పెళ్లిపీటలెక్కిన యాంకర్ రష్మీ.. వరుడు ఎవరో మాత్రం చెప్పనంటోంది.. సుధీర్ తోనేనా?
బుల్లితెరబ్యూటీ, అందాల యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) పెళ్లి పీటలెక్కింది. వరుడు పక్కన కూర్చొని ఎంతో మురిసిపోతోంది. అయితే పెళ్లికొడుకును మాత్రం పరిచయం చేయకుండా సస్పెన్స్ లో పెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

స్మాల్ స్క్రీన్ సుందరి, యాంకర్ రష్మీ గౌతమ్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై ఎక్స్ ట్రా జబర్దస్త్ (Jabardasth) కామెడీ షోతో బాగా పాపులర్ అయ్యింది. అంతకు ముందు సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బుల్లితెరను ఏలుతోంది.
రష్మీ గౌతమ్ ఎక్స్ ట్రా జబర్దస్త్ తో పాటు, ఈటీవీలో ప్రసారమయ్యే పలు ఈవెంట్లలోనూ పాల్గొంటూ అందరినీ ఆకట్టుకుంటుంది. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకుంది. అయితే తను యాంకరింగ్ తో పాటు జబర్దస్త్ టీం లీడర్లు చేసే కొన్ని ప్రత్యేకమైన స్కిట్లలోనూ కనిపిస్తుంటుంది.
అయితే, తాజాగా రిలీజ్ అయిన ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో రష్మిగౌతమ్ తన అభిమానులను, టీవీ ప్రేక్షకులకు షాకింగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రొమోలో పెళ్లికూతురుగా ముస్తాబై పీటలపై కూర్చుకుంది. తన వరుడు ఎవరో మాత్రం చూపించకుండా సర్ ప్రైజ్ ఇచ్చింది. పక్కనే కూర్చున్న అతని మొహాన్ని మల్లెపూలతో కనిపించకుండా దాచేసింది.
ఇప్పటికే జబర్దస్త్ స్టేజీపై లవ్ బర్డ్ పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యాంకర్ రష్మీకి గతం నుంచే సుడిగాలి సుధీర్ తో లవ్ ట్రాక్ ఉన్నదనే విషయాన్ని తాజాగా నిజం చేయబోతుందా? లేక తను ఎప్పటిలాగే ఏదైనా స్కిట్ లో పార్టిసిపేట్ చేసిందా? అన్నది పూర్తి ఎపిసోడ్ వస్తేగానీ తెలియడం సాధ్యం కాదు.
మే 27న లేటెస్ట్ ఎపిసోడ్ యూట్యూబ్ లోకి రానుంది. అయితే ఈ ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, జడ్జీగా హీరోయిన్ శ్రద్ధా దాస్ హాజరయ్యారు. ఎప్పటిలాగే ఇంద్రజా కూడా జడ్జీగా వ్యవహరించారు.
ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం లీడర్స్ తమ అద్భుతమైన స్కిట్స్ ను ప్రదర్శించారు. స్కిట్టే కాకుండా బుల్లెట్ బాస్కర్ టీం నుంచి ఫాయిమా తనలోని స్పెషల్ టాలెంట్ ను కూడా బయటపెట్టడం కొత్తదనంగా అనిపించింది. రాబోయే ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుందనడటంలో ఎలాంటి సందేహం లేదు.