MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డీజే టిల్లు 2 గొడవ హీరో వల్లేనా.. అనుపమ షాకింగ్ రియాక్షన్, హీరోయిన్ పాత్ర టూమచ్ గా..?

డీజే టిల్లు 2 గొడవ హీరో వల్లేనా.. అనుపమ షాకింగ్ రియాక్షన్, హీరోయిన్ పాత్ర టూమచ్ గా..?

మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కెరీర్ మిక్స్డ్ బ్యాగ్ అన్నట్లుగా కొనసాగుతోంది. మంచి విజయాలతో పాటు పరాజయాలు కూడా ఎదురవుతున్నాయి. కార్తికేయ 2లాంటి పాన్ ఇండియా హిట్ ఆమె ఖాతాలో పడింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 01 2022, 10:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కెరీర్ మిక్స్డ్ బ్యాగ్ అన్నట్లుగా కొనసాగుతోంది. మంచి విజయాలతో పాటు పరాజయాలు కూడా ఎదురవుతున్నాయి. కార్తికేయ 2లాంటి పాన్ ఇండియా హిట్ ఆమె ఖాతాలో పడింది. కానీ కొన్ని గోల్డెన్ ఆఫర్స్ చేజారుతున్నాయి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు చిత్రం ఈ ఏడాది విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా డీజే తిళ్ళు చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. ఈ చిత్రంలో సిద్దుకి జోడిగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక సీక్వెల్ కోసం హీరోయిన్ ని చేంజ్ చేస్తున్నారు. డీజే టిల్లు 2లో నటించే ఛాన్స్ ముందుగా అనుపమ పరమేశ్వరన్ ని వరించింది. 

 

37

కానీ అనూహ్యంగా అనుపమని ఈ చిత్రం నుంచి తప్పించారు. విభేదాల కారణంగా అనుపమ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో ఆమె స్థానంలోకి మరో మలయాళీ హాట్ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ ని ఎంపిక చేశారు. షూటింగ్ కి కొన్ని రోజుల ముందు ఇలా జరగడం షాకింగ్ అనే చెప్పాలి. 

47

ఇది కాస్త పెద్ద వివాదంగానే మారుతోంది. అనుపమని తప్పించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అనుపమ తాజాగా పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. 'ఒక చోట ఎగ్జిట్ అయితే మరో చోట ఎంట్రీ ఉంటుంది' అంటూ అనుపమ కామెంట్స్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో ఓ పిక్ పోస్ట్ చేస్తూ ఈ కామెంట్ జోడించింది. అనుపమ చేసిన ఈ కామెంట్స్ డీజే టిల్లు 2 గురించే అని అర్థం అవుతోంది. అంటే అనుపమ ఈ చిత్రం నుంచి తప్పుకున్నందుకు పెద్దగా ఫీల్ అవడం లేదు. 

57

హీరో సిద్దు జొన్నలగడ్డతో విభేదాలే ఈ వివాదానికి, అనుపమ ఎగ్జిట్ కి కారణం అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. డీజే టిల్లు మొదటి భాగాన్ని విమల్ కృష్ణ తెరకెక్కించారు. క్రియేటివ్ డిఫరెన్స్ రెండవ భాగం నుంచి దర్శకుడు కూడా తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో నిర్మాణ సంస్థ సిద్దుకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తూ దర్శకత్వ బాధ్యతలు కూడా అప్పగించిందట. 

67

దీనితో సిద్దు ఇన్వాల్వ్మెంట్ సహజంగానే పెరిగిపోయింది. ముందుగా పెళ్లి సందD ఫేమ్ శ్రీలీలని హీరోయిన్ గా అనుకున్నారు. ఆమె తప్పుకోవడంతో అనుపమ వచ్చింది. ఇప్పుడు అనుమప ప్లేస్ లో మడోన్నా పేరు వినిపిస్తోంది. హీరోయిన్ విషయంలో ఎంత రచ్చ ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి. 

77

మొదటి భాగాన్ని మించేలా రెండవ భాగంలో హీరోయిన్ పాత్ర బోల్డ్ గా ఉండబోతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అందువల్లే హీరోయిన్లు చేతులెత్తేస్తున్నారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అదే తరుణంలో సిద్దు జొన్నలగడ్డ ఇన్వాల్మెంట్ పై కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ కాంట్రవర్సీకి చిత్ర యూనిట్ ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: కృష్ణంరాజు ముఖం చూసి ప్రభాస్ ని వదిలేయమంది నా భార్య, చాలా హర్ట్ అయ్యా.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Nagababu: నాగబాబు 'మేము కాప్ లం' వెబ్ సిరీస్ ట్రైలర్.. పందెం కోడిపుంజు పోయింది, నవ్వులు పూయిస్తున్నారుగా
Recommended image3
Mouni Roy Divorce: నాలుగేళ్ల వివాహ బంధానికి గుడ్ బై.. భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించిన విశ్వంభర నటి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved