అనసూయ పెళ్లి ఫోటోలు వైరల్... నవ వధువుగా ఎంత అందంగా ఉందో!
అనసూయ భరద్వాజ్ పెళ్లి రోజు కావడంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అనసూయ పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Anasuya Bharadwaj
అనసూయ చాలా రొమాంటిక్. ఆమె ప్రేమించినవాడిని పట్టుబట్టి చేసుకుంది. అనసూయ-సుశాంక్ లకు పెద్ద ప్రేమ కథే ఉంది. అనసూయ చదువుకునే రోజుల్లో ఎన్ సి సి క్యాడెట్ అట. ఓ క్యాంపులో సుశాంక్ భరద్వాజ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. స్కూల్ డేస్ లో మొదలైన ఆకర్షణ కాలేజ్ డేస్ వరకు కొనసాగింది.
Anasuya Bharadwaj
మరొక క్యాంపులో ఒకరిపై మరొకరు ప్రేమ వ్యక్తపరుచుకున్నారట. పీకల్లోతు ప్రేమలో మునిగిన వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే అనసూయ తండ్రి అందుకు ఒప్పుకోలేదు. ఆయన సుశాంక్ అని అల్లుడిగా అసలు ఒప్పుకోలేదట. ఒక దశలో పెద్దలను ఎదిరించి అనసూయ ఇంటిలో నుండి బయటకు వచ్చేసింది.
Anasuya Bharadwaj
చాలా కాలం హాస్టల్ లో ఉందట. పెద్దల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోకూడదని ఇద్దరూ ఫిక్స్ అయ్యారట. అనసూయ తండ్రిని ఒప్పించేందుకు ఐదేళ్లకు పైగా సమయం పట్టిందట. ఎట్టకేలకు ఆయన ఒప్పుకోవడంతో అనసూయ-సుశాంక్ పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన వెంటనే అనసూయ ఫ్యామిలీ ప్లానింగ్ చేసింది.
అనసూయకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు వయసు 13 ఏళ్ల అట. మా అబ్బాయి టీనేజ్ కి వచ్చేశాడని అనసూయ ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. పెళ్లయ్యాక తన కలలు నెరవేర్చుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యింది. జబర్దస్త్ షో ఆమెకు బ్రేక్ ఇచ్చింది.
ప్రస్తుతం యాంకరింగ్ కి గుడ్ పై చెప్పేసింది. నటిగా సెటిల్ అయ్యింది. అనసూయ ఇప్పుడు బిజీ యాక్ట్రెస్. స్టార్ హీరోల సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తుంది. అలాగే ఆమెకు లీడ్ రోల్స్ కూడా దక్కుతున్నాయి. నేడు అనసూయ వివాహం కావడంతో ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల విడుదలైన రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేశారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అనసూయ పాత్రకు ప్రశంసలు దక్కాయి.అలాగే పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా కనిపించనున్నారు. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది.