MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిన్న ఎన్టీఆర్, మొన్న మెగాస్టార్.. హీరోలను ఇరకాటంలో పడేస్తున్న యాంకర్ సుమ

నిన్న ఎన్టీఆర్, మొన్న మెగాస్టార్.. హీరోలను ఇరకాటంలో పడేస్తున్న యాంకర్ సుమ

స్టార్ యాంకర్ సుమ ఈ మధ్య హీరోలను ఇరుకున పెట్టేస్తోంది. అప్పుడప్పుడు వాళ్ళకు కోపం కూడా తెప్పిస్తోంది. ఒక్క సారి కాదు సుమ చేసిన పనికి సంకటంలో పడ్డ హీరోలు చాలామంది ఉన్నారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 08 2023, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఎంత ఇమేజ్ ఉంటుందో.. యాంకర్ గా సుమకు కూడా అంతే ఇమేజ్ ఉంది. అవ్వడానికి మలయాళీ అమ్మాయి అయినా.. తెలుగులో తెలుగు అమ్మాయిలకంటే అనర్గళంగా మాట్లాడుతూ.. యాంకర్ గా స్పెషల్ ఇమేజ్ ను.. స్టార్ స్టేటస్ ను సాధించింది సుమ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఆమె చేసిన ప్రతీ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ సాధించిందే.. పట్టుకుంటే పట్టుచీర.. స్టార్ మహిళ.. స్వరాభిషేకం.. క్యాష్.. జీన్స్.. ప్రస్తుతం సుమ అడ్డా లాంటి టెలివిజన్ ప్రొగ్రామ్స్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేసింది స్టార్ యాంకర్. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయితే లెక్కే లేదు.  గత 10-15 ఏళ్లలో స్టార్ హీరోలు నట్టించిన ఏ ప్రీరిలీజ్ అయినా సుమ చేయాల్సిందే. 
 

39

సుమ లేకుంటే ప్రీ రిలీజ్ లు వాయిదా వేసిన సంఘటనలు కూడా లేకపోలేదు. అంతే కాదు సినిమా ప్రమోషన్ అంటే సుమ ఇంటర్వ్యూ ఉండాల్సిందే. అంతలా యాంకరింగ్ రంగానికి గౌరవం తీసుకువచ్చింది మలయాళ అమ్మాయి. ఈక్రమంలో ఈమధ్య యాంకరింగ్ విషయంలోనే కొన్ని విమర్షలు ఎదుర్కొంటోంది సుమ. ఆమెకు తొందరపాటు ఎక్కువయ్యిందని.. దాంతో హీరోలను.. ఇతర సెలబ్రిటీలను ఇరకాటంలో పెట్టేస్తుందంటున్నారు. 
 

49
Anchor Suma

Anchor Suma

ఒకప్పుడు ఈవెంట్ అంటే సుమ ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడేది. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్, చిరంజీవి, రాజమౌళి లాంటి స్టార్స్ ను ఇరకాటంలో పడేసి ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందన్న అభిప్రాయం వ్యాక్తం అవుతుంది. దీనికి బెస్ట్ ఎక్జ్సాంపుల్ మొన్ని జరిగిన అమిగోస్ ప్రీ రిలీజ్. కల్యాణ్ రామ్ సినిమాఈవెంట్ కు అన్న కోసం తమ్ముడు తారక్ చీఫ్ గెస్ట్ గార్ వచ్చారు. 

59

అప్పటికే ఆరోగ్యం బాగోలేకు ఇబ్బందిగానే ఉన్న తారక్.. అన్న సినిమా గురించి మాట్లాడుదాం అనుకుంటే సుమ మాత్రం కాస్త ఉత్సాహం ఎక్కువయ్యి.. NTR30 గురించి అప్డేట్ అని చెబుతూ తారక్ కు మైక్ ఇచ్చింది.  దీంతో ఎన్టీఆర్ కూడా అసహనానికి గురయ్యారు. ఈ వీడియో కూడా వైరల్ అయ్యింది అంతా చూశారు. ఇక దాంతో ఏం చేసేది లేక  తన కొత్త సినిమా గురించి ఎన్టీఆర్ కచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. 
 

69

ఈ రకంగా చేయడం సుమను కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. చిన్న చిన్న యాక్టర్స్, డైరెక్టర్స్ అంటే వాళ్ళు సర్ధుకుంటారు. కాని స్టార్ హీరలు స్టార్ డైరెక్టర్ల దగ్గర ఇలా జరుగుతుంటే వాళ్లు అసహనానికి గురవుతున్నారు.  స్టార్ హీరో లేదా స్టార్  డైరెక్టర్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కల్పించుకోవడం వల్ల వాళ్లు కూడా ఇబ్బంది ఫీల్ అవుతుంటారు. 

79

సుమ విషయంలో ఇలా చాలా సార్లు జరిగింది.  గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరు స్పీచ్ లో సుమ కల్పించుకుంది. అప్పుడు కూడా కాస్త విమర్ష ఆమెపై వచ్చింది. అటు వార్తేరు వీరయ్య  సక్సెస్ మీట్ లోనూ రచ్చ రవి ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటే.. సుమ కాస్త డైవర్ట్ అయ్యేలా మాట్లాడింది. ఇలా కొన్ని కొన్ని సందర్భాలలో ఇబ్బందులు తెచ్చుకుంటుంది సుమ. 

89

అంతే కాదు గతంలో  ఓ ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్టార్ డైరెక్టర్  రాజమౌళి పాల్గొంటే.. అక్కడ  జక్కన్నను పట్టుకుని  మహేష్ బాబు మూవీ అప్ డేట్ గురించి అడిగింది. ఇలా సుమ చేస్తున్న పనులకు హీరోలు ఇరకాటంలో పడిపోతున్నారట. అయితే ఇలాంటివి సుమ ఇమేజ్ ను ఏమాత్రం కదిలించలేవు అంటున్నారు ఫ్యాన్స్. 
 

99

అప్పటికీ.. ఇప్పటికీ.. వల్గారిటీ లేనియాంకరింగ్ తో మనసు దోచేసింది సుమ. ఆమె ఇమేజ్ కాని.. గౌరవం కాని తగ్గవంటున్నారు. అంతే కాదు ఇంకా ముందు ముందు కూడా సుమ చేసే ప్రోగ్రామ్స్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తామంటున్నారు. కాకపోతే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Shilpa Shetty Assets: శిల్పాశెట్టి అసలు పేరేంటో తెలుసా? 100 కోట్ల ఇంటితో పాటు ఆమె వాడే 5 కాస్ట్లీ వస్తువులివే!
Recommended image2
Ram Charan Peddi: తండ్రి సినిమాని కూడా బీట్ చేసి భారీ హిట్ దిశగా పెద్ది, అక్కడ మాత్రం డిజాస్టర్ ?
Recommended image3
Obsession: రూ. 7 కోట్ల‌తో తీస్తే రూ. 2,240 కోట్లు వ‌చ్చాయి.. ఇంత‌కీ సినిమాలో అంత‌లా ఏముందిరాబై
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved