- Home
- Entertainment
- Anupama: మేకప్ లేకుండా రియల్ అందం చూపించిన అనుపమా పరమేశ్వరన్.. పెట్‌తో చిలిపి పోజులిస్తూ హంటింగ్
Anupama: మేకప్ లేకుండా రియల్ అందం చూపించిన అనుపమా పరమేశ్వరన్.. పెట్‌తో చిలిపి పోజులిస్తూ హంటింగ్
అనుపమా పరమేశ్వరన్ నేచురల్ బ్యూటీ. క్యూట్‌నెస్‌కి కేరాఫ్. అయితే హాట్ డోస్ పెంచుతూ అప్పుడప్పుడు మంత్రముగ్దుల్ని చేస్తుంటుంది. కానీ మేకప్ లేకుండా కనిపిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే.

మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్.. తాజాగా మేకప్ లేకుండా తన క్యూట్ ఫోటోలను పంచుకుంది. తన పెట్ డాగ్ పప్పితో ఆడుకుంటూ దిగిన ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె క్యూట్‌నెస్ ఓవర్ లోడ్ అనేలా ఉండటం విశేషం.
ఇందులో ఆమె పోస్ట్ పెడుతూ, ఎడిట్ చేయని లుక్, ఫిల్టర్ లేని ఎమోషన్స్ అంటూ పేర్కొంది. పోస్ట్ కి దగ్గట్టే ఆమె కూడా ఫిల్టర్ లేని అందంతో కటిపడేస్తుంది. క్యూట్ అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అనుపమా పరమేశ్వరన్.. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె గతేడాది `రౌడీబాయ్స్`, `కార్తికేయ 2`, `18పేజెస్`, `బట్టర్‌ఫ్లై` చిత్రాలతో మెరిసింది. విజయాలు అందుకుంది. అయితే ఇందులో కొన్ని యావరేజ్‌గానే నిలిచినా, నటిగా ఆమెకి మంచి మార్కులే పడ్డాయి.
ప్రస్తుతం ఆమె `టిల్లు స్వ్కైర్` చిత్రంలో నటిస్తుంది. సిద్ధు జొన్నలగడ్డతో ఆడిపాడబోతుంది. మొదటి ఇందులో హీరోయిన్‌గా ఒప్పుకుని తప్పుకుంది. మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఆగస్ట్ లో విడుదల కాబోతుంది.
ఇదిలా ఉంటే నటనకు ప్రయారిటీ ఉన్న సినిమాలే చేస్తుంది అనుపమా పరమేశ్వరన్. గ్లామర్‌కి దూరంగా బలమైన కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతని చాటుకుంటుంది. నటిగా నిరూపించుకుంటుంది. ఆ మధ్య వచ్చిన `బట్టర్‌ఫ్లై` చిత్రంలో ఆమె ముఖ్య పాత్ర పోషించింది. సినిమాని తన భుజాలపై మోసింది.