- Home
- Entertainment
- వాళ్ళలా నేను సంపాదించలేదు, నన్ను చూసి సిగ్గుతో సచ్చిపోవాలి... యాంకర్ ఝాన్సీ సీరియస్ కామెంట్స్!
వాళ్ళలా నేను సంపాదించలేదు, నన్ను చూసి సిగ్గుతో సచ్చిపోవాలి... యాంకర్ ఝాన్సీ సీరియస్ కామెంట్స్!
మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఝాన్సీ ఒకరు. నటిగా కూడా సక్సెస్ అయిన ఝాన్సీ పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలు వెళ్లగక్కారు.

Anchor Jhansi
కేబుల్ టీవీ వచ్చాక యాంకర్స్ కి డిమాండ్ పెరిగింది. బుల్లితెర అవకాశాలు మెరుగయ్యాయి. ఝాన్సీ, సుమ, ఉదయభాను వంటి యాంకర్స్ సత్తా చాటారు. వీరిని మొదటి తరం స్టార్ యాంకర్స్ అనుకోవచ్చు. ఝాన్సీ టాక్ ఆఫ్ ది టౌన్ షోతో పాపులారిటీ తెచ్చుకున్నారు. సుదీర్ఘ కాలం పరిశ్రమలో కొనసాగుతున్న ఝాన్సీ తాజా ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
చాలా మంది నాకు పొగరు అనుకుంటారు. నిజంగా నాతో పని చేస్తే నేను ఎలాంటి దాన్నో తెలుస్తుంది. నా గురించి తెలిసినవాళ్ళు ఏళ్ల తరబడి నాతో పని చేస్తారు. టాక్ ఆఫ్ ది టౌన్ పదేళ్లు చేశాను. నేను ఒక షో నుండి తప్పుకున్నాను అంటే... వాళ్ళు తప్పించారని అర్థం. నా వ్యక్తిత్వంతో వాళ్ళకు ప్రాబ్లమ్ అని అర్థం అని ఝాన్సీ అన్నారు.
నన్ను చాలా షోల నుండి అర్థాంతరంగా తీసేశారు. రావాల్సిన ఫేమ్ రాకుండా చేశారు. 24 ఎపిసోడ్స్ చేస్తే 25వ షో నుండి తీసేశారు. 99 షోలు నేను చేస్తే 100వ షో నుండి తప్పించారు. అందుకు నేనేమీ బాధపడను. నేను ఏ షో నుండి మధ్యలో తప్పుకోను. కాంట్రాక్టు ముగిశాక మాత్రమే వెళ్ళిపోతాను.
ఒక షోకి సంబంధించిన మేకర్స్ డబ్బులు ఇవ్వడం లేదని ఫైనల్ ఎపిసోడ్స్ చేయనని మిగతా వాళ్ళు పట్టుబట్టారు. పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన మ్యాటర్ అని నేను వాళ్ళను ఒప్పించి షో పూర్తి చేయించాను. వాళ్లందరికీ డబ్బులు ఇచ్చి నాకు ఇవ్వలేదు. తెలివిగా మోసం చేశారు. మూడు నెలల ముందు డేట్ వేసి చెక్ ఇచ్చారు. అది బౌన్స్ అయ్యింది.
ఆరు లక్షలు నాకు చాలా పెద్ద అమౌంట్. మిగతా వాళ్ళలా నేను పెద్దగా సంపాదించలేదు. నన్ను మోసం చేసిన వాళ్లతో నేను మరలా పని చేశాను. అలా చేయకపోతే పరిశ్రమలో ఉండలేము. అలా అని ఆత్మాభిమానం లేదని కాదు. డిస్టెన్స్ మైంటైన్ చేస్తాను. జస్ట్ హాయ్ బై అన్నట్లు ఉంటాను. నాకు డబ్బులు ఇవ్వని వాళ్ళు నా ముందు సిగ్గుతో చచ్చిపోవాలి, అంటూ ఝాన్సీ కీలక కామెంట్స్ చేశారు.
పరిశ్రమలో నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు. మనం సహాయం చేసినవాళ్లు మోసం చేశారు. అప్పుడు నాకు అర్థమైంది. నేను పాములకు పాలు పోసి పెంచానని. వాళ్లతో జాగ్రత్తగా ఉంటాను. నా హక్కుల కోసం పోరాడతాను. ఎక్కడా చులక కాకుండా చూసుకుంటాను. నాతో పని చేయడం ఇష్టం లేదన్న వాళ్ళు నా దగ్గరి వచ్చారు. అదే నా గెలుపు... అని ఝాన్సీ చెప్పుకొచ్చారు.
పరిశ్రమలో రాజకీయాలు, మోసాలు చాలా సహజం అన్నట్లు ఝాన్సీ మాట్లాడారు. ఆమె డబ్బులు విషయంలో మోసపోయినట్లు చెప్పారు. పరిశ్రమలో ఎదగకుండా అడ్డుకున్నారని చెప్పకనే చెప్పారు. ఝాన్సీ జోగినాయుడు అనే యాక్టర్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ళకు విడిపోయారు.