Anushka Shetty Re Entry: స్టార్ డైరెక్టర్ తో అనుష్క శెట్టి సినిమా, రీ ఎంట్రీ కోసం భారీ ప్లానింగ్..
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్కుకుంది అనుష్క శెట్టి(Anushka Shetty). ఈ మధ్య సినిమాలకు దూరం అయిన అనుష్క.. రీ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్ల సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తన మార్క్ చూపించుకుంది అనుష్క(Anushka Shetty). తెలుగు,తమిళ భాషల్లో తిరుగులేని ఇమేజ్ తో దూసుకు పోయిన ఈకన్నడ బ్యూటీ.. ఆతరువాత సినిమాలకు దూరం అయ్యింది.
హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అవుతున్న టైమ్ లో కూడా బాహుబలి లాంటి పాన్ ఇండియా మూవీతో సెన్సేషనల్ స్టార్ గామారింది అనుష్క(Anushka Shetty). బాహుబలి( Bahubali) తరువాత ఆమె ఇమేజ్.. స్టార్ డమ్ అమాంతం పెరిగిపాయాయి. కాని అప్పటి నుంచీ పెద్దగా సినిమాలు చేయలేదు అనుష్క.
విమెన్ ఒరియెంటెడ్ సినిమాలు చేయాలంటే అనుష్క(Anushka Shetty) తరువాతే ఎవరైనా. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లోనే అరుంధతి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది అనుష్క (Anushka Shetty). అరుంధతి తరువాత సినిమాలోనే కాదు ఆడియన్స్ కూడా అనుష్కను జేజమ్మ అంటూ కీర్తించారంటే ఆ సినిమా ప్రభావం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు.
వరుసగా విమెన్ సెంట్రిక్ మూవీస్ దో దూసుకు పోయిన అనుష్క.. బాగమతి, నిశబ్ధం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ పిక్చర్స్ లో నటించి మెప్పించింది. కాని ఆతరువాత ఆమె సినిమాలు చేయలేదు. బయట ఎక్కువగా కనిపించలేదు కూడా. ఆఫర్లు ఉన్నా అనుష్క(Anushka Shetty) సినిమాలు చేయడం లేదు అని టాగ్ గట్టిగా వినిపించింది.
నిశ్శబ్ధం తరువాత కెరిర్ లో నిశ్శబ్ధత పాటించిన అనుష్క శెట్టి(Anushka Shetty).. కంటికి కనిపించబకుండా కామ్ గా ఉన్నారు. అటు యంట్ హీరో నవీన్ పొలిశెట్టితో సినిమా కన్ ఫార్మ్ అయ్యింది అని టాక్ వినిపించినా.. అది ఇంత వరకూ సెట్స్ మీదకు వెళ్ళలేదు.
ప్రస్తుతం అనుష్క రీ ఎంట్రీ టాక్ ఇండస్ట్రీలో గట్టిగా నడుస్తోంది. చాలా కాలం తరువాత అనుష్క భారీ స్థాయిలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అది కూడా తమిళ డైరెక్టర్ తో అనుష్క(Anushka Shetty) సినిమా ఉండబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళంలో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్న ఏఎల్ విజయ్ (A.L. Vijay) డైరెక్షన్ లో .. అనుష్క సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఓ విమెన్ ఓరియెంటెడ్ కథతో.. భారీ స్థాయిలో ఈమూవీ తెరకెక్కుతుందని సమాచారం. అందులో అనుష్క పాత్ర కూడా కొత్తగా ఉండేట్టు డిజైన్ చేశారట దర్శకుడు.
కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క(Anushka Shetty) పక్కా ప్లాన్ తో రీ ఎంట్రీ ఇస్తోందనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఈ సినిమా కోసం అనుష్క ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇది నిజం అయితే జేజమ్మ ఫ్యాన్స్ కు పండగే.