- Home
- Entertainment
- హీరోల చుట్టూ తిరుగుతూ.. నాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, ప్రసక్తే లేదు అంటూ తేల్చేసిన అనుపమ
హీరోల చుట్టూ తిరుగుతూ.. నాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, ప్రసక్తే లేదు అంటూ తేల్చేసిన అనుపమ
టాలీవుడ్ లో అవకాశాలు కాస్త నెమ్మదించిన టైంలో అనుపమ పరమేశ్వరన్ ని అదృష్టం వరించింది. ఆమె ఖాతాలో లేటెస్ట్ గా కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ పడింది.

టాలీవుడ్ లో అవకాశాలు కాస్త నెమ్మదించిన టైంలో అనుపమ పరమేశ్వరన్ ని అదృష్టం వరించింది. ఆమె ఖాతాలో లేటెస్ట్ గా కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ పడింది. కార్తికేయ 2 పాన్ ఇండియా సక్సెస్ కావడంతో అనుపమ సంతోషానికి అవధులు లేవు.
మొన్నటి వరకు అనుపమ కార్తికేయ 2 ప్రమోషన్స్, సక్సెస్ సెలెబ్రేషన్స్ లో బిజీగా పాల్గొంది. అయితే అనుపమకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఆమె విశ్రాంతి తీసుకుంటోందట. ఇటీవల ఇంటర్వ్యూలో అనుపమ తన చిత్రాల ఎంపిక గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
కార్తికేయ 2 హిందీలో కూడా సూపర్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి కూడా అనుపమకు ఆఫర్స్ వస్తున్నాయట. కానీ అన్ని చిత్రాలని అంగీకరించనని తెలిపింది. నాకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. అన్ని చిత్రాలని ఓకె చేయను. హీరోల చుట్టూ తిరుగుతూ, వాళ్లని పొగుడుతూ ఉండే పాత్రలు నాకు వద్దు అని అనుపమ తేల్చేసింది.
పాటలు, గ్లామర్ కి పరిమితం అయ్యే రోల్స్ లో నటించాలని అనుకోవడం లేదని అనుపమ తెలిపింది. నేను నటించే చిత్రాల్లో కథ బలంగా ఉండాలి. తన పాత్రకి కూడా ప్రాముఖ్యత ఉండాలని అనుపమ కండిషన్ పెట్టింది. ఓటిటి, రీమేక్ చిత్రాల వల్ల మంచి కంటెంట్ ఆడియన్స్ అందరికి చేరుతోంది.
ప్రేక్షకులు కూడా కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలనే ఆదరిస్తున్నారు అని తెలిపింది. కార్తికేయ 2లో అనుపమ సినిమా మొత్తం హీరోతో ట్రావెల్ అయ్యే పాత్రలో నటించింది. నిఖిల్, అనుపమ మరోసారి జంటగా 18 పేజెస్ చిత్రంలో నటిస్తున్నారు.
చందూ ముండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 ప్రేక్షకులకి మెస్మరైజ్ చేసింది. మన పురాణాలు కథలు కాదని.. మన చరిత్ర అని దర్శకుడు బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష సపోర్టింగ్ రోల్స్ లో నటించారు.