- Home
- Entertainment
- Guppedantha Manasu: తండ్రి నిర్ణయానికి షాకైన శైలేంద్ర.. రిషి పై మనసు పారేసుకున్న ఏంజెల్!
Guppedantha Manasu: తండ్రి నిర్ణయానికి షాకైన శైలేంద్ర.. రిషి పై మనసు పారేసుకున్న ఏంజెల్!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో మంచి టీఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుకు నిజ స్వరూపం తెలుసుకోలేని ఒక తండ్రి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఏంజెల్ తో పెళ్లి గురించి మాట్లాడమని వసుధారతో చెప్తాడు రిషి. నేను ఈ మధ్యనే పరిచయమయ్యాను, మీరు ఎప్పటినుంచో ఫ్రెండ్స్ కదా మీరే మాట్లాడండి అంటుంది వసుధార. నేను ఈ టాపిక్ గురించి మాట్లాడలేను అంటాడు రిషి. అదే మిషన్ ఎడ్యుకేషన్ గురించో, పవర్ ఆఫ్ స్టడీస్ గురించి మాట్లాడమంటే నిమిషాల్లో మాట్లాడేస్తారు అంటూ తీసి పారేసినట్టు మాట్లాడుతుంది వసుధార.
అలా మాట్లాడకండి మేడం ఒక మనిషిలో కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. అయినా అదంతా ఎందుకు మీరు మాట్లాడతారా, మాట్లాడరా చెప్పండి అంటాడు రిషి. సారీ నాకు ఇంట్రెస్ట్ లేదు నేను మాట్లాడను అంటుంది వసుధార. ఇదే ఫైనల్ డెసిషనా అంటాడు రిషి. అవును అంటుంది వసుధార. కారు పక్కకు తీసి ఆపండి నేను దిగిపోతాను అంటుంది.
ఎందుకు దిగిపోవడం అని అడుగుతాడు రిషి. మీరు కోపంతో ఎలాగో దిగిపోమంటారు కదా అందుకే ముందే నేను దిగిపోతాను అంటుంది వసుధార. నేను మధ్యలో వదిలేసే వాడిని కాదు పదండి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాడు రిషి. ఆ తర్వాత వసుధార వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూసుకుంటూ ఎమోషన్ లో ఆ ఫోటోని రిషికి పంపించేస్తుంది.
కానీ రిషి చూసే లోపే మళ్ళీ డిలీట్ చేసేస్తుంది. ఏదో ఎమోషన్ లో పంపించేసాను కానీ రిషి సార్ చూస్తే కోప్పడతారు అని మనసులో అనుకుంటుంది. వసుధార ఏం మెసేజ్ పెట్టి డిలీట్ చేసింది. ఏంజెల్ ని అడగమందాము అని ఏంజెల్ దగ్గరికి బయలుదేరుతాడు రిషి. ఈ లోపు ఏంజెల్ కి ఫోన్ చేసి పెళ్లి గురించి ఏం ఆలోచించావు అని అడుగుతుంది వసుధార. ఆలోచించడానికి ఏముంది అబ్బాయిలలో కొన్ని లక్షణాలు బాగుంటే మరికొన్ని లక్షణాలు బాగోవు అన్ని బాగుంటే వాళ్లకి అహంకారం ఎక్కువ.
నువ్వు చెప్పిన క్వాలిటీస్ ఉన్నవాళ్లు నాకు తెలిసి లోకంలో ఉండరేమో అంటుంది ఏంజెల్. ఎందుకు ఉండరు మన పక్కనే ఉంటారు కానీ మనమే గమనించం అంటుంది వసుధార. అప్పుడే తన దగ్గరికి వస్తున్న రిషి ని చూసి మై మరిచిపోతుంది ఏంజెల్. మరోవైపు మీటింగ్లో కాలేజ్ గురించి వచ్చిన న్యూస్ చూసి కోపంతో రగిలిపోతాడు ఫణీంద్ర. ఇది ఎవరో మన గురించి బాగా తెలిసిన వాళ్ళే చేశారు వాళ్ల మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటాడు. ఒకసారి గా షాక్ అవుతాడు శైలేంద్ర.
వాడు ఈరోజు కాకపోతే రేపైనా దొరుకుతాడు అలాంటి వాళ్ల కోసం మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవటం. మన కాలేజీ సీట్లు ఫిల్ చేయటం మీద మన దృష్టి పెట్టడం బావగారు అంటుంది జగతి. ఇంతలోనే పాండ్యన్ తో పాటు తన ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తారు. వాళ్ల స్కీమ్ గురించి రిషి చెప్పింది చెప్పినట్లుగా జగతి తో చెప్తాడు పాండ్యన్. మా సీట్లు ఎలా భర్తీ చేసుకోవాలా అని ఆలోచనలో ఉన్నాము. ఆ దేవుడే మిమ్మల్ని పంపించినట్లుగా ఉన్నాడు అంటుంది జగతి.
సరే మేడం మీరు ఎంత మందికి అడ్మిషన్ ఇవ్వగలరో చెప్తే అంతమంది స్టూడెంట్స్ ని ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి అక్కడినుంచి బయలుదేరుతారు పాండ్యన్ వాళ్లు. వాళ్లని పంపించి వస్తాం బావగారు అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఈ స్కీం ఎవరు పెట్టారు, ఇంత గొప్ప ఆలోచన ఎవరికీ వచ్చింది అని అడుగుతుంది జగతి. రిషి తన పేరు చెప్పొద్దన్న విషయం గుర్తొచ్చి పాండ్యన్ రిషి పేరు చెప్పడు. మీరు చెప్పకపోయినా మేము అర్థం చేసుకోగలం రిషికి థాంక్స్ చెప్పండి అని చెప్పడంతో పాండ్యన్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
మరోవైపు పెళ్లి గురించి ఆలోచించవా అని మనవరాల్ని అడుగుతాడు విశ్వనాథం. నాకు కాబోయే భర్తకి ఎలాంటి లక్షణాలు ఉండాలనుకుంటున్నావో చెప్పు అంటుంది ఏంజెల్. తనకి కావాల్సిన లక్షణాలన్నీ చెప్తాడు విశ్వనాథం. అవన్నీ రిషిలో ఉన్నాయని గ్రహిస్తుంది ఏంజెల్. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.