
గొడవ పెట్టుకుని పెళ్లి చేసుకోవచ్చు కానీ వాళ్ళు నన్ను ఏమైనా అంటే నేను భరించలేను నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. నీకు లేనిదే అది.. నాకు మా అమ్మకి ఆ ఇంట్లో గౌరవం లేదు. ఇంక నన్ను చేసుకున్న నీకేం ఉంటుంది అనుకుంటాడు రాహుల్. మరోవైపు వాష్ రూమ్ కి వెళ్లి తన పని పూర్తి చేసుకొని వస్తాడు రాజ్. బయటికి వస్తూనే ఇప్పుడు మీ పని చెప్తాను అనుకుంటూ తన రూమ్ కి లాక్కువెళ్లి అతని మొహం మీదే దుమ్ము దులుపుతూ గదిని శుభ్రం చేస్తుంది కావ్య.
ఆ దుమ్ముని భరించలేక ఆయాసం ఎక్కువైపోయి కూర్చుండిపోతాడు రాజ్. తనని ఆట పట్టిస్తున్నాను అనుకుంటుంది కానీ అతను అలా ఇబ్బంది పడుతుంటే కంగారు పడిపోతుంది కావ్య. అతను జేబులో ఏదో తడమడం గమనించి తనే చేయి పెట్టి తీస్తుంది. అది ఇన్హేలర్, దాన్ని రాజ్ నోట్లో పెడుతుంది కావ్య. అతను కొంచెం సర్దుకున్నాక మీకు ఆస్తమా ఉందా అని సైగలతో అడుగుతుంది. అవును అని సైగ చేస్తాడు రాజ్. పశ్చాతాపంతో సారీ అని రాస్తుంది కావ్య. యాక్సెప్ట్ చేస్తాడు రాజ్. మరోవైపు వాళ్ళు కొంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇంతకీ నీ కెమెరా బాగానే రికార్డు అవుతుంది కదా ఈ వీడియో మీ అన్న చూడాలి..
అప్పుడు మా అక్క కాపురం చక్కబడాలి అంటుంది అప్పు. హెచ్ డి క్వాలిటీ కెమెరా, దాన్ని అనుమానించకు అంటాడు కళ్యాణ్. టైము ఇవ్వు అంగరంగ వైభవంగా మన పెళ్లి జరుగుతుంది అని రాహుల్ చెప్పడంతో కన్విన్స్ అవుతుంది స్వప్న. నాకు పనుంది వెళ్ళొస్తాను అంటాడు రాహుల్. మళ్లీ ఎప్పుడు కలుద్దాం అంటుంది స్వప్న. నిన్ను కలిసే ఉద్దేశం నాకు అసలు లేనేలేదు అనుకుంటాడు రాహుల్. కానీ బయటికి మాత్రం ఈసారి కలిసేటప్పుడు పెళ్లి బట్టలో పెళ్లి పీటల మీద కలుద్దాం అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలకి ఫ్లాట్ అయినా స్వప్న మరింత ఆనందంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అప్పు మొత్తం అంతా రికార్డు చేశావు కదా.
ఏది ఇలా ఇవ్వు ఎలా వచ్చిందో చూస్తాను అంటూ కెమెరాని చూస్తుంది అప్పు. అక్కడ ఏమి కనిపించక పోవడంతో అదే విషయాన్ని కళ్యాణ్ తో కంగారుపడుతూ చెప్తుంది. దాన్ని గమనించిన కళ్యాణ్ అందులో మెమొరీ కార్డు పెట్టలేదని గుర్తిస్తాడు. అదే విషయాన్ని అప్పుతో చెప్తే కళ్యాణ్ ని పరిగెత్తించి మరీ కొడుతుంది. పరిగెడుతూ బురదలో జారీ పడిపోతాడు కళ్యాణ్.
అయినా వదలకుండా అతన్ని కొడుతూ బంగారు లాంటి అవకాశాన్ని చేజర్చేసావు అంటూ కోప్పడుతుంది. బట్టలు బురదైపోయాయి అంటూ గోల పెడుతుంది. నేను డ్రాప్ చేస్తాను అంటాడు కళ్యాణ్. అక్కర్లేదు అంటూ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అప్పు. మరోవైపు సూర్యాస్తమయం అవటంతో పంతులుగారు పూజ చేసి రాజ్ ని మళ్ళీ పెళ్లినాటి ప్రమాణాలు చేయమంటారు.
ఒకసారి చేయటమే ఎక్కువ మళ్లీ చేయడమేంటి అంటూ మొండికేస్తాడు రాజ్. సీతారామయ్య దంపతులు, సుభాష్ అతని చేత పంతులుగారు చెప్పినట్లుగా చేయిస్తారు. తప్పనిసరి పరిస్థితిలో పంతులుగారు చెప్పినట్లు విచ్చేసి ఇంక పూజ పూర్తయింది కదా బ్రహ్మముడి విప్పేయండి అంటాడు రాజ్. పూజ మాత్రమే పూర్తయింది బ్రహ్మముడి ఇప్పుడు కాదు రేపు పొద్దున్న పూజా సమయంలో అంటారు పంతులుగారు.
ఇలాంటి ఆచారాలు నేను ఎక్కడా చూడలేదు అంటుంది అపర్ణ. పెళ్ళికొడుకు ఒకరి మెడలో బదులు మరొకరి మెడలో తాళికట్టడం ఎక్కడా చూడలేదు కదా అందుకే మీకు ఈ ఆచారాలు తెలియదు అంటూ సమాధానం చెప్తారు పంతులుగారు. మరోవైపు ఇంటికి వచ్చిన స్వప్నని ఇద్దరూ కలిసి బయటికి వెళ్లి ఒక్కదానివే వచ్చావేం అంటూ నిలదీస్తుంది కనకం. తరువాయి భాగంలో వాళ్ళిద్దర్నీ విడదీయటానికి ప్రయత్నిస్తే నేను నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయను అని బెదిరిస్తాడు సుభాష్. ఎవరి కోపాలు భార్యాభర్తల్ని విడదీయకూడదు అంటాడు సీతారామయ్య.