- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: గాయిత్రి ప్లాన్.. తులసి కోసం భర్తను కూడా లెక్కచేయని అంకిత.. అసలేం జరిగిందంటే?
Intinti Gruhalakshmi: గాయిత్రి ప్లాన్.. తులసి కోసం భర్తను కూడా లెక్కచేయని అంకిత.. అసలేం జరిగిందంటే?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకాదరణ భారీస్థాయిలో పొందింది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

అంకిత (Ankitha) వాళ్ళ మమ్మి అభి (Abhi) దగ్గరకు వచ్చి ఫ్లాట్ గురించి చెప్పి మీరు హాయిగా చిలకాగోరింకల్లా ఆ ప్లాట్ లో ఉండండి అని చెబుతుంది. అంతేకాకుండా మీరు మా దగ్గర ఉండనఅక్కర్లేదు. మీ అమ్మ దగ్గర ఉండనక్కర్లేదు అని చెబుతోంది. హాయిగా దర్జాగా కాలు మీద కాలేసుకుని బ్రతకండి అని చెబుతుంది.
అదే క్రమంలో అంకిత (Ankitha) వాళ్ళ మమ్మీ బంధాలు బంధుత్వాలు ప్రేమను ఇవ్వగలవు ఏమో కానీ.. మంచి మంచి హోదా ఇవ్వలేమని చెబుతుంది. దాంతో అభి (Abhi) కొంత టైం కావాలని అంటాడు. ఎంత టైం అయినా తీసుకో కానీ మీ జీవితం బాగు పడేలా చేస్కో అని అంటుంది.
ఇక అంకిత (Ankitha) నాకు తెలవకుండా నువ్వు మా అమ్మను కలవాల్సిన అవసరం ఏమి వచ్చింది అని విరుచుకు పడుతుంది. ఇక అభి (Abhi) వాళ్ళ అత్తగారిని వెనకేసుకు వస్తూ అంకితను కన్విన్స్ చేయడానికి చూస్తాడు. ఇక అంకితం ఎట్టి పరిస్థితిలో పరిస్థితుల్లో ఆంటీ ని ఇబ్బంది పెట్టను ఆంటీ ను హర్ట్ చేయను అని చెప్పి ఇదేనా ఫైనల్ డెసిషన్ అని అంటుంది.
మరోవైపు ప్రేమ్ (Prem), శృతి లు గతంలో వాళ్ళ లవ్ మేటర్ గురించి గుర్తు తెచ్చుకొని ఎంతో ఆనంద పడతారు. ఈ క్రమంలో శృతి (Shruthi) ప్రేమ్ వడిలో పడుకుంటుంది. ఇక ఈ క్రమంలో అభి శృతి నుదుట ముద్దు పెడతాడు.
మరోవైపు తులసి (Tulasi) రాత్రిపూట ఒకచోట కూర్చుని దీనంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా అక్కడకు దివ్య (Divya) వచ్చి అన్నయ్య గుర్తుకు వచ్చాడా అమ్మా అని అడుగుతుంది. మర్చిపోతే కదా గుర్తు రావడానికి అని తులసి అంటుంది. ఈ క్రమంలో తన కొడుకు పై తనకున్న బాధ్యతను దివ్య కు అర్థమయ్యేలా చూపించండి.
ఇక తరువాయి భాగం లో నందు దివ్య (Divya) దగ్గరికి వచ్చి ప్రిన్సిపల్ పేరెంట్స్ మీటింగ్ తీసుకుని రమ్మంటున్నారు అని అంటాడు. ఇక తులసి (Tulasi) ఆ శ్రమ మీకు అవసరం లేదు. దివ్య నా కూతురు అని అంటుంది. మరి రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.