- Home
- Entertainment
- Anupama Parameswaran: బుట్టబొమ్మలా మెరిసిపోతున్న అనుపమా పరమేశ్వరన్.. చిరునవ్వుతో మెస్మరైజ్ చేస్తుంది.
Anupama Parameswaran: బుట్టబొమ్మలా మెరిసిపోతున్న అనుపమా పరమేశ్వరన్.. చిరునవ్వుతో మెస్మరైజ్ చేస్తుంది.
దేవకన్యలా మెరిసిపోతోంది మలయాళ ముద్దు గుమ్మ అనుపమా పరమేశ్వరన్. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న రౌడీ బాయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిపోయింది.

ఎక్స్ పోజింగ్ కు సాధ్యమైనతం వరకూ దూరంగా ఉంటుంది అనుపమా పరమేశ్వరన్. హద్దులు మీరి హడావిడి చేయదు. ఎప్పుడూ ట్రెడిషనల్ వేర్ లోనే కనిపిస్తుంది. కర్లీ హెయిర్ తో.. స్మైలీ ఫేస్ తో ఆకట్టుకుంటుంది అనుపమ. రౌడీ బ్యాయ్స్ ఫంక్షన్ లో కూడా ఇలానే మెరుపులు మెరిపించింది అనుపమ.
రౌడీ బాయ్స్ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు అనుపమ. అంతే కాదు తనను పొడగ్తలతో ముంచెత్తిన రామ్ చరణ్ కు ప్రత్యేకంగా కృతజ్జతలు తెలిపారు. ట్రిపుల్ ఆర్ కోసం ఎదురు చూస్తున్నానంటూ చరణ్ ను స్పెషల్ గా విష్ చేశారు అనుపమ.
దిల్ రాజు ప్రొడక్షన్ లో శతమానంభవతి తనకు ప్రత్యకమైన సినిమా అన్నారు అనుపమ. ఆ సినిమా తరువాత తనను నమ్మి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు.. తనకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు దిల్ రాజుకు ప్రత్యేకంగా కృతజ్జతలు తెలిపారు అనుపమ.మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాను అనుకున్నాననే అనుకుంటున్నా అన్నారు.
చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు అనుపమా పరమేశ్వరన్. టాలీవుడ్ లో కుర్ర హీరోల తో రొమాంన్స్ చేస్తుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటంది అనుపమా. డైలీ ఏదో ఒక అప్ డేట్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇష్తూనే ఉంటుంది.
ఇటు సినిమాలతో పాటు అను సోషల్ మీడియా లో కూడా ఫాలోవర్స్ ను గట్టిగానే సాధించింది మలయాళ బ్యూటీ. హద్దులు దాటని డ్రెస్సింగ్ స్టైల్స్ లో .. డిఫరెంట్ ఫోటోస్ తో.. కాన్సెప్ట్ లతో.. సందడి చేస్తుంది. అంతే కాదు..తన లైఫ్ లో జరిగే ఇంపార్టెంట్ విషయాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటుంది అనుపమా పరమేశ్వరన్.