రేటు పెంచిన యాంకర్ సౌమ్యరావు..? జబర్థస్త్ గాలి గట్టిగా తగిలినట్టుంది. ఎంత తీసుకుంటుందంటే...?
జబర్ధస్త్ కు బాగా సెట్ అయ్యింది యాంకర్ సౌమ్య. అనసూయ, రష్మి తరువాత ఆ స్టేజ్ కు సౌమ్య బాగా న్యాయం చేసింది. ఇక తాజాగా ఆమె ఈ షోకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ పై న్యూస్ వైరల్ అవుతోంది.
Hyper Aadi-Sowmya Rao
ఎక్కడో మారుమూలన టాలెంట్ ను బయటకు తీసింది జబర్థస్త్ కామెడీ షో. సామాన్యులుగా ఉన్నవారిని సెలబ్రిటీలను చేసింది. ఎంతో మంది కమెడియన్స్ ను టాలీవుడ్ కు అందించింది షో. ఈషోద్వారానే సుడిగాలి సుధీర్, చంద్ర, శ్రీను, ఆది, వారు స్టార్ కమెడియన్స్ గా కొనసాగుతున్నారు. సుధీర్ ఏకంగా హీరోగా మారిపోయాడు. ఇక యాంకర్స్ లో రష్మీ, అనసూయలకు ఇండస్ట్రీలో ఇంత డిమాండ్ రావడానికి కూడా జబర్థస్తే కారణం. ఇక ఇప్పుడు సౌమ్య రావుకి కూడా లైఫ్ ఇచ్చింది షో.
Sowmya Rao
జబర్దస్త్ కు యాంకర్ గా మొదట్లో అనసూయ వ్యవహరించేవారు అయితే ఈమె కొంతకాలం పాటు బ్రేక్ ఇవ్వడంతో రష్మీ ఈ ప్రోగ్రామ్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేసింది. ఇక ఇద్దరు కలిసి జబర్థస్త్ , ఎక్స్ ట్రా జబర్థస్త్ ను సక్సెస్ పుల్ గా నడిపిస్తున్న క్రమంలో.. అనసూయ కు సినిమాల్లో ఆఫర్లు పెరగడం.. ఆమెకు వెండితెరపై డిమాండ్ పెరగడంతో.. ఆమె జబర్థస్త్ ను వీడాల్సి వచ్చింది. దాంతో ఈ ప్లేస్ లో కొత్త యాంకర్ గా సౌమ్య రావు ఎంటర్ అయ్యింది.
సౌమ్య రావు స్టార్టింగ్ లో తెలుగు యాంకరింగ్ చేయడానికి.. తెలుగు పదాలు మాట్లాడటానికి కాస్త తడబడిన ఇప్పుడు మాత్రం ఈమె కూడా అద్భుతమైన యాంకరింగ్ చేస్తూ... దూసుకుపోతోంది. రష్మీ, అనసూయలాగా కంటెస్టెంట్స్ తో క్లోజ్ గా ఉంటూ.. వాళ్ల మీద పంచ్ లు వేస్తూ.. వాళ్ల చేత పంచ్ లు వేయించుకుంటూ..సక్సెస్ ఫుల్ గా ప్రోగ్రామ్ ను రన్ చేస్తోంది.
జబర్దస్త్ కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నారని తెలుస్తుంది.అంతే కాదు యంకర్ గా సెట్ అవ్వడంతో .. రెమ్యూనరేషన్ కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. న్యూస్ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఈమెకు ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా లక్ష రూపాయల నుంచి లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని సమాచారం. గతంలో రష్మీ అనసూయ అందుకున్నటువంటి రెమ్యూనరేషన్ కన్నా ఈమె (Sowmya Rao) అధిక మొత్తంలోనే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. ఇక ఆమె రెండు లక్షల వరకూ డిమాండ్ చేస్తుందని సమాచారం.
Sowmya Rao
ప్రస్తుతం జబర్థస్త్ కే పరిమింత అయ్యింది సౌమ్య రావ్.. త్వరలో ఇక్కడే ఇంకాస్త రాటు దేలి మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలని చూస్తుందట సౌమ్య రావు. అంతే కాదు.. తెలుగు ఇండస్ట్రీలో ఛాన్స్ వస్తే.. సినిమాలు చేయాలని కూడా టార్గెట్ గా పెట్టుకుందట బ్యూటీ. మరి ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.