Brahmamudi: రాహుల్ ను నిలదీసిన రాజ్.. నట్టింట్లో కావ్యకు ఘోర అవమానం!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. అపార్థం చేసుకున్న తన భర్తకి నిజం నిరూపించుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న ఒక ఇల్లాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నాకు ఒక మాట ఇవ్వు అని స్వప్నని అడుగుతాడు రాజ్. దేని గురించి అని అడుగుతుంది కావ్య. చెప్పకపోతే ఇవ్వవా అంటాడు రాజ్.. తప్పనిసరి పరిస్థితుల్లో విషయం తెలుసుకోకుండా మాటిస్తోంది కావ్య. మాట తీసుకున్న తర్వాత ఈ ఇంట్లో మీ అక్క అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు అంటాడు రాజ్. ఇది అన్యాయం.
రాహుల్ లాంటి వ్యక్తిని నమ్మినందుకు తను ఇక్కడికి రావడం తప్పదు అంటుంది కావ్య. సాక్షాలు లేకుండా అలా మాట్లాడకు నేను రాహుల్ ని పూర్తిగా నమ్ముతున్నాను అంటాడు రాజ్. సాక్షాలు లేవు కాబట్టే నోరు మూసుకొని ఊరుకున్నాను కర్మకాలి మా అక్క కూడా నమ్మటం లేదు అంటుంది కావ్య. తనే నమ్మనప్పుడు నేను ఎలా నమ్ముతాను.
అయినా ఇచ్చిన మాట గుర్తుంది కదా అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజ్. మరోవైపు స్వప్న ని చూసిన పెళ్లి వాళ్ళు ఈ అమ్మాయి మాకు నచ్చింది అని చెప్తారు. నేను అందగత్తెని, నేను నచ్చటం లో గొప్ప ఏముంది మీరు నాకు నచ్చాలి. అయినా నేను దుగ్గిరాల వారింటి కాబోయే కోడల్ని ఇలాంటి సంబంధం చేసుకోవడమేంటి అనుకుంటుంది.
ఈ అమ్మాయి పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయింది కావాలంటే ఈ వీధిలో ఎవరినైనా అడగండి అని పెళ్ళికొడుకు మెసేజ్ పెడుతుంది స్వప్న. ఆ మెసేజ్ చూసిన పెళ్ళికొడుకు అతని తల్లిదండ్రులు స్వప్న తల్లిదండ్రులని నానా తిట్లు తిట్టి అక్కడ నుంచి వెళ్లిపోతారు. అప్పటివరకు నచ్చింది అన్నవాళ్ళు సడన్ గా ఎందుకు అలా మారిపోయారో అర్థం కాదు అక్కడున్న వాళ్ళకి.
నిజం చెప్పి పెళ్లి చేద్దామంటే ఎవరూ ఒప్పుకోరు అబద్ధం చెప్పి పెళ్లి చేద్దామంటే ఎప్పటికైనా ప్రమాదమే అందుకే ఇకమీదట దీనికి సంబంధాలు చూడొద్దు అంటూ కోప్పడతాడు కృష్ణమూర్తి. మరోవైపు రాహుల్ గురించి కళ్యాణ్ తో చర్చిస్తుంది కావ్య. రాహుల్ మరో పెళ్లికి సిద్ధమైనట్లు స్వప్నకి తెలుసా అని అడుగుతాడు కళ్యాణ్. తెలీదు అంటుంది కావ్య. చెప్పండి అప్పటికైనా రాహుల్ నిజ స్వరూపం తెలుసుకుంటుంది అంటాడు కళ్యాణ్.
ఒకసారి అప్పు కి ఫోన్ చేయండి అంటుంది కావ్య. కళ్యాణ్ ఫోన్ చేస్తుంటే అప్పు కట్ చేసేస్తూ ఉంటుంది. ఏమైంది తనకి అంటాడు కళ్యాణ్. మళ్లీ తనే రిటన్ కాల్ చేస్తుంది లెండి అని కావ్య చెప్పడంతో ఊరుకుంటాడు కళ్యాణ్. మరోవైపు రుద్రాణి కళ్యాణ్ ని తక్కువ చేసి మాట్లాడటం తలుచుకొని బాధపడుతుంది ధాన్యలక్ష్మి.
ఇంతలో ఆమె భర్త వచ్చి అన్నయ్యని తీసుకురావడానికి వెళ్తున్నాను అని చెప్తాడు. వెళ్ళండి మీ అన్నయ్య వెనకాతల మీరు రాజ్ వెనకాల కళ్యాణ్ అలా తిరుగుతూ ఉండండి మీకంటూ సొంతంగా పనులు ఉంటాయేంటి అంటూ నిష్టూరంగా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి. అన్న వెనకాతల తమ్ముడు తిరగటం నామోషి కాదు అది గర్వకారణం అంటాడు ఆమె భర్త.
నేను మీ అన్నదమ్ముల అనుబంధాన్ని కించపరచడం లేదు కానీ రుద్రాణి మాటలు కే బాధపడుతున్నాను అంటుంది ధాన్యలక్ష్మి. ఈ మాటలు అన్నీ వింటున్న సీతారామయ్య దంపతులు, అపర్ణ అక్కడికి వచ్చి ధాన్యలక్ష్మి శాంతించేలాగా మాట్లాడుతారు. రుద్రాణి తండ్రి నాకు నమ్మిన బంటు ఆ కృతజ్ఞతతోనే తనని ఇంట్లో పెట్టుకున్నాను. ఈ తప్పంతటికి నాదే కారణం నన్ను క్షమించు అంటాడు సీతారామయ్య. అంత మాట అనొద్దు మావయ్య అని నొచ్చుకుంటుంది ధాన్యలక్ష్మి.ధాన్యలక్ష్మి బుజ్జగించి లోపలికి తీసుకువెళ్తారు వాళ్ళందరు.
మరోవైపు స్వప్న చెంప పగలగొడుతుంది కనకం. ఎందుకు కొట్టిందో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ అర్థం కాదు. అదే అప్పు అడుగుతుంది. ఆ మెసేజ్ పెట్టింది వేరే ఎవరో కాదు ఇదే అంటూ స్వప్న దగ్గర ఫోన్ లాక్కొని చెక్ చేయమని అప్పుకి ఇస్తుంది కనకం. నిజమేనమ్మ ఈ మెసేజ్ అక్క పంపించింది అంటుంది అప్పు. నువ్వు అసలు మనిషివేనా ఏం చేద్దామని ఇదంతా చేస్తున్నావు మరోసారి ఇలా చేస్తే ఎవరు చెప్పినా వినను నిన్ను ఇంట్లోంచి గెంటేస్తాను అని బయటికి వెళ్లిపోతాడు కృష్ణమూర్తి.
మరోవైపు లెక్కల్లో ఎనిమిది లక్షలు తేడా రావటంతో రాహుల్ నిలదీస్తాడు రాజ్. నీళ్లు నములుతాడు రాహుల్. ఖర్చు పెట్టడం ఐదు నిమిషాలపని కానీ అది సంపాదించడం చాలా కష్టం అంటాడు రాజ్. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా.. అంటూ అమాయకంగా మొహం పెడతాడు.
ఈ కావ్య మాటలు నమ్మి అపార్థం చేసుకుంటున్నావు అంటూ పక్కనే ఉన్న కావ్య ని చూస్తూ ఉంటాడు రాహుల్. తరువాయి భాగంలో అపర్ణ ఫ్రెండ్ ఆమె కూతురు వస్తారు. ఆమెకి కాఫీ ఇస్తుంది కావ్య. కాఫీ చాలా బాగుంది ఇలాంటి పని మనుషులు దొరకటం మీ అదృష్టం అంటూ కావ్యకి డబ్బులు ఇస్తుంది ఆవిడ. ఇదంతా అవమానంగా ఫీల్ అవుతారు ఇంట్లో వాళ్ళందరు.