- Home
- Entertainment
- పారితోషికాలు పెంచిన హాట్ యాంకర్లు.. శ్రీముఖి, అనసూయ, రష్మి, సుమ, ప్రదీప్ ఎంత తీసుకుంటున్నారంటే?
పారితోషికాలు పెంచిన హాట్ యాంకర్లు.. శ్రీముఖి, అనసూయ, రష్మి, సుమ, ప్రదీప్ ఎంత తీసుకుంటున్నారంటే?
బుల్లితెర యాంకర్లకి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. టీవీ షోస్‌కి ఆదరణ పెరిగుతుంది. యాంకర్లకి డిమాండ్ కూడా పెరుగుతుంది. దీంతో డిమాండ్ మేరకు వాళ్లు పారితోషికాలు పెంచుతున్నారు. మరి పెంచిన పారితోషికం ఎంతో ఓ లుక్కేద్దాం.

యాంకర్లలో టాప్ లో ఉంటారు సుమ కనకాల. క్రేజ్‌కి క్రేజ్, టాలెంట్‌కి టాలెంట్ ఆమె సొంతం. అయితే గతంతో పోల్చితే ఇప్పుడు ఆమె షోస్ తగ్గాయి. కానీ క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సుమారు నాలుగు లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందని సమాచారం. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. వాటికి మూడున్నర లక్షలు పారితోషికం అందుకుంటుందని సమాచారం.
ఆ తర్వాత శ్రీముఖి నిలిచారు. ఏడాదికి ముందు శ్రీముఖి వేరు, ఇప్పుడు ఆమె రేంజ్ వేరు. ఇంకా చెప్పాలంటే షోస్‌ల విషయంలో సుమనే మించిపోతుంది. అత్యధిక షోస్ చేస్తున్న యాంకర్ గా శ్రీముఖి నిలవడం విశేషం. ప్రస్తుతం ఆమె నాలుగైదు షోలకు యాంకర్‌గా చేస్తుంది. స్పెషల్ ప్రోగ్రామ్‌లకు తనే యాంకర్‌గా చేస్తుండటం విశేషం. హాట్ అందాలతో కనువిందు చేసే ఈ భామ ఒక్కో ఎపిసోడ్‌కి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్.
అనసూయ క్రేజ్ తగ్గిపోయింది. ఆమె `జబర్దస్త్`ని వీడటంతో ఈ హాట్ యాంకర్ క్రేజ్ తగ్గిపోతూ వస్తోంది. కానీ డిమాండ్ మాత్రం గట్టిగానే ఉంది. ప్రస్తుతం అనసూయ ఒక్కో షోకి రూ.2 నుంచి రెండున్నర లక్షలు తీసుకుంటుందని సమాచారం.
మరో హాట్ యాంకర్ రష్మి సైతం గట్టిగానే సంపాదిస్తుంది. ఆమె మూడు షోస్ చేస్తున్న విసయం తెలిసిందే. ఒక్కో షోకి(ఎపిసోడ్)కి రెండు లక్షల వరకు తీసుకుంటుందని సమాచారం.
మేల్ యాంకర్స్ లో ప్రదీప్ మాచిరాజు టాప్‌లో ఉన్నారు. ఆయన ఒక్కో షోకి రెండు లక్షల వరకు తీసుకుంటున్నాడట. మేల్ యాంకర్‌లో బెస్ట్ ఆప్షన్‌గా ప్రదీప్ నిలుస్తున్న విషయం తెలిసిందే. స్పెషల్ ఎపిసోడ్లకి కూడా తనే ఫస్ట్ ఛాయిస్.
ప్రదీప్ తర్వాత రవి యాంకర్‌గా మంచి పేరుతెచ్చుకున్నారు. బిగ్ బాస్ గత సీజన్‌లో సందడి చేసిన ఆయన మళ్లీ షోస్‌తో బిజీ అవుతున్నాడు. ఇప్పుడు ఆయన ఒక్కో షోకి లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారట.
మరోవైపు శ్యామల అటు టీవీ షోస్, సినిమా ఫంక్షన్లని బ్యాలెన్స్ చేస్తుంటుంది. ఆమె కూడా ఒక్క సినిమాకి, షోలకు యాభై వేల నుంచి లక్ష వరకు తీసుకుంటుందని సమాచారం. వీరితోపాటు వర్షిణి, విష్ణు ప్రియా వంటి వారు షోస్ చేసేవారు. ఇప్పుడు వారికి పెద్దగా షోస్ లేవు.
సినిమా ఫంక్షన్లకి, చిన్న చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ షోస్‌తో రాణిస్తున్న మంజుష. సినిమా ప్రెస్ మీట్లకు మంజుష పేరు ముందు వినిపిస్తుంటుంది. ఆమె కూడా బాగానే తీసుకుంటుందట. ప్రెస్‌మీట్ స్థాయిని బట్టి యాభై వేల వరకు పారితోషికం తీసుకుంటుందట. గీతా భగత్ కూడా సేమ్ యాభై వేల వరకు అందుకుంటుందని సమాచారం.