MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Brahmamudi: భర్త చేసిన పనికి అవాక్కైన కావ్య.. కోడలికి అత్తింట్లో స్థానం లేదంటూ షాకిచ్చిన అపర్ణ?

Brahmamudi: భర్త చేసిన పనికి అవాక్కైన కావ్య.. కోడలికి అత్తింట్లో స్థానం లేదంటూ షాకిచ్చిన అపర్ణ?

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. ఇంటి పరువు తీసేసిందని కోడలు మీద కేకలు వేస్తున్న ఒక అత్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

3 Min read
Author : Navya G
Published : Aug 12 2023, 09:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

 ఎపిసోడ్ ప్రారంభంలో కనకం మీ ఇంటికి వచ్చిన అపర్ణ కనకం దంపతులని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. చేసిన తప్పు సరిదిద్దుకుంటానని చెప్పి మీడియా ముందు మాట్లాడి మరింత పరువు తీసేసింది. అందుకే చెప్పాను ఆ ఇంటితో ఇంటికి రాకపోకలు ఉండకూడదని. కానీ నా మాటలు కాదు చేయకుండా కూతుర్ని రప్పించుకోవటమే కాదు అల్లుడ్ని కూడా రప్పించుకోవాలని చూశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

 అంటూ కృష్ణమూర్తి చేతిలో బ్లాంక్ చెక్ పెట్టి ఎంత కావాలంటే అంత రాసుకోండి అంతేగాని కావ్య మరెప్పుడు పుట్టింటి కష్టాలు అని చెప్పి ఇక్కడికి రాకూడదు అని చెప్పి వెళ్ళిపోబోతుంది. కనకం అపర్ణని ఆపి మేము కూటికి గతి లేని వాళ్ళమే అవ్వచ్చు కానీ పక్క వాళ్ళ సొమ్ముకి ఆశ పడే వాళ్ళం కాదు. ఇక మీదట కావ్య ఎక్కడికి చుట్టం చూపుగా మాత్రమే వస్తుంది మా కష్టంలో పాలుపంచుకోవడానికి మాత్రం రాదు అని చెప్పి చెక్ ఆమెకి తిరిగి ఇచ్చేస్తుంది.
 

39

అదీ చూద్దాం మాట మీద ఎంతకాలం నిలబడతారో అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. బాధతో కుప్పకూలిపోతాడు కృష్ణమూర్తి. అత్త ఇంట్లో ఒప్పించి  ఇక్కడికి వచ్చింది అనుకున్నాను కానీ అక్కడ గొడవపడి వచ్చింది అనుకోలేదు లేదంటే ఈ పని చేయడానికి ఒప్పుకునే వాడిని కాదు అని కన్నీరు పెట్టుకుంటాడు కృష్ణమూర్తి. తప్పంతా నాదే మీరు ఒప్పుకోకపోతే బలవంతాన ఒప్పించాను అంటూ కనకం కూడా బాధపడుతుంది.
 

49

 కావ్యని ఇక మీదట పని కోసం ఇక్కడికి రానివ్వకూడదు లేదంటే తన కాపురం పాడైపోతుంది అని చెప్తుంది కనకం తోటి కోడలు. మరోవైపు రాజ్ ని బిజినెస్ పరంగా దెబ్బతీయం కానీ ఎమోషనల్ గా దెబ్బతీయవచ్చు అందుకే కావ్య గురించి లేనిపోనివి చెప్పి అతని మనసు విరిచేసి తన కాంటాక్ట్ పోయేలాగా చేశాను అని తల్లికి చెప్తాడు రాహుల్. అవునా నేను ఇక్కడ అత్తని రెచ్చగొట్టి కోడలు ఇంటికి పంపించాను.
 

59

ఇప్పుడు ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది అనమాట అని నవ్వుకుంటుంది రుద్రాణి. ఈ సీన్ మిస్ అవ్వకూడదు ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేస్తాను అంటాడు రాహుల్. మరోవైపు పుట్టింటికి వచ్చిన కావ్య గబగబా తను పనిచేయటానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు అంటూ జరిగిందంతా చెప్తుంది కనకం. నేను ప్రెస్ మీట్ పెట్టి జరిగిందంతా చెప్పితే సమస్య సర్దుకుంది అనుకున్నాను కానీ ఆవిడ ఇక్కడికి వచ్చి గోల చేస్తుంది అనుకోలేదు.
 

69

ఇప్పుడు ఎలా నాన్న.. ఈ పని చేయకపోతే మనకి డబ్బులు రావు డబ్బులు రాకపోతే ఈ ఇంటిని విడిపించుకోలేము అంటుంది కావ్య. మా చావు ఏం చేస్తాము పరిస్థితి అంతవరకు వస్తే ఇల్లు అమ్మేసి ఏ చెట్టు కింద ఉంటాము అంటాడు కృష్ణమూర్తి. ఇంతలో కాంట్రాక్టర్ వచ్చి మీకు కాంటాక్ట్ క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్తాడు కారణం ఏంటో చెప్పి తీరాలి అంటుంది కావ్య. మీ భర్త రాజ్ కాంట్రాక్ట్ వెనక్కి తీసుకోమని నన్ను బెదిరించారు అనే కాంట్రాక్టర్ చెప్పడంతో కావ్య వాళ్ళు షాక్ అవుతారు.
 

79

కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు కళ్యాణ్ నా అనామిక  ఫోన్ నెంబర్ గురించి ఎంక్వయిరీ చేసావా అంటాడు కళ్యాణ్. నా అనామిక  అంటున్నావ్ ఏంటి అదేదో మీ సొంత మనిషి అయినట్లు అంటుంది అప్పు. ఇంతలో అనామిక అప్పుకి  ఫోన్ చేసి బ్రో అని పిలుస్తుంది. గాంధీతాత దేశమంతటికి తాత అయినట్టు నేను మీ అందరికీ బ్రో అయిపోయానా అని చిరాకు పడుతుంది అప్పు.
 

89

 అది సరేగాని నా ఫోన్ నెంబర్ ఇంకా కనుక్కోలేదా అంటుంది అనామిక. నేను సరిగ్గా కాన్సెంట్రేట్ చేయలేదు లేదంటే నిమిషాల్లో నీ నెంబర్ కనుక్కుంటాను అంటుంది అప్పు. సరే అయితే కనుక్కొని ఫోన్ చెయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనామిక. మరోవైపు ఇంటికి వచ్చిన కోడల్ని నువ్వు చేసిన పని ఏమీ బాగోలేదు అంటూ కేకలు వేస్తుంది అపర్ణ.

99

మీరు చేసిన పని మాత్రం బాగుందా మా ఇంటికి వెళ్లి మా అమ్మ నాన్నని బెదిరిస్తారా అంటూ నిలదీస్తుంది కావ్య. మాకు ఒక ముక్క చెప్పి చేయవలసింది కదా అంటాడు సుభాష్. తరువాయి భాగంలోనువ్వు ఈ ఇంటికి కోడలుగా ఉండాలంటే మేం చెప్పినట్టు చేయవలసిందే. లేదంటే నీకు ఈ ఇంట్లో స్థానం లేదు అని కోడలికి వార్నింగ్ ఇస్తుంది అపర్ణ.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ilaiyaraaja: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇళయరాజాకు అరుదైన గౌరవం.. పోస్టల్ స్టాంప్ రిలీజ్
Recommended image2
kayadu lohar: కయాదు లోహర్ పేరులో ఇంత అర్థం ఉందా? జెన్ జీ బ్యూటీలో మైథాలజీ యాంగిల్
Recommended image3
Mahaveer Karna First Look: పౌరాణిక యోధుడిగా రాఘవ లారెన్స్.. ఫస్ట్ లుక్ ఎలా ఉంది, రిలీజ్ ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved