MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఉంగరాల జుట్టుతోనే ఉరేసేలా ఉందిగా.. బ్లూ డ్రెస్ లో అనుపమా బ్యూటీఫుల్ లుక్స్... వీకెండ్ ప్లానింగ్స్ ఇవేనంట!

ఉంగరాల జుట్టుతోనే ఉరేసేలా ఉందిగా.. బ్లూ డ్రెస్ లో అనుపమా బ్యూటీఫుల్ లుక్స్... వీకెండ్ ప్లానింగ్స్ ఇవేనంట!

సోషల్ మీడియాలో చిలిపి చేష్టలతో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)  సందడి చేస్తుంటుంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూ అట్రాక్ట్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా మరిన్ని ఫొటోలను పంచుకుంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 17 2023, 07:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ అనుపమా పరమేశ్వరన్ హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సక్సెస్ అందుకుంటూ వస్తోంది. కొన్ని చిత్రాలు ఆశించిన మేర ఫలితానివ్వకపోయినా స్పీడ్ తగ్గడం లేదు. 
 

28

‘కార్తీకేయ2’, ‘18 పేజెస్’ వంటి చిత్రాలతో మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం కూడా మరిన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఇటు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తూ సందడి చేస్తోంది. వరుసగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. 
 

38

అనుపమా గతంలో గ్లామర్ షోకు అంతగా ప్రధాన్యత ఇచ్చేది కాదు. ఆ మధ్యలో ఫ్లాప్స్ రావడం, కెరీర్ స్లో అవ్వడంతో నెట్టింట అందాల విందు చేస్తూ కనిపించింది. మరోవైపు తన చిలిపిచేష్టలతోనూ  ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లను కట్టిపడేసింది. ఇటీవల మంచి స్పీడ్ పెంచి గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. 
 

48

తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ లుక్ లో ఫొటోషూట్ చేసింది. బ్లూ గౌన్ ధరించి మరింత అందాన్ని సొంతం చేసుకుంది. కిర్రాక్ ఫోజులిస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. స్టన్నింగ్ స్టిల్స్ తో పాటు మత్తెక్కించే చూపులతో కుర్ర భామ కట్టిపడేసింది. 
 

58

మరోవైపు తన ఉంగరాల జుట్టుతో ఆటలాడుతూ, నిషా కళ్లతో మత్తెక్కించింది. చిలిపి చేష్టలతో బ్యూటీఫుల్ స్మైల్ తో కుర్ర హృదయాలను దోచుకుంది. తన రూపసౌందర్యంతో, అదిరిపోయే లుక్ తో మెస్మరైజ్ చేసింది. ఈ సందర్బంగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను అభిమానులతో పంచుకుంది. 
 

68

వీకెండ్స్ లో తను ఏం చేస్తుందో తెలియజేసింది. ఎక్కువ శాతం హీరోయిన్స్ టూర్లకు వెళ్తూ ఉంటారు. వెకేషన్లను ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అనుపమా మాత్రం ఇంట్లోనే పనిచేస్తూ ఉంటానని చెప్పుకొచ్చింది. ఇంట్లోని వస్తువులు, ఫ్లోర్ శుభ్రం చేస్తున్న ఓ వీడియోను కూడా పంచుకుంది. 
 

78

అనుపమా నిజానికి ఎక్కువగా టూర్లు, వెకేషన్లను వెళ్లదు. చాలా అరుదుగా అలా కనిపిస్తుంటుంది. ఎక్కువగా ఫ్యామిలీతోనే సమయం గుడుపుతుంటుంది. లేదంటే ఇంట్లో పనులు చేసేందుకు సమయం కేటాయిస్తుంటుంది. రీసెంట్ గా ఆవకాయ పచ్చడి తయారు చేస్తూ కనిపించింది. దీంతో అందరి నుంచి అభినందనలు అందుకుంది. 
 

88

ఇదిలా ఉంటే.. అనుపమా ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న Tillu Square లో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటిస్తోంది. మరోవైపు విమెన్ సెంట్రిక్ మూవీ ’సైరెన్’లోనూ నటిస్తోంది. ఇక మాస్ మహారాజ రవితేజ ‘ఈగల్’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇలా వరుస చిత్రాల్లో నటిస్తోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajasekhar: అందుకే నాకు సాయికుమార్ డబ్బింగ్ చెప్తారు.. క్లారిటీ ఇచ్చేసిన రాజశేఖర్
Recommended image2
Raghu Kunche: చక్రి మంచితనమే తనని చంపేసింది.. చివరి రోజుల్లో తన పడ్డ నరకయాతన ఎలా ఉండేదంటే.!
Recommended image3
Dhurandhar 2 Collection: 14వ రోజు కూడా ఆగని వసూళ్లు.. బాలీవుడ్‌లో ధురంధర్ 2 కొత్త రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved