MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • `మిర్చి`లో ప్రభాస్‌ని అనుష్క నిజంగానే ఎత్తుకుందా?.. వామ్మో స్వీటికి అంత బలం ఉందా?.. ట్రిక్‌ ఇదే!

`మిర్చి`లో ప్రభాస్‌ని అనుష్క నిజంగానే ఎత్తుకుందా?.. వామ్మో స్వీటికి అంత బలం ఉందా?.. ట్రిక్‌ ఇదే!

`మిర్చి` సినిమాలో ప్రభాస్‌ని అనుష్క ఎత్తుకునే సీన్‌ ఉంటుంది. అందులో నిజంగానే డార్లింగ్‌ని స్వీటి ఎత్తుకుందట. ప్రభాస్‌ ఈ విషయం చెప్పి షాకిచ్చాడు. దానికి ఓ ట్రిక్‌ ఉందట.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 16 2024, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ప్రభాస్‌, అనుష్క కలిసి మూడు సినిమాలు చేశారు. `బిల్లా`, `మిర్చి`, `బాహుబలి`లతో హాట్రిక్‌ హిట్‌ కొట్టారు. టాలీవుడ్‌లో ఈ జోడికి మంచి క్రేజ్‌ ఉంది. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్‌ అవుతుంది. అంతేకాదు ఇద్దరు ప్రేమించుకున్నారని, డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు వచ్చాయి. దీనికితోడు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అంతగా ఈ ఇద్దరి జోడీ వెండితెరపై మ్యాజిక్‌ చేయడం విశేషం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇదిలా ఉంటే ఈ ఇద్దరు కలిసి `మిర్చి`లో జోడీ కట్టిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. పెద్ద హిట్‌ అయ్యింది. ఇందులో ప్రభాస్‌కి మరదలి పాత్రలో అనుష్క నటించింది. విదేశాల నుంచి వచ్చిన ప్రభాస్‌కి అన్ని తానై చూసుకునే సీన్లు ఉంటాయి. అందులో భాగంగా ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. అక్కడ మామిడి కాయలు కోయాల్సి ఉంటుంది. అవి అందవు. అనుష్కని ఎత్తుకునేందుకు వెనకడుగు వేస్తాడు ప్రభాస్‌. 
 

38

దీంతో అనుష్కనే ధైర్యం చేస్తుంది. ప్రభాస్‌ని ఎత్తుకుంటుంది. ఆ సీన్‌ మూవీలో అదిరిపోతుంది. దానికి ఆడియెన్స్ రెస్పాన్స్ అదిరిపోయింది. ప్రభాస్‌ అంటే భారీ కటౌట్‌. అనుష్క కూడా హైట్‌గానే ఉంటుంది, కానీ ప్రభాస్‌ని ఎత్తడమంటే మామూలు విషయం కాదు. దానికి ఏదో డూప్‌ పెట్టి, లేదంటే డ్రోప్‌ల సహాయంతో చేసి ఉంటారని అంతా భావించారు. కానీ పెద్ద షాకిచ్చాడు ప్రభాస్‌. అది నిజంగానే చేశారట. 
 

48

`మిర్చి` టీమ్‌ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఆ వీడియో క్లిప్‌ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆ సీన్‌ మ్యాజిక్‌ గురించి చెప్పాలని యాంకర్‌ అడిగింది. దీనికి స్పందిస్తూ నిజంగానే అనుష్కని తనని ఎత్తుకుందని తెలిపాడు. అయితే ముందు ఈ ఐడియా చెప్పినప్పుడు కొత్తగా ఉందనిపించిందట. అందరు హీరోయిన్లని ఎత్తుతుంటారు. అది రొటీన్‌, ఇదేదో బాగుందనిపించిందట. దీంతో ప్రభాస్‌ని అనుష్క నిజంగానే ఎత్తుకుందట. 

58

అయితే ఇందులో చిన్న ట్రిక్‌ని ఉపయోగించారట. ఆ విషయాన్ని ప్రభాస్‌ తెలిపారు. ఫస్ట్ చిన్న కుర్చీ వేశారట. దానిపై తాను నిల్చున్నాడట. దీంతో అనుష్కని తనని అలా గట్టిగా పట్టుకుందట. వెంటనే ఆ కుర్చీతీసేశారు. ఆ గ్యాప్‌లో షూట్‌ చేశారు. అలా కాసేపు ఎత్తకుని అనుష్క మ్యానేజ్‌ చేసిందని, కానీ అది పెద్ద రిస్కే, హైట్‌ ఉన్నవాళ్లు అలా ఎత్తడం సేఫ్‌ కాదు, కానీ అనుష్క కష్టపడిందని ఆమెపై ప్రశంసలు కురిపించారు ప్రభాస్‌. 
 

68

ప్రభాస్‌, అనుష్క ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అనుష్కకి నలభైఏళ్లు దాటాయి. ప్రభాస్‌కి యాభై ఏళ్లకి దగ్గరలో ఉన్నాడు. ఇలా సగం ఏజ్‌ దాటిపోయింది. అయినా పెళ్లి చేసుకోవడం లేదు. అందుకే ఈ ఇద్దరి మధ్య ఎప్పుడూ పెళ్లి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. మరి పెళ్లి చేసుకుంటారా? లేక ఒంటరిగానే ఉండిపోతారా? అనేది చూడాలి. కానీ అభిమానులు మాత్రం ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుండటం విశేషం. 
 

78
Prabhas Kalki 2898 AD film updates out

Prabhas Kalki 2898 AD film updates out

ప్రభాస్‌ ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో `కల్కి2898ఏడీ`లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. దీంతోపాటు మారుతితో చేస్తున్న `ది రాజాసాబ్‌` మూవీ చిత్రీకరణ జరుగుతుంది. సందీప్‌ రెడ్డి వంగాతో `స్పిరిట్‌`, హనురాఘవపూడితో ఓ సినిమా, `సలార్‌ 2`లు చేయాల్సి ఉంది. 

88
Prabhas-Anushka-Gopichand

Prabhas-Anushka-Gopichand

అనుష్క ఆ మధ్య అధిక బరువు కారణంగా సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ జోరు పెంచుతుంది. తెలుగులో క్రిష్‌ దర్శకత్వంలో `ఘాటి` మూవీ చేస్తుంది. అలాగే మలయాళంలో ఓ మూవీలో నటిస్తుంది. ఈ రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Collection: బాక్సాఫీస్ వద్ద రవితేజ ప్రభంజనం.. 9 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
Krishna: 23 ఏళ్ల వయస్సులో కృష్ణకి తల్లిగా, ఏఎన్నార్ కి నానమ్మగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
Mind Bending Thriller: ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్.. ఈ సినిమా చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఎక్కడ చూడొచ్చంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved