- Home
- Entertainment
- చేతిపై అతని పేరును పచ్చబొట్టు వేయించుకున్న యాంకర్ సుమ.. సీక్రెట్ రివీల్ చేసిన జయమ్మ..
చేతిపై అతని పేరును పచ్చబొట్టు వేయించుకున్న యాంకర్ సుమ.. సీక్రెట్ రివీల్ చేసిన జయమ్మ..
పాపులర్ యాంకర్ సుమ ఇటీవల తన జీవితంలోని ఒక్కో సీక్రెట్ ను రివీల్ చేస్తూ వస్తున్నారు. తాజాగా తన చేతిపై ఉన్న పచ్చబొట్టు వెనక దాగిన రహస్యాన్ని రివీల్ చేశారు. తన చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివరించారు.

తెలుగు సీనియర్ యాంకర్ గా సుమ కనకాల (Suma Kanakala) చెరగని ముద్ర వేసుకుంది. తన వాక్ చాతుర్యంతో టెలివిజన్ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో సుమ స్టైలే వేరు. తన యాంకరింగ్ స్కిల్స్ తో చాలా షోలను సక్సెస్ ఫుల్ గా రన్ చేసింది. నేటికీ తనకు ఎవరూ పోటీ రాలేరని నిరూపించుకుంటోంది.
యాంకర్ గా తన సత్తా చాటిన సుమ.. తాజాగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’ (Jayamma panchayathi). ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసకొని రిలీజ్ కు సిద్ధమైంది.
అయితే తన చిత్రాన్ని ప్రమోట్ చేసుకునేందుకు యాంకర్ సుమ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కువ రీచ్ సంపాదించేందుకు నిర్విరామంగా ఇంటర్వ్యూలు, ప్రమోషన్ కార్యక్రమాలో పాల్గొంటోంది.
అయితే తన చేతి ‘వెంకన్న’ అనే పచ్చబొట్టుపై తాజా ఓ ఇంటర్వ్యూలో బదులిచ్చింది యాంకర్. ఆ పచ్చబొట్టు గురించి తెలియాలంటే ‘జయమ్మ పంచాయతీ’ సినిమా చూడాల్సిందేనని తెలిపింది. సెకండ్ ఆఫ్ లో దీని వెనుక ఉన్న సీక్రెట్ తెలుస్తుందని చెప్పింది.
ఈ చిత్రం నుంచి గతంలో టీజర్ ను నేచురల్ స్టార్ నానితో టీజర్ రిలీజ్ చేయించారు. ఇక రేపు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) చేతుల మీదుగా విడుదల చేయనున్నారని మేకర్స్ అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. జయమ్మ పంచాయతీ మే 6న రిలీజ్ కానుంది.
విజయ్ కుమార్ కలివరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుమ కనకాలతోపాటు చిత్రంలో పలువురు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం M.M. కీరవాణి, సినిమాటోగ్రఫీని అనుష్క కుమార్ అందించగా, ఎడిటర్ రవితేజ గిరిజాల. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.