- Home
- Entertainment
- హీరోయిన్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు, గలీజు పని చేస్తూ అడ్డంగా దొరికిపోయింది
హీరోయిన్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు, గలీజు పని చేస్తూ అడ్డంగా దొరికిపోయింది
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా రాణిస్తున్న ఓ నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసభ్యకరమైన పని చేస్తూ ఆమె అడ్డంగా బుక్కయ్యారు.

చిత్ర పరిశ్రమలో కొందరు హీరోయిన్లు ఎంతో కష్టపడి తమ ప్రతిభతో అవాకాశాలు దక్కించుకుంటున్నారు. కొందరు మాత్రం అడ్డదారులు తొక్కుతున్న వేస్తున్నాయి. కొందరు నటీమణులు చిత్ర పరిశ్రమలోకి కొత్తగా వచ్చే అమ్మాయిలని అనేక ప్రలోభాలకు గురి చేసి వారితో పాడు పని చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటన బెంగాలీ చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంది.
బెంగాలీ సినిమాలో ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అనుష్క మోని మోహన్ దాస్ ని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కొందరు నటీమణుల చేత ఆమె ప్రాస్టిట్యూషన్ చేయిస్తూ అడ్డంగా బుక్కయ్యారు. అవకాశాలు లేని, డబ్బు అవసరం ఉండే వర్థమాన నటీమణులకు అనుష్క మోని మోహన్ దాస్ ఎరవేసి ప్రాస్టిట్యూషన్ లోకి లాగడమే ఆమె పని.
ఇలా అసభ్యకర పని చేస్తున్న అనుష్క మోనిని అరెస్ట్ చేయాలని పోలీసులు స్కెచ్ వేశారు. అనుష్క మోని మహారాష్ట్రలోని ఠానే అనే జిల్లాలో ఈ ప్రాస్టిట్యూషన్ దందా సాగిస్తోంది. సెప్టెంబర్ 5న ఆమె ఇద్దరు అమ్మాయిలని తరలిస్తుండగా పోలీసులు పథకంతో పట్టుకున్నారు. ఆ ఇద్దరు అమ్మాయిల కెరీర్ కాపాడారు.
ప్రస్తుతం ఈ వార్త బెంగాలీ చిత్ర పరిశ్రమని కుదిపేస్తోంది. అనుష్క మోని వయసు 41 ఏళ్ళు. బెంగాలీలో తెరకెక్కిన లోఫర్ అనే చిత్రంతో ఆమెకి గుర్తింపు లభించింది. మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టిన అనుష్క మోని ఆ తర్వాత మ్యూజిక్ వీడియోలు కూడా చేశారు.
ఈ కేసులో అనుష్క తో పాటు మరో 20 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అంసహక మోని మీడియేటర్ గా వ్యవహరించారట. నటీమణుల జీవితాలు నాశనం అయ్యేలా వ్యవహరిస్తున్న అనుష్క మోనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.