టకీలా తాగి అనసూయ, రష్మీ, శ్రీముఖిలతో పబ్ లో రచ్చ చేసిన ప్రదీప్..!
స్టార్ యాంకర్స్ అందరూ పబ్ లో రచ్చ చేశారు. టకీలా తాగిన అందరూ మాస్ స్టెప్స్ తో ఊగిపోయారు. యూట్యూబ్ లో రచ్చ చేస్తున్న ఈ వీడియో వైరల్ గా మారింది.
ప్రదీప్ హీరోగా వెండితెరపై తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. హీరోగా ఆయన డెబ్యూ మూవీ 30రోజుల్లో ప్రేమించడం ఎలా? జనవరి 29న విడుదల కానుంది.
మంగళవారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. చిత్రం పై పాజిటివ్ బజ్ ఉన్న నేపథ్యంలో ప్రొమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు.
కాగా మూవీ ప్రొమోషన్స్ కోసం ప్రదీప్ పై ఓ ప్రత్యేకమైన సాంగ్ షూట్ చేశారు. వాహ్ వాహ్ అరే బావ.. అంటూ సాగిన సాంగ్ లో ప్రదీప్ మాస్ స్టెప్స్ తో ఇరగదీశారు.
అమ్మాయిల జోలికి వెళ్ళొదంటూ ప్రదీప్ హిత బోధ చేస్తున్న సాంగ్ లో అదిరింది కామెడీ షో ఫేమ్ సద్దాం కూడా కనిపించాడు.
అయితే సాంగ్ చివర్లో అనసూయ, శ్రీముఖి మరియు రష్మీ గౌతమ్ ఒకరి తరువాత ఒకరు ఎంట్రీ ఇవ్వగా... సాంగ్ వీర లెవెల్లో పేలింది.
అయితే సాంగ్ చివర్లో అనసూయ, శ్రీముఖి మరియు రష్మీ గౌతమ్ ఒకరి తరువాత ఒకరు ఎంట్రీ ఇవ్వగా... సాంగ్ వీర లెవెల్లో పేలింది.
మొదట సాంగ్ లోకి అనసూయ ఎంట్రీ ఇచ్చారు. బ్లాక్ కలర్ శారీ, స్లీవ్ లెస్ జాకెట్ లో అనసూయ గ్లామర్ తో చంపేసింది.
ఆ తరువాత మెరుపుల చీరలో మరో స్టార్ యాంకర్ శ్రీముఖి ఎంటర్ కావడం జరిగింది. వీరిద్దరూ చాలదన్నట్లు చివర్లో రష్మీ గౌతమ్ కూడా సాంగ్ లో జాయిన్ అయ్యారు.
ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రదీప్ సాంగ్ లో రెచ్చి పోయి మాస్ స్టెప్స్ వేశారు.
30రోజుల్లో ప్రేమించడం ఎలా? మూవీ ప్రమోషన్స్ కోసం రూపొందించిన ఈ సాంగ్ ఆకట్టుకుంది.
డైరెక్టర్ మున్నా తెరకెక్కించిన ఈ మూవీలో అమ్రితా అయ్యర్ హీరోయిన్ గా నటించారు. ఇప్పటికే సాంగ్స్ కి మంచి ఆదరణ దక్కగా.. మూవీ పై పాజిటివ్ బజ్ ఉంది.