- Home
- Entertainment
- Intinti Gruhalashmi: లాస్య, నందులకు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పుకున్న అంకిత.. కుమిలిపోతున్న తులసి!
Intinti Gruhalashmi: లాస్య, నందులకు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పుకున్న అంకిత.. కుమిలిపోతున్న తులసి!
Intinti Gruhalashmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది. ఇక ఈరోజు జూన్ 13ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభం లోనే శృతి (Shruthi) మేము ఇలాంటి పరిస్థితి దగ్గర జారడానికి కారణం.. మీ కల నెరవేర్చడం కోసమే ఆంటీ అని చెబుతుంది. ఇక నేను పని మనిషిగా చేస్తున్న సంగతి ప్రేమ్ (Prem) కి చెప్పలేదు అని అంటుంది. ఇక ప్రేమ్ కొత్త ఆల్బం నిర్మించడానికి.. ఐదు లక్షలు కోసం తిరుగుతున్నాం అంటుంది.
దాంతో అంకిత (Ankitha) ఆ అయిదు లక్షలు నేను నీకు ఇస్తాను అని అంటుంది. ఇక తులసి (Tulasi) నువ్వు శృతి ఐదు లక్షలు ఇస్తే అభి వేసిన నింద నిజమవుతుంది. ఇక అంకిత అవసరానికి లేని డబ్బులు నాకెందుకు ఆంటీ.. నేను హ్యాపీ పేరుమీద కు ట్రాన్స్ఫర్ చేయమని అంటాను అని అంటుంది. దాంతో తులసి కూడా ఒప్పుకోక తప్పదు.
ఆ తర్వాత అభి (Abhi) ఈవినింగ్ నుంచి ఇంట్లో లేవు ఎక్కడికి వెళ్లావు అని అంకిత (Ankitha) ను అడుగుతాడు. ఇక నువ్వు రోజంతా ఎక్కడ తిరుగుతున్నావో నాకు చెప్పనప్పుడు నన్ను అడిగే హక్కు నీకు లేదు అని అంకిత అంటుంది. ఆ తర్వాత అంకిత నేను తులసి ఆంటీ ని కలవడానికి వెళ్లాను అంటుంది.
ఇక ఇంత అర్జెంటుగా మా అమ్మని కలవాల్సిన అవసరం ఏమి వచ్చింది అని అభి (Abhi) అడుగుతాడు. ఆ తర్వాత అవి మా వాళ్లకు డబ్బు హెల్ప్ చేయాలని దానికి నీ సహాయం కావాలని.. తన తండ్రి విషయంలో అడుగుతాడు. దానికి అంకిత (Ankitha) అభి ప్రేమ్ విషయం లో ఇలా నన్ను హెల్ప్ అడుగుతున్నాడు ఏమో అని హ్యాపీ గా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
ఆ ఆనందం లో అభి (Abhi) అంకితను కౌగిలించుకుంటాడు. మరోవైపు లాస్య (Lasya) అంకితను డబ్బు అడిగే విషయంలో ఇంకా అప్ డేట్ ఇవ్వలేదని లాస్య చిరాకు పడుతూ ఉంటుంది. ఇక టెన్షన్ పడే బదులు అభి కి కాల్ చేస్తే తెలిసిపోతుంది కదా అని లాస్య అంటుంది. ఈలోపు నందు కి అభి కాల్ చేస్తాడు. డబ్బు ఇవ్వడానికి అంకిత ఒప్పుకుంది అని చెబుతాడు.
దాంతో ఆ దంపతులు ఒక రేంజ్ లో ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు. మరోవైపు తులసి (Tulasi) అభి (Abhi) పడే బాధలు తట్టుకోలేక.. నోరు తెరచి ఒక మాట చెప్పి ఉండొచ్చు కద రా నిన్ను నా దగ్గరికి తీసుకు వచ్చే దానిని అని బాధపడుతూ ఉంటుంది. ఇక వాడు బ్రతకడానికి కష్టపడుతున్నాడు మావయ్య.. ఆ పాపం నాదే కదా అని తన మావయ్య కు చెప్పుకుంటుంది.
ఇక తరువాయి భాగంలో తులసి (Tulasi) కుటుంబం ఒక షాపింగ్ మాల్ కి వెళ్తారు. అక్కడకు లాస్య (Lasya) కూడా తన ఫ్యామిలీతో వస్తుంది. ఈ క్రమంలో లక్కీ తులసి దగ్గరకు వెళ్లగా .. తులసి లక్కీకి ముద్దులు పెడుతోంది. అది గమనించిన లాస్య.. నీకు అడ్డమయిన వాళ్ల దగ్గరికి వెళ్లొద్దని ఎన్ని సార్లు చెప్పాను అని లక్కీ పై విరుచుకు పడుతుంది.