- Home
- Entertainment
- క్రేజీ కొరియోగ్రాఫర్ తో అనసూయ రొమాన్స్, మొబైల్ లో రికార్డ్ చేస్తూ.. ఇదెక్కడి పైత్యం, వీడియో వైరల్
క్రేజీ కొరియోగ్రాఫర్ తో అనసూయ రొమాన్స్, మొబైల్ లో రికార్డ్ చేస్తూ.. ఇదెక్కడి పైత్యం, వీడియో వైరల్
కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవాతో అనసూయ రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఇది ప్రభుదేవా, అనసూయ నటిస్తున్న వూల్ఫ్ అనే చిత్రంలోని సాంగ్. దీనిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

నటిగా అనసూయ జోరు
తెలుగు సినిమాల్లో అనసూయ జోరు కాస్త తగ్గింది అనే చెప్పాలి. రంగస్థలం, పుష్ప, క్షణం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి చిత్రాల్లో ఆమె నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఒక దశలో అనసూయ నటిస్తే ఆ సినిమా బంపర్ హిట్ గ్యారెంటీ అనేంతలా ప్రచారం జరిగింది. దీనితో అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసి నటిగా సెటిల్ అయిపోయింది. కానీ ఇటీవల అనసూయ చిన్న సినిమాల్లో నటిస్తోంది కానీ.. బడా చిత్రాల్లో అవకాశాలు తగ్గాయి.
వూల్ఫ్ మూవీలో అనసూయ
ప్రస్తుతం ఆమె తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. స్టార్ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవా హీరోగా నటిస్తున్న వూల్ఫ్ అనే చిత్రంలో అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. వినూ వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చాలా కాలంగా ఇంకా మేకింగ్ దశలోనే ఉంది. చాలా రోజుల క్రితం టీజర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమా పరిస్థితి ఏంటి అనేది ఎవరికీ తెలియదు.
ప్రభుదేవాతో అనసూయ రొమాన్స్
ఇప్పుడు సడెన్ గా హీటెక్కించే రొమాంటిక్ సాంగ్ ని విడుదల చేశారు. 'సా సా'అంటూ సాగే ఈ బోల్డ్ రొమాంటిక్ సాంగ్ లో ప్రభుదేవాతో కలిసి ముగ్గురు భామలు రొమాన్స్ చేస్తున్నారు. అనసూయ, రాయ్ లక్ష్మి, అంజు కురియన్ ఈ సాంగ్ లో ప్రభుదేవాతో రొమాన్స్ పండిస్తున్నారు.
దారుణంగా ట్రోలింగ్
అయితే ఈ సాంగ్ కొరియోగ్రఫీపై విమర్శలు వినిపిస్తున్నాయి. నెటిజన్లు ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సాంగ్ లో ప్రభుదేవాతో హీరోయిన్లు రొమాన్స్ చేయడం వరకు ఓకే కానీ.. అంతకి మించేలా పైత్యం కనిపిస్తోంది అని అంటున్నారు. ఈ సాంగ్ లో ముగ్గురు నటీమణులు ఉన్నారు. ఇద్దరు ప్రభుదేవాతో రొమాన్స్ చేస్తుంటే మరొకరు వీడియోలో రికార్డ్ చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. ఇదెక్కడి పైత్యం అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
శృతి మించేలా రొమాన్స్
సాంగ్ చివర్లో అంజు కురియన్.. ప్రభుదేవా కాలి బొటన వేలుని కొరికినట్లు చూపించడం కూడా శృతి మించినట్లు అనిపిస్తోంది. ఈ సాంగ్ లో అనసూయ బ్లూ శారీలో గ్లామరస్ గా కనిపిస్తోంది. మొత్తంగా ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.