- Home
- Entertainment
- Anasuya Latest Photos : పదహారేళ్ల అమ్మాయిలా జబర్దస్త్ బ్యూటీ అనసూయ.. లెహంగా వోణీలో మైమరిపిస్తోంది.
Anasuya Latest Photos : పదహారేళ్ల అమ్మాయిలా జబర్దస్త్ బ్యూటీ అనసూయ.. లెహంగా వోణీలో మైమరిపిస్తోంది.
జబర్దస్త్ బ్యూటీ యాంకర్ అనసూయ (Anasuya) రోజురోజు తన వయస్సు తగ్గించుకుంటోంది. లెహంగా వోణీలో పదహారేళ్ల అమ్మాయిలా కనిపిస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

బుల్లితెర బ్యూటీగా, గ్లామర్ యాక్ట్రెస్ గా యాంకర్ అనసూయ కేరీర్ లో దూసుకుపోతోంది. పుష్ప (Pushpa) మూవీ తర్వాత తగ్గేదే లే అంటోంది. వరుస సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతూ ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.
అనసూయ విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. యాంకర్ గా అనసూయ బుల్లితెరపై అందాలు ఒలికిస్తూనే వెండితెరపై తనలోని నటనని బయటకు తీస్తోంది. పుష్పలో దాక్షాయణిగా సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది.
క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. అలాగే మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ ఓ చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ లోనూ నటించింది.
అనసూయ అందానికి ఆడియెన్స్ ఎంతలా అట్రాక్ట్ అవుతారో తెలియందీ కాదు. అప్పట్లో ఆమె పేరుపైనే ఓ సాంగ్ కంపోజ్ చేశారు. ‘సూయా..సూయా.. అనసూయా.. అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా’ అంటూ వచ్చిన స్పెషల్ సాంగ్ సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ మూవీకి అట్రాక్షన్ గా నిలిచింది.
ఆ రేంజ్ లో అనసూయ తెలుగు ఆడియెన్స్ ను తనవైపు తిప్పుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో ఈ సుందరి అల్లరి అంతా ఇంతా కాదు. ఒకవైపు ట్రోలర్స్ చేతికి చిక్కెలా ప్రవర్తించడమే కాకుండా.. తన గ్లామర్ తో నెటిజన్లనూ కూడా కట్టిపడేస్తోంది.తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలకు ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు.
ఫొటోల్లో పింక్ దుప్పట్ట, లెహంగాలో, మ్యాచింగ్ బ్లౌజ్ లో అనసూయ పదహారేళ్ల అమ్మాయిలా కనిపిస్తోంది. ఆకట్టుకునే ఫొజులతో కూడిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫొటోలు పోస్ట్ చేస్తూ.. ‘నేను పువ్వులా పెళుసుగా లేను.. నేను బాంబులాగా ఉన్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోషూట్ ఈ రోజు షూట్ చేయనున్న జబర్దస్త్ (Jabardasth) లేటెస్ట్ ఎపిసోడ్ కోసం చేసినట్టు చెప్పింది.