అనుపమ కొప్పులో మల్లెలు పెడితే ఆ అందమే వేరులే.. మెస్మరైజ్ చేస్తున్న శారీ ఫొటోస్
క్యూట్ హీరోయిన్ అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది.

క్యూట్ హీరోయిన్ అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అనుపమ గత ఏడాది నటించిన కార్తికేయ 2 ఇండియా వ్యాప్తంగా సూపర్ సక్సెస్ సొంతం చేసుకోవడంతో ఈ యంగ్ బ్యూటీ గాల్లో తేలిపోతోంది.
మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది. శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుపమ నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. అనుపమ మోడ్రన్ డ్రెస్ లతో పాటు సాంప్రదాయ వస్త్రధారణలో కూడా మెరిసిపోవడం చూస్తూనే ఉన్నాం. ఎల్లో శారీలో హొయలు ఒలికిస్తూ అనుపమ ఇచ్చిన ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి.
అనుపమ కొప్పున మల్లెలు పెడితే ఆ అందమే వేరు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. హుందాగా, అంతే అందంగా ఉన్న అనుపమ లుక్ చూపు తిప్పుకోలేని విధంగా ఉంది.
ఒక కొన్ని స్టిల్స్ క్యూట్ గా, మరికొన్ని స్టిల్స్ లో చిరునవ్వుతో అనుపమ ఇస్తున్న ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి. కార్తికేయ 2 పాన్ ఇండియా ఘన విజయం తర్వాత సోషల్ మీడియాలో అనుపమ జోరు మామూలుగా లేదు.
అనుపమ సౌత్ లో బ్యూటీ క్వీన్ అని చెప్పొచ్చు. ఎక్కువగా గ్లామర్ షో చేయకుండానే యువతకి అభిమాన హీరోయిన్ గా మారిపోయింది అనుపమ. ఆమె క్యూట్ లుక్స్ ప్రతి ఒక్కరిని మైమరపించేలా ఉంటాయి.
అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో అనుపమని కూడా దురదృష్టం వెంటాడింది. మొదట 'రంగస్థలం' చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అవకాశం ఆమె చేజారింది.