అనీల్ రావిపూడి బాగా హర్టైనట్లున్నాడు, ఘాటుగా రిప్లై
వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించినప్పటికీ, కొంతమంది ప్రేక్షకులు దీనిని క్రింజ్ కామెడీగా భావిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విమర్శలపై స్పందిస్తూ, తాను ప్రేక్షకులను నవ్వించే సినిమాలే తీస్తానని చెప్పారు.

venkatesh, anil ravipudi,Sankranthiki Vasthunnam, chiranjeevi
వెంకటేశ్ (Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.106కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు చిత్ర టీమ్ ప్రకటించింది.
అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, వెంకీ టైమింగ్, ఫ్యామిలీ సినిమా అనే ముద్ర, గోదారి గట్టుమీద పాట.. ఈ సినిమాని సూపర్ హిట్ వైపుగా తీసుకెళ్తున్నాయి. అయితే ఇంత పెద్ద హిట్ అయినా చాలా మంది ఈ సినిమాని క్రింజ్ కామెడీగా జమకట్టి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ విషయం అనీల్ రావిపూడి దాకా కూడా వెళ్లింది. ఆయన కాస్తంత ఎమోషనల్ గానే స్పందించారు.
#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju
‘సంక్రాంతికి వస్తున్నాం’చిత్రం ఏదో సీరియస్ టోన్ తో సాగే కథో లేక న్యూ ఏజ్ స్టోరీనో కాదు అన్న విషయం టీం రిలీజ్ కు ముందే ట్రైలర్స్ తో ఆడియన్స్ కి చెప్పేశారు. దాంతో కథ పరంగా మరీ అద్బుతాలు ఎవ్వరూ ఊహించలేరు. సినిమాలో కూడా స్టోరీ పాయింట్ పెద్దగా ఏమి లేదు. కానీ అనిల్ రావిపూడి మార్క్ కామెడీ సీన్స్ తో స్టార్ట్ టు ఫినిష్ చాలా చోట్ల కామెడీ ఎక్స్ లెంట్ గా వర్కౌట్ అవ్వడంతో కలిసి వచ్చింది.
#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju
ఎక్కడా పెద్దగా బోర్ ఏమి ఫీల్ అవ్వకుండా సినిమా మంచి టైం పాస్ ఎంటర్ టైనర్ గా లాగటం చాలా మందికి నచ్చుతోంది. అయితే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఇది కొంచం క్రింజ్ కామెడీలా అనిపించినా కూడా మిడిల్ ఏజ్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా బాగా కనెక్ట్ అవుతోంది. ఎప్పటి లానే విక్టరీ వెంకటేష్ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా…ఎఫ్2-ఎఫ్3 లో లౌడ్ క్యారెక్టర్ కాకుండా ఈ సారి కొంచం సటిల్డ్ కామెడీతో కుమ్మేశాడు .సినిమాలో వెంకీ కొడుకు రోల్ చేసిన పిల్లాడు ఫస్టాఫ్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేశాడు.
#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju
సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ లో పరోక్షంగా ఈ క్రింజ్ కామెంట్స్ పై అనీల్ రావిపూడి కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు. ‘నేను స్క్రీన్ ప్లే రాయుడం నేర్చుకోలేదు. ఫిల్మ్ మేకింగ్ చదవలేదు. కొందరు రివ్యూ రైటర్స్ రాసే పదాలు కూడా నాకు తెలీవు. నాకు తెలిసిందంత ప్రేక్షకుడు విజల్ కొట్టే సినిమా. నేను అలాంటి సినిమాలు చూస్తూనే పెరిగాను. ఇకపై కూడా ఇలాంటి సినిమాలే తీస్తాను’ అని చెప్పారు అనిల్.
#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju
నిజానికి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం క్రింజ్ కామెడీ కాదు. అలాగని థియేటర్ నుంచి బయటకు వచ్చి గుర్తు చేసుకొని మరీ నవ్వుకొనే సీన్లయితే ఎక్కువ లేవు. టైమ్ పాస్ సినిమా. అయితే ఆ మాత్రం సినిమాలు కూడా బయిట లేవు. ఈ సంక్రాంతి సినిమాల్లో ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న సినిమా ఇది. కాబట్టి..పండగ సీజన్‌ని బాగా క్యాష్ చేసుకోగలుగుతుంది. ఈ సినిమాకు లాంగ్ రన్ ఏ మేరకు ఉంటుంది అనేది చూడాల్సి ఉంది.