Sankranthi 2022: సంక్రాంతి సంబరాల జోష్ లో అనసూయ.. లంగాఓణీలో నడుము వొంపులు
అనసూయ సంక్రాంతి సంబరాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నేడు జబర్దస్త్ షోలో జరిగే సంక్రాంతి సంబరాల కోసం అనసూయ సాంప్రదాయమైన లంగాఓణీలో మెరిసింది.

అనసూయ బుల్లితెరపై ఎంతటి స్టార్ యాంకరో వెండితెరపై కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది.
ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వెండితెరపై కూడా పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తోం
సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు. ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తోంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.
టాలీవుడ్ లో అనసూయతో పోటీ పడే యాంకర్స్ చాలా మందే ఉన్నారు. కానీ వారందరికీ అనసూయ తరహాలో వెండితెరపై ఛాన్సులు రావడం లేదు. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. తాజాగా అనసూయ సంక్రాంతి సంబరాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నేడు జబర్దస్త్ షోలో జరిగే సంక్రాంతి సంబరాల కోసం అనసూయ సాంప్రదాయమైన లంగాఓణీలో మెరిసింది. సంక్రాంతి వైబ్స్ మొత్తం అనసూయలోనే కనిపిస్తున్నాయి.
నడుము అందాలు ఆరబోస్తూ అనసూయ చిరునవ్వుతో ఇచ్చిన ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. ముక్కుకు ముక్కెర, ఎల్లో లంగాఓణీ, గ్రీన్ బ్లౌజ్ లో అనసూయ అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.
నా గ్లామర్ ని టివిలో చూస్తూనే ఉన్నారు. ఇక్కడ సినిమాల్లో మాత్రం మిమ్మల్ని సర్ ప్రైజ్ చేయాలనే కంకణం కట్టుకున్నా అంటూ వైవిధ్యమైన పాత్రల గురించి అనసూయ గతంలో తెలిపింది.