సుమ కూడా తగ్గడం లేదండోయ్... ఆమె లేటెస్ట్ గ్లామరస్ ఫోటో షూట్ చూశారా!
anchor suma loking amazing in latest photo shoot ksr యాంకర్ సుమ సైతం ట్రెండ్ ఫాలో అవుతుంది. కుర్ర యాంకర్స్ మాదిరి ఫోటో షూట్స్ చేసింది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

Suma Kanakala
యాంకర్ సుమ పరిచయం అక్కర్లేని పేరు. ఈ లెజెండరీ యాంకర్ సైతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. గ్లామరస్ ఫోటో షూట్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్నారు. తాజాగా నల్ల చీరలో చూపులు తిప్పుకోకుండా కట్టిపడేసింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Suma Kanakala
90లలో సుమ నటిగా కెరీర్ మొదలుపెట్టారు. దాసరి దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. మరో రెండు మూడు మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. బ్రేక్ రాలేదు. దీంతో యాంకర్ అవతారం ఎత్తారు. తిరుగులేని ఆధిపత్యం సాధించారు.
Suma Kanakala
రెండు దశాబ్దాలుగా యాంకర్ సుమ స్థానం పదిలంగా ఉంది. సుమ షోలో ఉన్నారంటే వినోదం పరుగులు పెడుతుంది. ఆమె టైమింగ్ పంచ్లు షోకి హైలెట్ గా నిలుస్థాయి. అందుకే దశాబ్దాలుగా ఆమె ప్రస్థానం సాగుతుంది. నాలుగైదు భాషలు సుమ అనర్గళంగా మాట్లాడుతుంది.
Suma Kanakala
కాగా సుమ గతంలో మాదిరి షోలు చేయడం లేదు. విరివిగా షోలే చేసే సుమ తగ్గించారు. ప్రస్తుతం సుమ అడ్డా టైటిల్ తో సుమ ఒక షో చేస్తున్నారు. అలాగే అమ్మ ఆవకాయ టైటిల్ తో మరో షో స్టార్ట్ చేసినట్లు సమాచారం. అప్పుడప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారు.
Suma Kanakala
సుమకు డిమాండ్ ఉన్నా ఆచితూచి ప్రోగ్రామ్స్ ఎంచుకుంటున్నారు. గత ఏడాది జయమ్మ పంచాయతీ టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేశారు. ఇక కొడుకు రోషన్ ని హీరోగా పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. యాంకర్ గా ఏకఛత్రాధిపత్యం చేసిన సుమకు వందల కోట్ల ఆస్తి ఉన్నట్లు సమాచారం.