- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: తులసి దగ్గరకు వచ్చేసిన అంకిత.. మా అమ్మ దగ్గరకు మాత్రం వెళ్ళనంటూ!?
Intinti Gruhalakshmi: తులసి దగ్గరకు వచ్చేసిన అంకిత.. మా అమ్మ దగ్గరకు మాత్రం వెళ్ళనంటూ!?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది. ఇక ఈరోజు జూన్ 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈ రోజు ఎపిసోడ్ లో చివరి లక్కీ పర్సన్ గా తులసి ని ఎంపిక చేయడంతో తులసి ఫ్యామిలీ ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. కుటుంబం మొత్తం ఎంపిక అవ్వడంతో అందరూ ఆనంద పడుతూ ఉంటారు. అప్పుడు లాస్య పడుతూ ఉంటుంది. లాస్య ను చూసి నందు అక్కడనుంచి వెళ్ళి పోతూ ఉండగా దివ్య అడ్డుకొని ప్లీజ్ నాకోసం ఉండండి డాడ్ అని బ్రతిమలాడుతుంది.
అప్పుడు నందు వెళ్ళిపోకుండా అక్కడే ఆగిపోతాడు. అప్పుడు లాస్య షాపింగ్ మాల్ లీ ఇంతమంది ఉండగా ఒకే ప్రాంతానికి చెందిన వారిని ఎలా సెలెక్ట్ చేస్తారు షాపింగ్ మాల్ సిబ్బందిపై ఫైర్ అవుతుంది. అప్పుడు వారు మాపై అనవసరంగా నిందలు మోపొద్దు. కావాలంటే ఈ బౌల్ లో ఉన్న వాటిలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి అని అనడంతో లాస్య ఒక్కొక్కటి చెక్ చేస్తుంది అందులో లాస్య పేరు ఉండటంతో మీ డౌట్ క్లియర్ అయ్యిందా అంటూ వారు లాస్యకు చురకలు అంటిస్తారు.
ఐదుగురిని పక్కపక్కన నిలబెట్టి ఫోటోలు తీస్తారు. త్వరలోనే కాశ్మీర్ కి ఫ్లైట్ టికెట్స్ పంపిస్తాము అని చెప్తారు. ఆ తర్వాత తులసి బంధాల గురించి మాట్లాడుతూ.. లాస్య మాత్రం కోపంతో రగిలి పోతు ఉంటుంది. ఇప్పుడు దివ్య అందరు కలిసి ఫ్యామిలీ సెల్ఫీ దిగుదాం అనడంతో లాస్య తప్ప మిగిలిన వారందరూ కలిసి సెల్ఫీ దిగడంతో అప్పుడు లాస్య కోపంతో అక్కడినుంచి వెళ్లిపోతుంది.
నందు లాస్య వెనకాలే వెళ్తుండటంతో పరంధామయ్య చూసి నిన్ను చూస్తే అంటే బాధ వేస్తుందిరా! ఒంటరి వాడిని అయ్యావా! ఇప్పటికైనా నువ్వు ఏం కోల్పోయావు నీవు అర్థం చేసుకున్నావా! అని మాట్లాడతాడు. ఇంటికి వెళ్లడంతో లాస్య నందు పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుంది. నందు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా కూడా లాస్య మరింత రెచ్చిపోయి నందు పై ఫైర్ అవుతుంది.
అప్పుడు లాస్య నందు కాలర్ పట్టుకొని నిలదీస్తూ అవ్వడంతో నందు నాది తప్పు ఇంకొకసారి రిపీట్ కానివ్వను నన్ను నమ్ము అని అంటూ చేతులు పట్టుకొని బ్రతిమిలాడాడు. ఇప్పుడు లాస్య నందు గుండెలపై వాలి ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు అభి ఇందుకోసం డబ్బులు అడగగా నువ్వు ప్రేమ్ కోసం డబ్బులు అడుగుతున్నానని అనుకున్నాను అని అంటుంది అంకిత. అప్పుడు అంకిత అభి కి చెక్ ని వెనక్కి తీసుకుంటుంది. ఇప్పుడు అంకిత ఆస్తి నాది నా ఇష్టం అని చెప్పి గాయత్రి ఇంటి నుంచి బయలుదేరి తులసి ఇంటికి వెళ్లి పోతుంది.