ఇంట్లో అనసూయ ఇలా ఉంటుందా... పర్సనల్ క్యాండిడ్ ఫొటోలతో అభిమానులకు విజువల్ ట్రీట్..!
సెలబ్రిటీల పర్సనల్ లైఫ్, హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ అది సాధ్యం కాదు. స్టార్స్ కెమెరా వెనుక ఎలా ఉంటారో తెలుకోవడం కష్టం. అది వాళ్ళు జనాలకు తెలియనీయరు కూడాను.

Anasuya Bharadwaj
కొందరు మాత్రం తమ వ్యక్తిగత జీవితానికి, జీవన శైలికి సంబంధించిన చాలా విషయాలు ఫ్యాన్స్ తో పంచుకుంటారు. అలా ప్రతి విషయం అభిమానులకు చెప్పడం ఒక సరదా. సోషల్ మీడియా విప్లవంతో ఇది ఒక వ్యసనంగా మారింది. తమ చర్యల గురించి జనాభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. కామెంట్స్ చదివి అది తెలుసుకుంటున్నారు.
Anasuya Bharadwaj
యాంకర్ అనసూయ కూడా సోషల్ మీడియా జీవి అని చెప్పొచ్చు. ఆమె తరచుగా ఫోటో షూట్స్ తో పాటు పర్సనల్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో వెళ్లిన విహారాలకు సంబంధించిన ఫొటోలు, ఆమె తినే ఫుడ్, పాల్గొన్న ఈవెంట్స్ ఇన్ఫర్మేషన్ ఫోటోల రూపంలో షేర్ చేస్తారు.
Anasuya Bharadwaj
మరి అనసూయ ఇంట్లో ఎలా ఉంటారు? ఎలాంటి బట్టలు ధరిస్తారు?... దానికి కూడా ఆమె సమాధానం ఇచ్చారు. తాజాగా అనసూయ కొన్ని ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఖాళీ దొరికితే ఇంట్లో తన దినచర్య ఎలా ఉంటుందో కొంచెం హింట్ ఇచ్చారు.
Anasuya Bharadwaj
అలాగే వృత్తిలో భాగంగా ఈవెంట్స్ లేదా షూటింగ్స్ లో పాల్గొడానికి బయటకు వెళ్లాలంటే ఎలా సిద్ధం అవుతారో చూపించారు. ఆ ఫొటోల్లో అనసూయ అందంగా సిద్ధం కావడానికి అవసరమైన యాక్సెసరీలు సేకరించి దగ్గర పెట్టుకుంటున్నారు.
Anasuya Bharadwaj
ఇంట్లో కూడా అనసూయ పొట్టి బట్టలే ధరిస్తారని తెలుస్తుంది. డెనిమ్ షార్ట్,చెక్స్ షర్ట్ ధరించిన అనసూయ క్యాజువల్ లుక్ లో కేక పెట్టించారు. సదరు ఫొటోల్లో ఆమె ఇంకా మేకప్ కూడా వేసుకోలేదు.
Anasuya Bharadwaj
మేకప్ లేకపోయినా అనసూయ అందానికి కొదవేమీ లేదని చెప్పొచ్చు. ఈ ఫోటోలు చూశాక మేకప్ అనసూయ అందానికి అదనపు ఆకర్షణ మాత్రమే అని అర్థమైంది.
Anasuya Bharadwaj
ఇక అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. నటిగా, యాంకర్ గా రెండు రంగాల్లో ఆమె రాణిస్తున్నారు. వెండితెరపై విరివిగా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో అనసూయ యాంకరింగ్ మీద ఫోకస్ తగ్గించారు.
Anasuya Bharadwaj
ఆమెకు నేమ్ ఫేమ్ తెచ్చిపెట్టిన జబర్దస్త్ షోని అనసూయ వదిలేసిన విషయం తెలిసిందే. అనసూయ నిష్క్రమణతో యాంకర్ రష్మీ ఆ బాధ్యతలు తీసుకున్నారు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోష్ కి ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
Anasuya Bharadwaj
ఇక అనసూయ హీరోయిన్ గా నటించిన దర్జా, వాంటెడ్ పండుగాడ్ చిత్రాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇవి రెండు అనుకున్న స్థాయిలో ఆడలేదు.
Anasuya Bharadwaj
ప్రస్తుతం అనసూయ రంగమార్తాండ, పుష్ప 2 చిత్రాలు చేస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో ఆమె దేవదాసి రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఇక పుష్ప 2 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.