- Home
- Entertainment
- అర్ధరాత్రి ఫోన్ చేసి వేధించేవాడు... యాంకర్ శ్యామల సంచలన కామెంట్స్, ఆయన ఎవరో తెలుసా?
అర్ధరాత్రి ఫోన్ చేసి వేధించేవాడు... యాంకర్ శ్యామల సంచలన కామెంట్స్, ఆయన ఎవరో తెలుసా?
నటి, యాంకర్ శ్యామల పరిశ్రమలో తనకు ఎదురైన వేధింపుల గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. కొందరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె అన్నారు.

చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే దీనిపై మాట్లాడేవారు చాల తక్కువ. బుల్లితెర పరిశ్రమలో కూడా ఇవేమి తక్కువ కాదు. అమ్మాయిలకు దర్శకులు,నిర్మాతలు, సాంకేతిక నిపుణుల నుండి వేధింపులు తప్పవు. ఇదే విషయాన్ని యాంకర్ శ్యామల చెప్పుకొచ్చారు.
శ్యామల సీరియల్ నటిగా పరిశ్రమలో అడుగుపెట్టారు. అలాగే యాంకర్ గా పలు సూపర్ హిట్ షోలు చేసింది. ఆమెకంటూ ఒక ఇమేజ్ ఉంది. ప్రస్తుతం వెండితెర మీద కూడా రాణిస్తుంది. గత ఏడాది విడుదలైన విరూపాక్ష చిత్రంతో శ్యామల కీలక రోల్ చేసింది. విరూపాక్ష సూపర్ హిట్.
అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. కాగా కెరీర్ బిగినింగ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాలు ఆమె చెప్పుకొచ్చింది. శ్యామల మాట్లాడుతూ... సినిమాల్లో రాణించాలని నేను అమ్మతో పాటు హైదరాబాద్ కి వచ్చాను. సీరియల్స్ లో అవకాశాలు రావడంతో నటించాను. ఆ సమయంలో కొన్ని ఇబ్బందులు కలిగాయి.
కొందరు నన్ను విసిగించేవారు. లవ్ ప్రపోజల్స్ పెట్టేవారు. దాంతో విసిగిపోయిన నేను ఒప్పుకున్న మూడు సీరియల్స్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. సీరియల్స్ కి పని చేసే ఓ కెమెరామెన్ బాగా వేధించాడు. అర్ధరాత్రి ఫోన్ చేసేవాడు. ఒకరోజు అమ్మ కాల్ లిఫ్ట్ చేసింది. మీకు మగదిక్కు లేదు. నేను ఏదైనా చేయగలను అంటూ బెదిరించాడు. దాంతో అమ్మ భయపడింది.
నేను మాట్లాడుతుంటే మీ అమ్మాయి పట్టించుకోవడం లేదు. మీరైనా చెప్పండి అని భయపెట్టాడని శ్యామల అన్నారు. శ్యామల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం శ్యామల యాంకర్ గా, నటిగా రాణిస్తుంది.