MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టిల్లు స్క్వేర్ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ చూశారా.. చీరకట్టులో అనుపమ అణువణువూ అందమే

టిల్లు స్క్వేర్ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ చూశారా.. చీరకట్టులో అనుపమ అణువణువూ అందమే

క్యూట్ హీరోయిన్ అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 26 2023, 08:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

క్యూట్ హీరోయిన్ అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అనుపమ గత ఏడాది నటించిన కార్తికేయ 2 ఇండియా వ్యాప్తంగా సూపర్ సక్సెస్ సొంతం చేసుకోవడంతో ఈ యంగ్ బ్యూటీ గాల్లో తేలిపోతోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది. శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుపమ నటించింది. కార్తికేయ 2 చిత్రంలో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ సరసన బోల్డ్ రొమాన్స్ పండించేందుకు టిల్లు స్క్వేర్ అనే చిత్రంలో నటిస్తోంది. 

38

తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. అనుపమ మోడ్రన్ డ్రెస్ లతో పాటు సాంప్రదాయ వస్త్రధారణలో కూడా మెరిసిపోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా అనుపమ పర్పుల్ కలర్ నిండైన చీరకట్టులో అదరహో అనిపించే ఫోజులు ఇచ్చింది. 

48

కొప్పున పూలు పెట్టుకుని హుందాగా, అందంగా అనుపమ మెరుపులు మెరిపించింది. ఆమె అణువణువూ అందమే అంటూ నెటిజన్లు మైమరచిపోతున్నారు. 

58

అనుపమ నిలువెత్తు సొగసుతో చీరకట్టులో అయస్కాంతం లాగా ఆకర్షిస్తోంది. కార్తికేయ 2 పాన్ ఇండియా ఘన విజయం తర్వాత సోషల్ మీడియాలో అనుపమ జోరు మామూలుగా లేదు. 

68

అనుపమ సౌత్ లో బ్యూటీ క్వీన్ అని చెప్పొచ్చు. ఎక్కువగా గ్లామర్ షో చేయకుండానే యువతకి అభిమాన హీరోయిన్ గా మారిపోయింది అనుపమ. ఆమె క్యూట్ లుక్స్ ప్రతి ఒక్కరిని మైమరపించేలా ఉంటాయి. 

78

అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో అనుపమని కూడా దురదృష్టం వెంటాడింది. మొదట 'రంగస్థలం' చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అవకాశం ఆమె చేజారింది. 

88

మొత్తంగా కార్తికేయ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అనుపమకి బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయట. కానీ ప్రతి ఆఫర్ ని ఒకే చేయను అని, నటనకి ప్రాధాన్యత ఉన్న చిత్రాలు మాత్రమే చేస్తాను అని అనుపమ అంటోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: 2 ఎకరాల్లో 200 కోట్ల రాజభవనం.. ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లేస్ వాల్యూ ఎంతో తెలుసా? షాక్ అవుతారు..
Recommended image2
Ananya Panday: భరతనాట్యం చేశావా? ఖూనీ చేశావా? అనన్య డ్యాన్స్‌పై నెటిజన్ల ఫైర్
Recommended image3
Sri Satya: యాంకర్‌గా టర్న్ తీసుకున్న బిగ్‌ బాస్‌ నటి.. కాన్స్ లో శ్రీసత్య కొత్త జర్నీ షురూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved