ఇది ఆరంభం మాత్రమే.. ఉన్నపళంగా పవన్ కళ్యాణ్ పై అనసూయ క్రేజీ కామెంట్స్
అనసూయ మాత్రం కంప్లీట్ గా పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు. అయితే సడెన్ గా అనసూయ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో సాధించిన విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Anasuya Bharadwaj
అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తోంది. గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
సినిమాలు తన కుటుంబ విషయాలు తప్ప రాజకీయాల గురించి అనసూయ కామెంట్స్ చేయడం చాలా అరుదు. అయితే మహిళలకు సంబంధించిన విషయాల్లో, తనపై ట్రోలింగ్ జరిగినప్పుడు అనసూయ ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది. చాలా మంది టాలీవుడ్ సెలెబ్రిటీలు ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తమకి నచ్చిన పార్టీకి సపోర్ట్ చేస్తూ బిజీగా కనిపించారు.
కానీ అనసూయ పాలిటిక్స్ జోలికి వెళ్లకుండా తన ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తూ, తన సినిమాలు చేసుకుంటూ గడిపింది. యాంకర్ శ్యామల వైసీపీకి మద్దతు ఇస్తూ ఎన్నికల ప్రచారం చేసింది. పవన్ పై ఘాటైన విమర్శలు కూడా చేసింది. అయితే అనసూయ మాత్రం కంప్లీట్ గా పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు.
అయితే సడెన్ గా అనసూయ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో సాధించిన విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అది కూడా సరైన టైంలో స్పందించింది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు.
గురువారం రోజు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. అక్కడ మెగా కుటుంబ సభ్యులు రాంచరణ్ ఉపాసన, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి, చిరంజీవి సురేఖ దంపతులు, అక్క చెలెళ్ళు పవన్ కి ఘనస్వాగతం పలికారు. మంగళ హారతులు పట్టారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి, సురేఖ, తన తల్లి అంజనా దేవి ఆశీస్సులు తీసుకున్నారు. సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రతి మెగా అభిమాని ఎమోషనల్ అయ్యేలా అన్నదమ్ముల మధ్య ఆప్యాయతలు వెల్లివిరిసాయి.
ఈ దృశ్యాలని అనసూయ పోస్ట్ చేస్తూ క్రేజీ కామెంట్స్ చేసింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. నాయకుడు వచ్చాడు.. పవర్ లో పవర్ స్టార్ అంటూ అనసూయ పోస్ట్ చేసింది. ఇది నిజమైన ప్రేమ అంటూ చిరంజీవి, పవన్ మధ్య అనుబంధం గురించి పోస్ట్ చేసింది. అనసూయ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.