బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ రష్మీ...? సీజన్ 7 లో సందడి చేయబోతున్న బుల్లితెర బ్యూటీ..?
బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ రష్మీ.. ఈ మాట చాలా కాలంగా వినిపిస్తున్నదే.. కాని నిజం అవ్వడంలేదు. రష్మీ ఏంటీ.. బిగ్ బాస్ హౌస్ లో ఏంటీ..? అనుకుంటూనే.. ఎప్పుడెప్పుడు ఆమె వస్తుందా అని ఎదురుచూస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు.

బుల్లితెర ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. యాంకర్ గా టీవీ ప్రోగ్రామ్స్ ను ఏలుతున్న రష్మీ గౌతమ్.. బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతుందట. బిగ్ బాస్ సీజన్ 7 లో ఆమె కంటెస్టెంట్ గా పార్టిస్పేట్ చేయబోతున్నట్టు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పుటి నుంచీ ఈ న్యూస్ వినిపిస్తూనే ఉంది. బిగ్ బాస్ హౌస్ ను ఇంకాస్త కలర్ ఫుల్ గా మార్చడానికి రష్మీని తీసుకురాబోతున్నారంటూ.. ప్రతీ సీజన్ కు వైరల్ న్యూస్ వస్తూనే ఉంటుంది. అయితే అసలు అంత బిజీ షెడ్యూల్ ను వదులుకుని రష్మీ ఎందుకు బిగ్ బాస్ హౌస్ కు వస్తుంది అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
అయితే బిగ్ బాస్ షో మునుపటిలా లేదు. తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ట్ అయిన కార్యక్రమం.. నానీ తరువాత నాగార్జున చేతికి వచ్చింది. అయితే రాను రాను ఈ షో చప్పపడిపోతోంది. రేటింగ్స్ పడిపోతున్నాయి.ఇంట్రెస్టింగ్ కంటెంట్ లేకపోవడంతో .. హోస్ గా నాగార్జున ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోతోంది. దాంతో ఏం చేసి నెక్ట్స్ సీజన్ ను పైకి లేపాలా అని మేకర్స్ ఎప్పటికప్పుడు ప్లాన్స్ వేసుకుంటున్నారు.
అటు రష్మీ గౌతమ్ బాగా బిజీ ఆర్టిస్ట్.. యాంకర్ గా రెండు మూడు ప్రోగ్రామ్స్ తో.. భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ.. అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తూ.. చేతి నిండా సంపాదిస్తోంది. ఇప్పుడు ఆమె ఇమేజ్ కు వచ్చిన నష్టమేమీ లేదు. పైగా పోషల్ మీడియాల్ హాట్ హాట్ ఫోటోలతో అదరగొడుతూ.. ఇన్ స్టా నుంచి కూడా ఇన్ కమ్ సాధిస్తోంది. వీటన్నిటితో పాటు సోషల్ సర్వీస్ కూడా చేస్తోంది బ్యూటీ.
ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ లోకి రష్మీ వస్తుందా..? వచ్చినా ఎంత డిమాండ్ చేస్తుంది..? రష్మీని హోల్డ్ చేయాలంటే బిగ్ బాస్ టీమ్ భారీ మొత్తంలో సమర్పించుకోవాలి. ఆమెకు ఉన్న బిజీ షెడ్యూల్ కు బ్రేక్ ఇచ్చి.. హౌస్ లో ఉండాలంటే కష్టం.. ఈలెక్కన రష్మీని బిగ్ బాస్ మేకర్స్ భరించగలరా..?
అటు రేటింగ్స్ రావాలంటే.. ఖర్చు పెట్టక తప్పదనే అభిప్రాయంలో బిగ్ బాస్ టీమ్ ఉన్నట్టు సమాచారం. సీజన్ సక్సెస్ ఫుల్ గా నడవడానికి హైపర్ ఆదీ, సుధీర్ లాంటి వారిని కూడా సంప్రదిస్తున్నారట టీమ్. ఆ లిస్ట్ లోనే రష్మీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సీజన్ అంతా అన్ని రోజులు వారిని ఎంగేజ్ చేయలేకపోయినా.. వైల్డ్ కార్డ్ ద్వారా అయినా.. కొన్ని రోజులు బిగ్ బాస్ ఇంట్లోకి పంపించాలని చూస్తున్నారట టీమ్
మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కాని.. బిగ్ బాస్ సీజన్ 7 లో రష్మీ గౌతమ్.. ఈ మాట వినడానికి మాత్రం చాలా మంది బుల్లితెర అభిమానులకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా రష్మీ వస్తే బాగుండు అని ఎదురుచూసేవారు కూడా ఉన్నారు. చూడాలి మరి ఈ న్యూస్ రూమర్ గానే మిగిలిపోతుందా..? నిజం అవుతుందా అనేది.