- Home
- Entertainment
- అడవి 'చుక్క' .. కొప్పున పూలెట్టి, చేతిలో కత్తి పట్టిన అనసూయ నాటు అందాలు చూసి తట్టుకోతరమా.. లీకైన ఫోటోలు వైరల్
అడవి 'చుక్క' .. కొప్పున పూలెట్టి, చేతిలో కత్తి పట్టిన అనసూయ నాటు అందాలు చూసి తట్టుకోతరమా.. లీకైన ఫోటోలు వైరల్
`జబర్దస్త్` యాంకర్ అనసూయ హాట్ అందాలతో బుల్లితెరపై హంగామా చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది. బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే అనసూయ గ్లామర్ ఫోటోలతో నిత్యం నెటిజన్లని అలరిస్తుంది.

హాట్ యాంకర్ అనసూయ(Anasuya) ప్రతి వారం గ్లామర్ ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంటుంది. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా కనిపించింది. అందానికి మించిన అందం, పాత్రలో లీనమై కనిపిస్తుంది. సినిమా కోసం ఆమె ఇలా మరింత అడవి బిడ్డలా మారిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సరికొత్త లుక్‌లో అనసూయ నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది.
అనసూయ బుల్లితెరపై అందాలు ఆరబోస్తూ టీవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. టీవీ షోస్‌ని రక్తికట్టిస్తుంది. అయితేగ్లామర్ షో కేవలం టీవీకే పరిమితమని, వెండితెరపై మాత్రం నటనకు ప్రయారిటీ ఇస్తానని చెప్పింది. ఇప్పుడు నటన పరంగా మరింత రక్తికట్టించేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో ఒకటి `వాంటెడ్ పండుగాడ్`. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో విష్ణు ప్రియా, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దీపికా పిల్లి కూడా కీలకపాత్ర పోషిస్తుంది. మొత్తంగా టీవీ యాక్టర్స్ తో చేస్తున్న చిత్రమిది.
ఇటీవల షూటింగ్ లొకేషన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది యూనిట్. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్‌లోని కొన్ని అనసూయ ఫోటోలు బయటకు(లీక్ అయ్యాయి) వచ్చాయి. ఇందులో అనసూయ `చుక్క` అనే కోయ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. కోయ అమ్మాయి గెటప్‌లో ఉన్న లేటెస్ట్ అనసూయ ఫోటోలు సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి. అన్‌సీన్ పిక్స్ నెటిజన్లని కనువిందు చేస్తున్నాయి.
అనసూయ బ్లౌజ్ లేకుండా గిరిజన అమ్మాయిగా ముస్తాబై బుగ్కబై చుక్క పెట్టుకుని ఆద్యంతం కనువిందు చేస్తుంది. కొప్పున పూలు పెట్టి,చేతిలో కత్తి పట్టి, నాటు అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. నెవర్ బిఫోర్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం అనసూయ ఫోటోలు ఆమె అభిమానులనే కాదు, సాధారణ నెటిజన్లకి కూడా మతిపోగొడుతున్నాయి.
అయితే ఇందులో అనసూయ ఓ చేతిలో కత్తి పట్టుకుని, మరో చేతిలో నడుములో చెక్కుకున్న కత్తిని పట్టుకుని కోపంగా చూస్తున్న లుక్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. కత్తితో క్లాత్‌ని చించేస్తూ ఇంటెన్స్ లుక్‌లో అనసూయ అదరహో అనిపిస్తుంది.
గిరిజన అమ్మాయిలా ఉన్నా అనసూయ కత్తిలాఉందని అంటున్నారు నెటిజన్లు. అందం మరింత ఓవర్ లోడ్ అయ్యిందని, ఇంతటి హాట్‌గా ఎప్పుడూ చూడలేదంటున్నారు నెటిజన్లు. ఘాటెక్కించే అందాలు అనసూయ సొంతమంటున్నారు. అనసూయ ఎలా ఉన్న హాట్‌గానే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.
వీటితోపాటు అనసూయ `పుష్ప2`లో ద్రాక్షాయణిగా నటిస్తుంది. అలాగే `రంగమార్తాండ`లో కీలక పాత్ర పోసిస్తుంది. `దర్జా` చిత్రంలో నెగటివ్ షేడ్ ఉన్న రోల్ చేస్తుంది.`సింబా` అనే చిత్రంలో న్యాయం కోసం పోరాడే మహిళగా కనిపించబోతుంది. దీంతోపాటు ఇటీవల తన 35వ పుట్టిన రోజు సందర్భంగా మరో సినిమాని ప్రకటించింది అనసూయ. అలాగే తమిళంలో ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.
`రంగస్థలం`లో రంగమ్మత్తగా విశేషంగా పాపులర్ అయిన అనసూయ మళ్లీ ఆ స్థాయి పాత్రలతో వెండితెరపై మ్యాజిక్ చేయాలనుకుంటుంది. ఇప్పటి వరకు అలాంటి పాత్ర పడలేదు. అదే సమయంలో తన పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలు చేస్తూ చాలా సెలక్టీవ్‌గా ఉంటుంది అనసూయ.