డీజే టిల్లు 2 వివాదంపై అనుపమ ఫ్రస్ట్రేషన్.. షాకింగ్ ఆన్సర్ వైరల్
మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కెరీర్ మిక్స్డ్ బ్యాగ్ అన్నట్లుగా కొనసాగుతోంది. మంచి విజయాలతో పాటు పరాజయాలు కూడా ఎదురవుతున్నాయి.

మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కెరీర్ మిక్స్డ్ బ్యాగ్ అన్నట్లుగా కొనసాగుతోంది. మంచి విజయాలతో పాటు పరాజయాలు కూడా ఎదురవుతున్నాయి. కార్తికేయ 2లాంటి పాన్ ఇండియా హిట్ ఆమె ఖాతాలో పడింది. అయితే కొన్ని అవకాశాలు చేజారుతుండడంతో అనుపమ వార్తల్లో నిలుస్తోంది.
యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా డీజే టిల్లు చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. ఈ చిత్రంలో సిద్దుకి జోడిగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక సీక్వెల్ కోసం హీరోయిన్ ని చేంజ్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి హీరోయిన్ ఎంపిక చేయడం కష్టంగా మారుతోంది. మొదట శ్రీలీల పేరు వినిపించింది.
అనుపమ పరమేశ్వరన్ ఎంపిక దాదాపు ఖాయం అన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల అనుపమ కూడా ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ప్రస్తుతం మడోన్నా సెబాస్టియన్, హిట్ 2 ఫేమ్ మీనాక్షి చౌదరి లాంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇంత వరకు ఎవరూ ఫైనల్ కాలేదు. అయితే హీరో సిద్దు జొన్నలగడ్డతో విభేదాల కారణంగానే అనుపమ ఈ చిత్రం నుంచి తప్పుకుందని రూమర్ ఉంది.
ప్రస్తుతం అనుపమ 18 పేజెస్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా అనుపమని డీజే టిల్లు 2 వివాదం గురించి అడిగారు. అయితే అనుపమ ఈ చిత్రం గురించి మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. తన ఫ్రస్ట్రేషన్ బయట పెడుతూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.
'ఇప్పుడు 18 పేజెస్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. టిల్లు స్క్వేర్ లో ఏం జరుగుతోందో నాకు తెలియదు. నేను కూడా కొన్ని ఆర్టికల్స్ చదివాను అంటూ అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కనీసం టిల్లు స్క్వేర్ గురించి మాట్లాడేందుకు కూడా అనుపమ ఇష్టపడడం లేదు. కార్తికేయ 2 తో హిట్ కొట్టిన అనుపమ, నిఖిల్ జోడి మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధం అయ్యారు.