- Home
- Entertainment
- Sowmya Rao: `జబర్దస్త్` షోకి మళ్లీ రావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్.. యాంకర్ సౌమ్యరావు రియాక్షన్ ఏదో తేడాగా ఉందే?
Sowmya Rao: `జబర్దస్త్` షోకి మళ్లీ రావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్.. యాంకర్ సౌమ్యరావు రియాక్షన్ ఏదో తేడాగా ఉందే?
జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు ఇటీవల అనూహ్యంగా షో నుంచి తప్పుకుంది. మళ్లీ రావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేయడంతో తాజాగా స్పందించింది. ఆమె రిప్లై అనుమానంగా మారింది.

జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు నాజుకు అందంతో అలరించింది. తనదైన పంచ్‌లతో నవ్వించింది. జడ్జ్ ల నుంచి కమెడియన్ల వరకు అందరికి ఝలక్ ఇచ్చింది. ఆ తర్వాత అందరిలో కలిసిపోయింది. జబర్దస్త్ షోకి బాగా అలవాటు పడింది. అభిమానులు సౌమ్య రావు యాంకరింగ్‌ని ఇష్టపడ్డారు. అభిమానులుగా మారారు.
కానీ అనూహ్యంగా జబర్దస్త్ షో నుంచి యాంకర్ సౌమ్య రావు తప్పుకుంది. గత ఐదారు వారాలుగా సౌమ్య రావు స్థానంలో బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంత్ యాంకర్‌గా వ్యవహరిస్తుంది. సడెన్‌గా సౌమ్య రావు తప్పుకోవడంపై అనేక అనుమానాలు, మరో సస్పెన్స్ నెలకొంది. దీనికి కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
అయితే ఫ్యాన్స్ నుంచి సౌమ్య రావుకి మళ్లీ రావాలనే డిమాండ్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆమెకి పోస్ట్ లు పెడుతున్నారు. తనని చాలా మిస్ అవుతున్నామని అంటున్నారు. అంతేకాదు మళ్లీ జబర్దస్త్ షోలోకి తిరిగి రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తారంటూ అడుగుతున్నారు.
తన అభినయం, తన అందంపై పొగుడుతూ, యాంకర్‌గా సౌమ్య రావు వెళ్లిపోయిన తర్వాత నుంచి తాము షోని చూడటం లేదంటూ కామెంట్ పెడుతున్నారు. అయితే వారు చూపించే ప్రేమ పట్ల యాంకర్ సౌమ్య రావు స్పందించారు. వారి ప్రేమకి ఆమె ధన్యవాదాలు తెలిపింది. తాను ఈ విషయంలో చాలా లక్కీ అంటూ పేర్కొంది. ఇన్ స్టాగ్రామ్‌లో ఆమె అభిమానులకు రిప్లై ఇచ్చింది.
ఈ సందర్భంగానే ఆమె మరో విషయాన్ని చెప్పింది. మళ్లీ జబర్దస్త్ షోకి రావాలనే డిమాండ్‌కి రియాక్ట్ అవుతూ `టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా వస్తా` అంటూ ఆమె పోస్ట్ లో పేర్కొంది. దీంతో ఇప్పుడిది ఆసక్తికరంగా మారింది. అయితే కావాలనే సౌమ్య రావుని షో నుంచి తొలగించినట్టు తెలుస్తుంది.
ఇటీవల కూడా దీనిపై ఆమె రియాక్ట్ అయ్యింది. ఎందుకు జబర్దస్త్ ని వీడారని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అడగ్గా, టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతా అంటూ ఆమె పేర్కొంది.
దీంతో అది అనుమానాలకు కారణమయ్యింది. ఇప్పుడు మరోసారి అలాంటి సమాధానమే రావడం మరింత హాట్ టాపిక్ అవుతుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు యాంకర్‌ని తొలగించారనేది తెలియాల్సి ఉంది. అటు మల్లెమాల నిర్వహకులుగానీ, ఇటు సౌమ్య రావుగానీ చెబితే దీనిపై క్లారిటీ వస్తుంది.
ప్రస్తుతం సౌమ్య రావు సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది. ఆమె ఫోటో షూట్లు, రీల్స్ చేస్తుంది. ఫన్నీ వీడియోలతో ఫ్యాన్స్ కి టచ్లోనే ఉంటుంది. అంతేకాదు అడపాదడపా వారికి రిప్లై ఇస్తూ సర్‌ప్రైజ్ చేస్తుంది. కన్నడకి చెందిన ఈ బ్యూటీ మరి మళ్లీ తెలుగు బుల్లితెరపై ఎప్పుడు సందడి చేస్తుందో చూడాలి.