- Home
- Entertainment
- తలలో మల్లెపూలు పెట్టి రొమాంటిక్ గా సిద్ధమైన యాంకర్ వర్షిణి... అవి అంటే ఇష్టం అంటూ కొంటె కామెంట్!
తలలో మల్లెపూలు పెట్టి రొమాంటిక్ గా సిద్ధమైన యాంకర్ వర్షిణి... అవి అంటే ఇష్టం అంటూ కొంటె కామెంట్!
యాంకర్ వర్షిణి సుందరరాజన్ కి మల్లెపూలంటే మహా ఇష్టం. మల్లెమాల తలలో పెట్టుకుని ఓ రొమాంటిక్ వీడియో చేశారు. వర్షిణి వీడియో వైరల్ అవుతుంది.

Varshini Sounderajan
హాట్ బాంబు వర్షిణికి రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. మంచి ఒడ్డు పొడుగు ఉండి కూడా గ్లామర్ ఫీల్డ్ లో సక్సెస్ కాలేకపోతున్నారు. అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తున్నారు. అటు నటిగా ఇటు యాంకర్ గా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు.
Varshini Sounderajan
ఇటీవల శాకుంతలం మూవీలో వర్షిణి తళుక్కున మెరిశారు. చాలా గ్యాప్ తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ మీద కనిపించారు. సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం నిరాశపరిచింది. దీంతో వర్షిణి ఆశలు గల్లంతయ్యాయి. మూవీ హిట్ అయితే వర్షిణి ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యేవారు.
Varshini Sounderajan
కాగా ఐపీఎల్ మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లిన వర్షిణి క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ తో ఫోటోలు దిగారు. ఇవి వైరల్ అయ్యాయి. వర్షిణి-సూర్య కుమార్ యాదవ్ ఫోటోలపై నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ చేశారు.
Varshini Sounderajan
ఇక వర్ష కెరీర్ పరిశీలిస్తే... డాన్స్ రియాలిటీ షో ఢీ సీజన్ 12లో వర్షిణి యాంకర్ గా చేశారు. ఆమెకు తదుపరి సీజన్స్ లో ఛాన్స్ దక్కలేదు.అనసూయ యాంకరింగ్ పూర్తిగా వదిలేశారు. సుమ జోరు తగ్గింది. వర్షిణి యాంకర్ గా ఎదిగేందుకు ఇదే సమయం. రష్మీ ఉన్నప్పటికీ ఆమె ఈటీవి వదిలిరారు. కాబట్టి వర్షిణికి పెద్దగా పోటీ లేదు. కొంచెం టాలెంట్ నిరూపించుకుంటే స్టార్ యాంకర్ కావచ్చు.
Varshini Sounderajan
ఇక మోడల్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి చందమామ కథలు చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీలో ఆమె కీలక రోల్ చేశారు. అనంతరం లవర్స్ ,బెస్ట్ యాక్టర్స్ , శ్రీరామ రక్ష అనే చిన్నపాటి చిత్రాల్లో నటించారు.
అలాగే పెళ్లి గోల వెబ్ సిరీస్లో నటించారు.హీరోయిన్ కావాలన్న ఆమె ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఎదగడం అంత సులభం కాదు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు లోకల్ భామలకు ఆఫర్స్ ఇవ్వరు.ఆ విధంగా తెలుగు భామలు మరుగున పడిపోతున్నారు.