మరీ అంత తక్కువ రేటా?.. అనసూయ ఫ్యాన్స్ ఫైర్..మరీ ఈ రేంజ్‌లోనా
యాంకర్ అనసూయ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. దీంతో ఫైర్ అవుతున్నారు. మరీ అంత తక్కువ రేటా? అంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో గోల గోల చేస్తున్నారు. ఇంతకి అనసూయ ఫ్యాన్స్ ఫైర్ అవ్వడానికి కారణమేంటనేది చూస్తే..
సెక్సీ యాంకర్ అనసూయ `జబర్దస్త్` షోతోపాటు నటిగానూ రాణిస్తుంది. లీడ్ రోల్స్ కూడా చేస్తుంది. గతంలో `కథనం`లో లీడ్ రోల్ చేసిన అనసూయ, ఇప్పుడు `థ్యాంక్యూ బ్రదర్`లో నటించింది. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించగా, విరాజ్ అశ్విన్ మేల్ లీడ్ చేశాడు. ఇందులో అనసూయ ప్రెగ్నెంట్ ఉమెన్‌గా కనిపించడం విశేషం.
ఈ సినిమాని థియేటర్‌లో విడుదల చేయాలని భావించారు. కానీ థియేటర్లు మూత పడటంతో ఓటీటీలో విడుదలకు సిద్ధమయ్యారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన `ఆహా`లో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. మే 7 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. దీంతో అనసూయ అభిమానులు ఆమె సినిమాని ఎట్టకేలకు త్వరలోనే చూడబోతున్నామనే సంతోషంలో ఉన్నారు.
ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమా ఓటీటీ లో విడుదల కోసం కొన్న రేట్ విషయంలో మాత్రం అన్ను బేబీ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మరీ అంత తక్కువ రేట్ కా? షాక్ అవుతున్నారు.
ఈ సినిమాని `ఆహా` జస్ట్ 1.8కోట్లకే ఓటీటీ రిలీజ్ హక్కులు తీసుకుందట. దీంతో మరీ ఇంత తక్కువకి మా అనసూయ సినిమాని తీసుకుంటారా? ఇది ఆమెకి పెద్ద అవమానం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫైర్ అవుతున్నారు.
మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో ప్రెగ్నెంట్ ఉమెన్‌గా అనసూయ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
ప్రస్తుతం అనసూయ సినిమాల జాబితా చూస్తే `పుష్ప`లో సునిల్ సరసన నటిస్తుంది. `ఆచార్య`లో కీలక పాత్ర పోషిస్తుంది. `ఖిలాడీ`, `రంగమార్తాండ`లోనూ ముఖ్యమైన పాత్రల్లోనటిస్తుంది. తమిళంలో ఓ సినిమా, మలయాళంలో ఓ సినిమా చేస్తూ, `జబర్దస్త్` కి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు అనసూయ ప్రతి వారం `జబర్దస్త్` కోసం గ్లామరస్‌గా ముస్తాబై అందాలు ఆరబోస్తుంది. అభిమానులను అలరిస్తుంది. అదే సమయంలో గ్లామర్ షో విషయంలో పలు విమర్శలు ఎదుర్కొంటూ, వాటికి స్ట్రాంగ్ రిప్లైస్ ఇస్తూ విమర్శలకు చెక్ పెడుతుంది.