- Home
- Entertainment
- పాపం తప్పు చేసి బలైపోయిన సుధీర్..కెరీర్ కి కోలుకోలేని దెబ్బ.. రాంగ్ టైం, రాంగ్ స్టోరీ
పాపం తప్పు చేసి బలైపోయిన సుధీర్..కెరీర్ కి కోలుకోలేని దెబ్బ.. రాంగ్ టైం, రాంగ్ స్టోరీ
సుధీర్ ఈసారి పక్కా ప్లాన్ తో వస్తున్నాడని అంతా భావించారు. అరుణ్ విక్కీరాల దర్శకత్వంలో తెరకెక్కిన కాలింగ్ సహస్ర డిసెంబర్ 1న థియేటర్స్ లోకి వచ్చింది.

బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం హీరో గా తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో సుధీర్.. సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు చిత్రాల్లో నటించాడు. సుధీర్ నటించిన లేటెస్ట్ మూవీ కాలింగ్ సహస్ర. గతంలో కంటే ఈ చిత్రానికి కాస్త ఎక్కువ హంగామానే ప్రమోషన్స్ లో కనిపించింది.
సుధీర్ ఈసారి పక్కా ప్లాన్ తో వస్తున్నాడని అంతా భావించారు. అరుణ్ విక్కీరాల దర్శకత్వంలో తెరకెక్కిన కాలింగ్ సహస్ర డిసెంబర్ 1న థియేటర్స్ లోకి వచ్చింది. మరోవైపు ఆకాశాన్ని తాకే అంచనాలతో సందీప్ రెడ్డి, రణబీర్ ల యానిమల్ చిత్రం రిలీజ్ అవుతున్నప్పటికీ సుధీర్ రిస్క్ చేసి తన కాలింగ్ సహస్రని రిలీజ్ చేశాడు.
రణబీర్ నార్మల్ గా బాలీవుడ్ హీరోల వస్తే పర్వాలేదు. సుధీర్ కి అంత సమస్య అయ్యేది కాదు. కానీ సందీప్ రెడ్డి దర్శకుడు కావడం.. ట్రైలర్ అదిరిపోవడంతో అంచనాలు పెరిగిపోయాయి. టాలీవుడ్ స్టార్ హీరోలని మించేలా అడ్వాన్స్ బుకింగ్స్ మోత మోగాయి. ఈ రేంజ్ రచ్చ ఉన్నప్పుడు సుధీర్ హీరోగా నటించే చిత్రానికి తప్పకుండా ముప్పు ఉంటుంది.
ఊహించినట్లుగానే సుధీర్ కాలింగ్ సహస్ర చిత్రాన్ని యానిమల్ ముంచేసింది. యానిమల్ తో పాటు కాలింగ్ సహస్ర రిలీజ్ చేయడం పెద్ద బ్లండర్ అయితే.. సుధీర్ స్వయంకృతాపరాధం కూడా ఉంది. కాలింగ్ సహస్రలో సుధీర్ ప్రధాన బలం అయిన కామెడీ ఏమాత్రం లేదు. సుధీర్ తన బలాన్ని పక్కన పెట్టి ఒక థ్రిల్లర్ కథతో వచ్చాడు.
సినిమా కూడా ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేదని ఆల్రెడీ రివ్యూలు, టాక్ వచ్చేసాయి. గతంలో గాలోడు, సాఫ్ట్ వేర్ సుధీర్ చిత్రాలు గొప్పగా ఆడకపోయినప్పటికీ సుధీర్ కామెడీ టైమింగ్ కొంతవరకు ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించాయి. దీనితో నిర్మాతలు బయట పడ్డారు. కానీ ఇప్పుడు కాలింగ్ సహస్ర నష్టాలతో నిర్మాతలకు కోలుకోలేని దెబ్బ అని అంటున్నారు. సుధీర్ కెరీర్ కి కూడా ఇది ఎఫెక్టే.
ఏమాత్రం లాజిక్ లేని సస్పెన్స్, యాక్షన్ అంశాలు వరుసగా ఈ చిత్రంలో వస్తూనే ఉంటాయి. ఎక్కడా ఎంటర్టైన్మెంట్ లేకపోవడంతో ప్రేక్షకుల సహనానికి ఈ చిత్రం పరీక్ష అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. తన బలాన్ని పక్కన పెట్టి సుధీర్ సీరియస్ కథని ఎంచుకోవడం తప్పు అనే విమర్శలు ఎదురవుతున్నాయి.
ట్రైలర్ చూసినప్పుడే సుధీర్ ఏంటి ఇలాంటి చిత్రం చేస్తున్నాడు అని అంతా పెదవి విరిచారు. రాంగ్ టైం.. రాంగ్ స్టోరీ.. ఇకపై సుధీర్ ఆచి తూచి అడుగులు వేయాల్సిందే. కాలింగ్ సహస్రపై యానిమల్ ఎఫెక్ట్ ని పిచ్చుకపై బ్రహ్మాస్త్రం పడినట్లుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.